Wednesday, July 25, 2018

అఱసున్న

  ఫ్రొం గూగుల్మొ గ్రూప్ద 

12/12/08
 తాడేపల్లి Lalitha Bala Subrahmanyam Tadepalli 

అఱసున్న
ట ఒక విషయం. అఱసున్న కాలగర్భంలో కలవలేదు. ఇప్పటికీ జవజీవాలతో పిటపిటలాడుతోంది. దాన్ని కాలగర్భంలో కలుపుతామని డంబాలు పలికినవాళ్ళే కాలగర్భంలో కలిసిపోయారు. అఱసున్న మాత్రం అజేయంగా నిలిచింది. సర్వే సర్వత్రా విఱివిగా వాడబడుతోంది. ముక్కుతో పలికే అక్షరాలున్నంతకాలమూ అది వాడుకలో ఉంటూనే ఉంటుంది. వివిధ పత్రికల్లో వాడబడే ఈ క్రింది పదాల్ని గమనించండి:
మావఁయ్య, ఏఁవండీ, మేవుఁ. 
వీటన్నింటిలోను రెండో అక్షరాన్ని ముక్కుతో పలుకుతాం. కనుక ఆ ఉచ్చారణని సూచించడం కోసం అఱసున్న వాడాలి.
ముక్కుతో పలికే అక్షరాలున్న భాషలు చాలా ఉన్నాయి. హిందీ, ఫ్రెంచి మొదలైనవి. ఆయా భాషల్ని ప్రాథమికంగా మన లిపిలో రాసుకొని నేఋచుకోవాలన్నా మనకి అఱసున్న ఉపకరిస్తుంది.
అఱసున్న భాషాచరిత్రని సూచిస్తుంది. ఇప్పుడు అఱసున్న ఉన్న స్థానంలో ఒకప్పుడు నిండుసున్న ఉండేది.
ఉదా:- వీఁడు = వీండు
వెలుఁగు = వెలుంగు
(అఱసున్న లేని వెలుగు ఇంకొకటుంది. దానికి కంచె అని అర్థం)
దాఁటు = దంటు
పేఁడ = పెండ
పేఁట = పెంట
ఇలా ఆధునిక లిపిలోనే పదం యొక్క చరిత్రని కూడా సూచించడం తెలుగులోనే కాదు. అన్ని భాషల్లోను ఉన్న రివాజే. "ఈరోజు మనం పలకడంలేదు గదా" అని పదచరిత్రని ఎవరూ భూస్థాపితం చెయ్యరు. ఉదాహరణకి ఇంగ్లీషులో walk, bite, iron మొదలైన పదాల్లో మిగిలిపోయిన silent letters. ఇవి పూర్వకాలంలో silent letters కావు. వాటిని ఒకప్పుడు స్పష్టంగా పలికేవారు. మన అఱసున్నని కూడా అలాంటి silent letters లాంటిదిగా భావించవచ్చు.
వాస్తవానికి అఱసున్న అనే అక్షరం ప్రాచీన తెలుగులో రాతపూర్వకంగా లేదు. అఱసున్న అనే ఉహించుకోదగ్గ కాన్సెప్టు మాత్రం ఉండేది. దాని రూపురేఖల్ని భౌతికంగా సృష్టించి ముద్రణాలయాల్లో ప్రవేశపెట్టినది కీ.శే.C.F.Brown దొరగారు. అంతకుముందు అఱసున్ననీ, నిండుసున్ననీ వేఱుచేసి చూపడం కోసం తమాషాగా రాసేవారు.
ఉదా:- వీండు = ఇది అఱసున్న గల రూపంగా భావించేవారు.
వీండ్డు = దీన్ని నిండుసున్న గల రూపంగా భావించేవారు.
ఇప్పుడు ఏ పదాల్లో అఱసున్న ఉన్నదీ, వేటిలో లేనిదీ తెలుసుకోవాలంటే సాంప్రదాయిక నిఘంటువుల్ని సంప్రదించాలి.

No comments: