Saturday, January 06, 2018

మధుమేహం గురించి ఎందుకు తెలుసుకోవాలి ?

మధుమేహం గురించి ఎందుకు తెలుసుకోవాలి ?


మధుమేహం సాధారణంగా కనిపించే వ్యాధి. ఎవరికైనా ఉండవచ్చు. మన దేశంలో క్రమంగా మారుతున్న వాతావరణ పరిస్థితులు, పారిశ్రామికీకరణ, నగరీ కరణ, ప్రజల జీవనవిధానాలలో మార్పులు. ఇలా అనేక అంశాలతోపాటు మధుమేహపు కేసులు కూడా పెరుగుతున్నాయి.
దురదృష్టవశాత్తూ వ్యాధిగ్రస్తుల్లో 50 శాతం మందికి తమకు మధుమేహం ఉన్నట్టు తెలియదు. ఇప్పుడు మన దేశంలో జరిగే మరణాలకు మధుమేహం ఒక ప్రధాన కారణమైంది. అవగాహనా లోపం దీనికి కారణం
మధుమేహానికి గురి కావడం సాధారణంగా మన చేతుల్లో లేకపోయినప్పటికీ, దానిని అదుపులో ఉంచుకోవడం మాత్రం మన చేతుల్లోనే ఉంది.
ఎక్కువ మోతాదులో మూత్రం (మేహం) వెళుతుంది. కనుక దీనికి ప్రమేహ మని పేరు, మూత్రం చక్కెరతో (మధు) కలిసి విసర్జితమవుతుంది కనుక దీనికి మధుమేహమని పేరు వచ్చింది. దీనిలో అతి-మూత్రత (మూత్రం ఎక్కువ మోతాదులో రావడం), అవిల - మూత్రత (మూత్రం చిక్కగా రావడం) వంటివి ఉంటాయి. డయాబెటిస్' అనేది గ్రీకు పదం. ప్రవహించడమని దీనికి అర్థం. అలాగే "మెల్లిటస్ అనేది లాటిన్ పదం. తేనె అని అర్థం. డయాబెటిస్ మెల్లిటస్ అంటే తేనె వంటి ద్రవం శరీరం నుంచి ప్రవహించడమని అర్థం.. ఈ పాంక్రియాస్ ఇన్సులిన్ ను పూర్తిస్థాయిలో విడుదల చేయలేకపోవడంతో రక్తంలో ఉన్న చక్కెర నిల్వలు కణజాలాలలోకి వెళ్లలేవు. దీనితో శరీరానికి రావలసిన శక్తి అందకపోగా, గుండె, మూత్రపిండాల వంటి ప్రధాన అంతర్గత అవయవాల మీద అదనపు వత్తిడి పడుతుంది. ఈ విధంగా మధుమేహమూ, దానిని అనుసరించి అన్ని అవయవాలకు ఇక్కట్లు వస్తాయి
మధుమేహం ప్రధానంగా రెండు రకాలనీ, వంశపారంపర్యత మొదలైన సహజ కారణాల చేత వచ్చేది మొదటి రకమనీ, అపథ్యాలైన ఆహార విహారాలను పాటించడం వలన సంక్రమించేది రెండవ రకమనీ పేర్కొన్నారు.
 టైప్ 1 డయాబెటిస్ /మొదటి రకాన్ని ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ లేదా జువనైల్ డయాబెటిస్ అని
టైప్ 2డయాబెటిస్/ రెండవ రకాన్ని నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ లేదా మెచ్యూరీటి ఆన్ సెట్ డయాబెటిస్‌ అని కూడా వ్యవహరించేవారు
మధుమేహం వ్యాధి ఇటీవల కాలంలో మన దేశంలో బాగా పెరిగినట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ మన దేశంలో అగ్రగామిగా ఉందని, హైదరాబాద్ మధుమేహ నగరంగా ముందుందని తెలుస్తుంది,
చాప క్రింద నీరులా మధుమేహం వ్యాప్తి జరుగుతుంది. ప్రపంచానికే మధుమేహ రాజధానిగా మనదేశం ప్రసిద్ధికెక్కింది. సుమారుగా 50 మిలియన్లకు పైగా ఇప్పటికే మన దేశంలో మధుమేహం బారిన పడ్డారు. ఈ సంఖ్య 2030 నాటికి 80-100 మిలియన్లకు పెరగ వచ్చని ఒక అంచనా,
దురదృష్టం కొద్ది మధుమేహ వ్యాధి లక్షణాలు  కొత్తలో అంతగా ఇబ్బంది పెట్టేవి కాదు. అందుకే దానిని అంతగా పట్టించుకోము. నష్టం జరిగిన తరువాత గాని నిజ స్వరూపం బయటపడదు. కాబట్టే దానిని సైలెంట్ కిల్లర్" అంటారు. మధుమేహం ఉన్నదని మధుమేహం ఉన్న వాళ్ళకు 50% మందికి తెలీనే తెలియదు, తెలుసుకున్న వాళ్ళల్లో 50% మంది మాత్రమే తగిన వైద్యాన్ని తీసుకొంటున్నారు.
మధుమేహం వలన నరాలు, గుండె, ఊపిరితిత్తులు, రక్తనాళాలు, మూత్రపిండాలు, కళ్ళ, పాదాల లాంటి ఎన్నో అవయవాలు దెబ్బతింటాయి. కాబట్టి మధు మేహం గురించి అందరు తప్పక తెలుసుకొని దాని నుంచి రక్షణ పొందాలి

Thursday, January 04, 2018

మనం కేవలం భూమి ఉపరితలం పై నుండి తెల్ల బియ్యం మరియు సోడా వెండింగ్ యంత్రాలు తుడిచివేసి ఉంటే. మనం డయాబెటిస్’పై మరింత విజయం సాధించగలము

మనం  కేవలం భూమి ఉపరితలం పై  నుండి తెల్ల  బియ్యం మరియు సోడా వెండింగ్ యంత్రాలు తుడిచివేసి ఉంటే. మనం డయాబెటిస్’పై  మరింత విజయం సాధించగలము
మొన్ననే  ఒక వృద్ధ మహిళ  డయాబెటిస్  చికిత్స  చేస్తుంటే, ఆమె తన బరువు మరియు
గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ (HbA1c) ఉండాల్సిన  చోట ఉంచడానికి పోరాడుతున్నది  ఆమె కుమార్తె ఇటీవల తన ఉద్యోగాన్ని కోల్పోయింది, దాంతో , గృహ ఆదాయం పడిపోవడం,అది  తక్షణమే
 ఆమె ఆరోగ్యం మీద ప్రభావం చూపడం జరిగింది.
తాజా కాయగూరలు చాలా ఖరీదైనవి ఇవి ఆమె ఆహారంలో , ఒక సాధారణ భాగంగా ఉండడం వీలు కాలేదు.
అందువల్ల రోజు  బంగాళదుంపలు మరియు తెల్ల బియ్యం కి తిరిగి పడిపోయింది.అంటే దాంతో గడియారం ముళ్ళు వెనక్కి తిరిగి నట్టు ఆమె రక్త గ్లూకోజ్ పై పైకి పెరిగింది. వాస్తవానికి,అందరి కథా  పూర్తిగా విషాదకరం కాదు.నా రోగుల్లో కొందరు చికిత్సతో గొప్ప విజయం సాధించారు.వారు కిన్’వా , పాలకూర , మరియు శారీరక శ్రమ కీర్తిని, గుణగణాలను  కొనియాడే పాటలు పాడుతూ కొంతమంది తమ జీవితాలను పూర్తిగా మార్చేసారు వారి విజయాలు నాకు  మరియు తరచుగా ఇతర రోగులకు స్పూర్తిదాయకమైనవి కానీ నా రోగుల్లో ఎక్కువ మంది నిరాశకు గురైన మధ్య ప్రాంతంలో నివసిస్తున్నారు.
వారు త్యాగాలు మరియు మార్పులు చేశారు. ఎంతో  ప్రయత్నం చేశారు
కానీ ఫలితాలు స్వల్పంగా ఉన్నాయి. ఆ ఆఖరి  30 పౌండ్లు అసలు తగ్గనంటున్నాయి . HbA1c  ఏమో 8% కంటే కిందికి  దిగి రానంటోంది ఇన్సులిన్ డోసేమో  మెల్లమెల్లగా  పైకి పాకుతోంది
డయాబెటిస్ తో అనుబంధ హైపర్ టెన్షన్, హైపర్లిపిడెమియా, మరియు కార్డియాక్ వ్యాధులకు సంబందించిన  మాత్రల సంఖ్య ఒకటికి  పదింతలవుతున్నది
నేను ఎప్పుడూ  ఆశావాదిగా ఉండడానికి ప్రయత్నిస్తుంటాను
నా రోగులు చేస్తున్న కృషిని   పెరుగుతున్న మార్పులను నిరంతరం  ప్రోత్సహిస్తుంటాను
కానీ ఓడిపోతున్నట్లు ఫీలవ్వకుండా ఉండడం కష్టం
తాజా మరియు గొప్ప  గొప్ప మందులు చెప్పుకోదగిన మార్పులను అందించవు. మార్కెట్లో ప్రతి క్రొత్తది వస్తుంటే  అది  డబ్బు దండగ చేసే పనిలాగే అనిపిస్తుంటుంది
నా రోగులలో కొంతమందికి గ్లైసెమిక్ నియంత్రణలో గణనీయమైన అభివృద్దిని అందించిన ముఖ్య పరిణామాలు,  ఇన్సులిన్ సిరంజి లలో  లేదా జీర్ణశయాంతర ప్రేగులలోను  ప్లంబింగ్ గొట్టాల  ప్రాంతంలో ఉన్నాయి.
ఇన్సులిన్ సిరంజి, దాని భయపెట్టే సూదులు మరియు లోడింగ్, క్లిష్టమైన మెకానిక్స్, మామూలుగా నా రోగులను  భయ పెడుతుంది.
వారు ఒక సిరంజి దగ్గరకు వచ్చేందు కంటే , ఎన్నో రకాల  ఓరల్ డయాబెటిక్  మాత్రల  ప్రక్క దుష్ప్రభావాలు బరించేందుకు ఇష్ట పడుతున్నారు
కానీ ఇన్సులిన్ పెన్,    దోమకాటు కంటే తక్కువ నొప్పి కలిగించే దాని సున్నితమైన సూది, దీన్ని పూర్తిగా మార్చేసింది.ఇది ఉపయోగించడానికి ఒక నర్సింగ్ డిగ్రీ అవసరం లేదు. రెటినోపతి ఉన్న రోగులందరూ ఇప్పుడు సరిగ్గా మోతాదును అమర్చవచ్చు.
ఇతర ఉత్తేజకరమైన ప్లంబింగ్ సర్దుబాటు, ఖచ్చితంగా బారియాట్రిక్ శస్త్రచికిత్స.చాలా సంవత్సరాలు నేను  బారియాట్రిక్ శస్త్రచికిత్స. గురించి ఒక సంశయవాదిని .  సరిగ్గా పనిచేయకుండా,అన్ని తప్పు ఆహారాలు  తినమనే మన  సామాజిక ఒత్తిళ్లను, శస్త్రచికిత్సతో సరిదిద్దడం పట్ల నాకు అసంతృప్తి  నాకు అది ఒక  తప్పుడు మార్గం అనిపించేది . ఐతే  అద్భుతంగా పూర్తిగా మారిన నా కొందరు రోగుల జీవితాలను నేను ఇటీవల  చూశాను. నేను బారియాట్రిక్ శస్త్రచికిత్సను ఆయుధశాలలో ఒక చట్టబద్దమైన సాధనంగా అంగీకరించాను, అయినప్పటికీ ఖచ్చితంగా మొదటి సాధనంగా తీసుకోను
కానీ బారియాట్రిక్స్ మరియు ఇన్సులిన్ పెన్నులు పక్కన పెడితే మధుమేహం వైద్యులు మరియు రోగులు కూడా ఒక నిస్తేజమైన స్లాగ్/వెట్టి చాకిరిగా  ఉంది. ప్రపంచం మాకు వ్యతిరేకంగా కుట్ర పడుతున్నట్లు అనిపించవచ్చు,
సూపర్ పరిమాణం, సూపర్ చౌక, సూపర్ లౌసీ ఆహారం మరియు మా కండరాల ఫిట్నెస్ మూవింగ్ ది రిమోట్ కి  పరిమితం చేసే మరింత సర్వవ్యాప్తి  ప్రేరేపిత సాంకేతిక పరిసరాల  మధ్య ఉంటున్నాము


మనం  కేవలం భూమి ఉపరితలం పై  నుండి తెల్ల  బియ్యం మరియు సోడా వెండింగ్ యంత్రాలు తుడిచివేసి ఉంటే. మనం డయాబెటిస్’పై  మరింత విజయం సాధించగలము అనే  ఆలోచనను పరిగణలోకి తీసుకున్న రోజులు  ఎన్నో ఉన్నాయి

What is INDAIBETES interested in?


 Our tagline  " Let us stop the  Epidemic"

We are interested in all kinds of human scientific inquiry regarding diabetes: epidemiology, physiology, pharmacotherapeutics, behavioral interventions, health system research, and public health.

With an Indian flavor.
 concentrating on India, Indians and related the Indian culture Food habits, economics, and availability of care.

Information Overload in Diabetes

 Just on one website a search for Diabetes shows 984866 articles!

So how to cope up and make sense?

Just in last 4 days of 2018, there were 242 articles!

So how do I decide  What is  good  and  what is  Chaff when I try to translate some of this information into Indian  regional languages
 Science articles  from

Europe PMC


 
Agricola records
639,439
 
Abstracts
33 million, 28 million from PubMed
 
NHS guidelines
857
 
 
Full-text articles
4.5 million

Results

1 - 25 of 984866 results
Sort by: Relevance | Date  | Times Cited 
1 2 3 4 5 ... Next 
Select results 1 - 25
 

1 - 25 of 984866 results
Sort by: Relevance | Date  | Times Cited