Tuesday, July 24, 2018

తెనుగు పోయెట్రీ బై ముస్లిమ్స్


Telugu Poetry తెలుగు కవిత్వం
February 6, 2014 ·
Shamshad Mohammed
డాలర్ లైఫ్

అమెరికా ఇప్పుడు నా అత్తారిల్లయ్యింది
పురిటికైనా పుట్టింటికెళ్ళె యొగం లేదు
పుట్టబొయే బిడ్డ సిటిజన్ కావాలని
భర్తే బొడ్డుపేగు కోసే మంత్రసానవుతాడు
డైపర్లు మార్చే అమ్మమ్మా అవుతాడు

ప్రతి డాలర్ ని రూపాయలలో లెక్కలేసుకొని
బంధాలని అనుబంధాలని ఏడేడు సముద్రాల దూరం చేస్తుంటే
ఐదు సంవత్సరాలకైనా పుట్టినగడ్డలో ఉంటామనే ఆశను
గ్రీన్ కార్డ్ ల ప్రయత్నాలు తుంచేస్తుంటే

రిటైర్ అయిన తండ్రి యాభైపడిలోతల్లి
ఆరొగ్యాలెలా ఉన్నాయొ అనే ఆలోచనలు ఏ కీడో శంకిస్తే
కళ్ళనీళ్ళు కళ్ళలోనే యింకబెట్టుకొని
కనపడని అల్లానో జీసెస్ నో రాముడ్నో తలుచుకొని
ఫొన్ చెయ్యటానికి పది డాలర్లకి పదిరోజులు యుద్దంచేసి
కుశల ప్రశ్నలతో ఉప్పొంగే మనసు

ఎప్పటికో దొరికిన అవకాశం కొండంత
సంబరంగా ఆకాశంలోకి ఎగిరాము
విమానం కన్నా నా ఆలొచనల వేగమే ఎక్కువైంది

నా బాల్యపు బుట్టలోని జ్ఞాపకాల పండ్లను
నా పిల్లలకి తినిపించాలనుకున్నాను
మట్టిని చూస్తే డర్టి అనే పిల్లలకి
వెన్నెల కుప్పలాటని ఎలాచూపను

వర్షంలో తడుస్తూ కాగితప్పడవలాటలో
ఏడురంగులై వికసించిన జ్ఞాపకం
ఉరుకుల పరుగుల పందాలను కంప్యూటర్లో
బటన్లు నొక్కుతూ కురవని వర్షంలో తడుస్తున్న వాడి ముఖం

రోడ్లపై బొంగరమై తిరిగిన నా బాల్యం
ప్లాస్టిక్ బొచ్చెలో బొంగరాన్ని తిప్పే ఆనందం వాడిది
వెనుక పిన్నీసులాటకే గుచ్చుకుంటుందని భయపడిన బాల్యం నాది
గన్నులతో ఆట ప్రత్యక్షంగా తిలకించాల్సొచ్చిన బాల్యం వాడిదైనప్పుడు

వాడి బాల్యం వాడికి మోడ్రన్ అయినప్పుడు
నా బాల్యం రుచి అందని చేదు పండే

అమెరికాకి దారిని కనుక్కున్నవాడు చచ్చాడు కాబట్టి
బ్రతికిపోయాడనుకుంటూ
కంప్యూటర్ని కనుక్కున్నవాడ్ని కసితీరా
మనసులో తిట్టుకుంటూ

తప్పని తిరుగు ప్రయాణం

---- షంషాద్

No comments: