Home >>
‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నది పాత మాట. ఇప్పుడు ప్రజల అనారోగ్యమే కొందరికి వరమైపోయింది. రోగగ్రస్థ సమాజంతోనే లాభాలను పిండుకునే పరిస్థితులు దాపురించాయి. దీనికి కొందరు వ్యక్తుల తప్పుడు ధోరణులు మాత్రమే కారణంకాదు, ప్రభుత్వ విధానాల లోపమే కారణమైనప్పుడు ఫలితాలు ఎంత భయానకంగా ఉంటా యో నేడు కనిపిస్తున్నది. ప్రజల ఆరోగ్యం పట్ల పాలకుల విధానలోపం, నిర్లక్ష్యం వెరసి ప్రజల పాలిట శాపంగా మారింది. ‘ఆమ్ ఆద్మీ’ ప్రభుత్వంగా చెప్పుకుంటున్న పాలనలో ప్రజల ప్రాణాలకు భరోసా లేకుండా పోయింది. ప్రజల ఆరోగ్యం పట్ల పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా గత కొన్ని దశాబ్దాలుగా ఆరోగ్యానికి కేటాయిస్తున్న బడ్జెట్ నిధులే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.
ఆ మధ్యన కేంద్ర మంత్రి జై రాం రమేష్ ‘ప్రతి గ్రామంలో దేవాలయం కన్నా ఓ‘లావూటిన్’ కట్టించడం మేల’ని సంచలనాత్మక ప్రకటన చేశారు. దీంతో ఒక్కసారిగా దేశంలో ప్రజారోగ్యం, స్థితిగతులపై పెద్దఎత్తున చర్చ మొదలైంది. ప్రజల ఆరోగ్యానికి సంబంధించి, కనీస అవసరాలు, సాని గురించి అందరూ మాట్లాడే పరిస్థితి వచ్చింది ‘ప్రభుత్వ గ్రామీణ ఆరోగ్య యంత్రాంగం ప్రజారోగ్య రక్షణలో పూర్తిగా విఫలమైనద’ని కేంద్ర మంత్రి జైరాం రమేష్ స్వయంగా అంగీకరించారు. కనీస వైద్య సదుపాయాలు కూడా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు కల్పించలేకపోతున్నాయి. అత్యవసరమైన మందులు అందుబాటులో ఉండటంలేదు. ఇది పూర్తిగా ప్రభు త్వ వైఫల్యమేనని వేరే చెప్పక్కరలేదు. దీంతోప్రజల ఆరోగ్యం గాలిలో దీపం గా మారింది. ఈపరిస్థితుల్లో ప్రజలు తమ ఆరోగ్యం కోసం తమ కష్టార్జితంలో 70 శాతం పైగా ఖర్చు చేయాల్సి వస్తున్నది.దీంతో కోట్లాది మందికి ఆరోగ్య రక్షణే మోయలేని భారంగా మారింది. ఆరోగ్యం కోసం చేస్తున్న ఖర్చులతో ప్రజలు అప్పుల పాలవుతున్నారు.కనీస అవసరాలు తీరక, మౌలిక సదుపాయాలు లేక ఆత్మగౌరవాన్ని నిలుపుకోలేని స్థితి లో చితికిపోతున్నారు.
దేశంలో దాదాపు 65 శాతం మందికి కనీస సాని సదుపాయాలు లేక ఆరు బయటనే కాలకృత్యాలుతీర్చుకుంటున్నారు. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే సాని సదుపాయాలు లేకుంటే అంటురోగాలు, అనారోగ్యానికి అంతేలేదు. 2011జనాభా లెక్కల ప్రకారం పట్టణాల్లోని 59 శాతంపైగా ఇళ్లలో టాయిపూట్లు లేవు. గ్రామీణ ప్రాంతాల్లోనైతే 80శాతంపైగా ఇళ్లలో మరుగుదొడ్లు లేవు. దీంతో సాధారణ గ్రామీణ పేదలు ఆరు బయట కాలకృత్యాలు తీర్చుకోక తప్పని పరిస్థితిఉన్నది. జార్ఖండ్ రాష్ట్రంలో 77శాతంపైగా ఇళ్లలో టాయిపూట్ సాదుపాయం లేదు. ఒడిషాలో76.6శాతం, బీహార్‌లో 75.8 శాతం ఇళ్లలో టాయిపూట్లు లేవు. దేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరు రోజుకు 50 రూపాయల కన్నా తక్కువ ఆదాయంగలవారు ఉంటే ఈ మౌలిక సదుపాయాల కల్పనను ఎవరు పట్టించుకోవాలి?
ఇంకా భయంకరమైన వాస్తవం ఏమంటే.. దేశంలో మూడింట రెండు వంతుల ఇళ్లలో మంచినీటి సౌకర్యంలేదు.
రక్షిత మంచినీరు అందించే ‘నలా’్ల (ట్యాప్)సౌకర్యం అసలేలేదు. డ్రైనేజీ సిస్టం సరేసరి. ఎక్కడా భూగర్భ మురుగుకాల్వ వ్యవస్థ లేదు. 36 శాతం కుటుంబాలు తమ తాగునీటి కోసం కిలోమీటర్‌కన్నా ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సి వస్తున్నది. ఇప్పటికీ 55 శాతం మంది గత్యంతరంలేని పరిస్థితుల్లో ఆరుబయటే స్నానం చేయాల్సిన దుస్థితి. ఇక కరువు పీడిత ప్రాతాల స్థితి అయితే దారుణం. గుక్కెడు మంచినీటి కోసం కోటి కష్టాలు పడుతున్నారు. ఆంధ్రవూపదేశ్‌లోని పలు ప్రాంతాలతోపాటు, ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్, రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, ఒడిషా రాష్ట్రాల్లోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలు కూడా కనీస నీటి అవసరాలు తీరక అల్లాడుతున్నాయి.
వీటన్నింటికితోడు అమానవీయమైన విషయం ఏమంటే నేటికీ లాట్రి న్, టాయిపూట్‌లను మనిషే శుభ్రం చేసి, మలమూవూతాలను తలపై మోసే పరిస్థితి ఉన్నది. ఇప్పటికీ ఓఅంచనా ప్రకారం 13లక్షల టాయిపూట్స్ నుంచి మల మూవూతాలను నేరుగా రోడ్లమీదికే వదులుతున్నారు. 25 కోట్ల కుటుంబాలు నేటికీ మరుగుదొడ్ల శుభ్రతకు సాటి మనుషులపైనే ఆధారపడుతున్నారు.
విషాదమేమంటే..దాదాపుగా 20 వేల మందికి, 28 గ్రామాలకు ఒక డాక్టర్ అందుబాటులో ఉన్నాడు. సుమారు 20 కోట్ల మంది గ్రామీణ ప్రజలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. 50 శాతమంది పిల్లలు పౌష్టికాహారలోపంతో చనిపోతున్నారు. ఇంకా 43 శాతం మంది పిల్లలు తక్కువ బరువుతో అనారోగ్య పీడితులుగా ఉన్నారు. ప్రతియేటా లక్షా 36వేల మంది గర్భిణీ స్త్రీలు ప్రసవ సమయంలో చనిపోతున్నారని ఐక్యరాజ్యసమితి గణాంకాలే చెబుతున్నాయి.మొత్తం గర్భిణీ స్త్రీలలో 20 శాతం మంది పౌష్టికాహారలోపం, రక్తహీనతతో బాధపడుతున్నారు. స్వాతంత్య్రం వచ్చి ఆరు దశాబ్దాలు దాటుతున్నా అంటురోగాలతో జనం అల్లాడుతూనే ఉన్నారు. కనీస జాగ్రత్తలతో దూరం చేసే విషజ్వరాలు, సీజనల్ వ్యాధులు కూడా ప్రజలను పీడిస్తూనే ఉన్నాయి. మదుమేహం, క్యాన్సర్, గుండె సంబంధిత రోగాలతో జనం స్మశాన వాటికకు చేరుతున్నారు. తీవ్రమైన రోగాలకు అవసరమైన రోగ నిర్ధారణ ప్రక్రియలు,మందులు అందుబాటులో లేక ప్రజలు చావుకు దగ్గరవుతున్నా రు. 2011 లెక్కల ప్రకారం టైప్-2 రకం మదుమేహం రోగులు 6కోట్ల 20 లక్షలకు పైగా ఉన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే మదుమేహ రోగుల సంఖ్య పది శాతం పెరిగింది. పరిస్థితి ఇలానే ఉంటే 2030 నాటికి దేశంలో డయాబెటిక్ రోగుల సంఖ్య పదికోట్లకు చేరుకుంటుందని అంతర్జాతీయ డయాబెటిస్ ఫెడరేషన్ పేర్కొన్నది.
ప్రజల జీవన పరిస్థితులు, ఆరోగ్య స్థితిగతులు ఇలా ఉంటే.. ప్రభుత్వ ఆసుపవూతుల పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కనీస సదుపాయాల లేమితో పాటు, కనీస రోగ నిరోధక, రక్షణ సదుపాయాలు లేక ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయి.ఈ స్థితిలో మనం ఏం చేయాలి? ఎటు పోవాలి? పాలకుల్లో చిత్తశుద్ధి ఉంటే వీటన్నింటికీ పరిష్కారాలు ఉంటాయి. సంక్షే మ రాజ్యం ప్రజల జీవించే హక్కును గ్యారంటీ చేయడమంటే..ఆరోగ్యానికి పూర్తి హామీ పడటమే. ప్రజల సంపూర్ణ ఆరోగ్యానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకోవాలి. ప్రజారోగ్యాన్ని కాపాడే బాధ్యతను స్వీకరించాలి. అన్నిరకాల రోగాల బారినుంచి ప్రజలను రక్షించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకుని అందుకవసరమైన మందులనూ, చికిత్సలను ఉచితంగా అందుబాటులో ఉంచాలి. రోగ నిరోధక, రక్ష ణ, నివారణ బాధ్యతలను కూడా ప్రభుత్వమే తీసుకోవాలి. దీనికోసం గాను అవసరమైన ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేయాలి. గ్రామం మొదలు పట్టణం దాకా అందరికీ వైద్య కేంద్రాలను అందుబాటులో ఉంచాలి. సుశిక్షితులైన వైద్యులను ప్రజలకు చేరువలో ఉంచాలి. దీనికి కావలసింది ప్రజల ఆరోగ్యంపై, ప్రాణాలపై పాలకులకు ప్రేమ ఉండాలి. బాధ్యత ఉండాలి.ఆమ్ ఆద్మీ అనాథగా మారి అతని ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోకూడదు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం ప్రకారం అతి తక్కువ బడ్జెట్‌ను ప్రజారోగ్యం కోసం కేటాయిస్తున్న దేశాల్లో భారత్ అగ్రభాగాన ఉన్నది. దీంతో ప్రజలకు కనీస ఆరోగ్యం, సాని పౌష్టికాహారం అనేవి అందని ద్రాక్షలా తయారయ్యాయి. 2010 లెక్కల ప్రకారం స్థూల జాతీయోత్పత్తిలో కేవలం నాలుగు శాతం కేటాయిస్తున్నారు. ఇది అత్యంత వెనుకబడిన ఆఫ్రికన్ దేశాలు, అఫ్ఘనిస్థాన్ దేశాలు కేటాయిస్తున్న దానికంటే తక్కువ. అదే అభివృద్ధి చెందిన దేశాలు ప్రజారోగ్యం, సాని కోసం 10 శాతం ఖర్చు చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజారోగ్యం ఆశించిన స్థాయిలో ఉండాలంటే, మౌలిక సదుపాయలు కల్పించాలంటే ప్రజారోగ్యానికి బడ్జెట్ కేటాయింపులు పెరగాల్సిన అవసరం ఉన్నది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మన్మోహన్‌సింగ్ వచ్చే 12వ పంచవర్ష ప్రణాళికలో ఇప్పుడున్న కేటాయింపుల కంటే మూడు రెట్లు పెంచుతామని ప్రకటించారు. సమస్య తీవ్రత తెరమీదికి వచ్చినప్పుడే సమస్యను పట్టించుకున్నట్లు కాకుండా.. సమస్య నివారణ కోసం చిత్తశుద్ధిగా కృషి చేయాలి. ప్రజారోగ్యాన్ని పట్టించుకుని దేశ ప్రజల ప్రాణాలను కాపాడాలి. ప్రజారోగ్యానికి పునాదిగా ఉండే అత్యావశ్యకమైన సాని సదుపాయాలను, పౌష్టికాహారాన్ని అందరికీ అందించాలి. అప్పుడు మాత్రమే దేశం ‘ఆరోగ్య భారత్’ విలసిల్లుతుంది.

-పూనమ్ ఐ కౌశిష్
(ఇండియా న్యూస్ అండ్ ఫీచర్ అలయె
(ఇండియా న్యూస్ అండ్ ఫీచర్ అలయె