Saturday, December 31, 2016

mirroring Telugu literature of Adluri collection నారాయణ శతకము by బమ్మెర పోతన

స 


నారాయణ శతకము

బమ్మెర పోతన



నమామి నారాయణ పాద పంకజం
వదామి నారాయణ నామనిర్మలం
భజామి నారాయణ తత్త్వమవ్యయం
కరోమి నారాయణ పూజనం సదా |శ్లో|



ఆలోక్య సర్వ శాస్త్రాణి
విచార్యచ పునః పునః
ఇదమేకం సునిశ్హ్పన్నం
ధ్యాయేన్నారాయణం సదా |శ్లో|



శ్రీ రమా హృదయేశ్వరా - భక్త జన చిత్త జలరుహ భాస్కరా
కారుణ్య రత్నాకరా - నీవె గతి కావవే నారాయణా || [1]



పాప కర్మములం జేసి - నరక కూపములం బడజాల నింకను
నీపాద భక్తి యొసంగి - యొక్క దరిం జూపవే నారాయణా || [2]



దాన ధర్మములం జేయ-నేర, నీ దాసులను బొగడ నేర,
నా నేరములం దలంపక - దయ చేసి నన్నేలు నారాయణా || [3]



ఆన యించుక లేకను - దుర్భాశ్హ లాడు నా జిహ్వ యందు,
నీ నామ చతురక్షరి - దృఢముగా నిలుప వలె నారాయణా || [4]



ఒకటి పరిశుద్ధి లేక - నా జన్మ మకట! వ్యర్థం బాయెను
అకలంక మగు మార్గముం - జూపవే సకలేశ! నారాయణా || [5]



వేగి లేచినది మొదలు - సంసార సాగరంబున నీందుచు
మీ గుణము నొక వేళను - దలంపగదె మేలనుచు నారాయణా || [6]



లోక వార్తలకు మరంగి - కర్ణముల మీకథల విన నేరను,
ఏ కరణీ భవ జలధిం - దుదముట్ట నీందెదను నారాయణా || [7]



ఇల మనుజ జన్మ మెత్తి - సుజ్ఞాన మించు కంతయు లేకను,
కలంతం జెందెడు చిత్తమున్‌ - స్వచ్ఛంబుగాం జేయు నారాయణా || [8]



యెంత పాపాత్ముండైన - మిముం దలంచి కృతకృత్యుండౌనుం,
బుడమి నింత పరుసము సోంకిన - లోహంబు హేమమౌ నారాయణా || [9]



కామాంధకారమునను - బెక్కు దుశ్హ్కర్మములం జేసి నేను,
నీ మఱుంగు జొచ్చినాను - నామీంద నెనెరుంచు నారాయణా || [10]



సమయమైనపుడు మిమ్ముం -దలచుటకు శక్తి గలుగునొ కలు
గదో, సమయమని తలంతునిపుడు -నా హృదయ కమలమున నారాయణా || [11]



ఆటలన్నియు ఱంకులు -నేనాడు మాటలన్నియు బొంకులు,
పాటింప నింతకైన -నున్నదే పాపంబు నారాయణా || [12]



వావి దప్పిన వాండను -దుశ్హ్క్రియా వర్తనుండ నగుదు నేను,
బావనునిగాం జేయవె ననుం బతిత పావనుండ నారాయణా || [13]



దేహమే దృఢమనుచును -దెలిసి నే మోహబద్ధుండ నగుచును,
సాహసంబున జేసితిం -నేగురు ద్రోహంబు నారాయణా || [14]



ఎన్ని జన్మము లాయెనో -నేటి కెందెందు జన్మించినానో
నన్ను దరిం జేర్పం గదవొ -యింకనైన నా తండ్రి నారాయణా || [15]



యమ కింకరులం దలంచిన -నాగుండె యావులింపుచు నున్నది
యముని బాధలు మాన్పను -మాయప్ప వైద్యుండవు నారాయణా || [16]



అరయం గామ క్రోధముల్ -లోభంబు మోహమద మత్సర
ములు, తఱుంగ వెప్పుడు మనసున -నిన్నెపుడుం దలచెదను || [17]



ఆశా పిశాచి పట్టి, -వైరాగ్య వాసనలం జేరనీయదు
గాసి పెట్టుచు నున్నది -నేనేమి చేయుదును నారాయణా || [18]



తాపత్రయంబుం జెంది -చాలం బరితాప మొందెడు చిత్తము
నీ పాదములం జెందినం -జల్లనై నిలిచెదను నారాయణా || [19]



చింతా పరంపరలచేం -చిత్తంబు చీంకాకు పడుచున్నది,
సంతోశ్హమునం గూర్పవె -దివ్య ప్రసాదములు నారాయణా || [20]



ప్రాయమెల్లను బోయెను -నాశ లెడం బాయం జాలక యున్నవి
మాయా ప్రపంచమేల -చేసెదవి మాయయ్య నారాయణా || [21]



శరణుం జొచ్చినవాండను -నేం జేయుదురితముల నపహరించి
పరమ పద మొసంగం గదవె -యింకనైనం బరమాత్మ నారాయణా || [22]



సంకల్పములు పుట్టినం -గర్మ వాసనల దృఢముగం జేయవు
సంకటము నొందించకే -నను సత్య సంకల్ప నారాయణా || [23]



ఒకవేళ నున్న బుద్ధి -యొక వేళ నుండదింక నేమి సేతు
విశదంబుగాం జేయవే -నీవు నా చిత్తమున నారాయణా || [24]



నెట్టుకొని సకల జీవ -కోటులను గొట్టి భక్షించినాను
పొట్ట కొఱకై నీచుల -సేవించి రట్టయితి నారాయణా || [25]



నేను పుట్టినది మొదలు -ఆహార నిద్రలనె జనె కాలము
పూని యెప్పుడు సేయుదు -నీపదధ్యానంబు నారాయణా || [26]



ప్రొద్దు వోవక యున్నను -వేసరక పొరుగిండ్లు తిరుంగుగాని
బుద్ధిమాలిన చిత్తము -నీయందుం బొందదే నారాయణా || [27]



ఎన్ని విధములం జూచిన -నిత్యమును హృదయమున మిము
మఱవక యున్నంతకన్న సుఖము -వేఱొక్కటున్నదే నారాయణా || [28]



లాభ లోభముల విడిచి -యిహపరంబులను ఫల మాసింపక
నీ భక్తులైన వారు -ధన్యులై నెగడెదరు నారాయణా || [29]



ముందు నీ సృశ్హ్టి లేక -సచ్చిదానంద స్వరూపంబును
బొంది భేదము నొందక -బ్రహ్మమై యుందువంట నారాయణా || [30]



కాలత్రయీ బాధ్యమై -మఱి నిరాకారమై యుండు కతనం
జాలంగాం దత్త్వజ్ఞులు -తెలియుదురు సత్తగుట నారాయణా || [31]



జ్ఞాన స్వరూపమునను -నజడమై జడ పదార్థము నెల్లను
గానంగాం జేయు కతనం -జిత్తండ్రు ఘనులు నిను నారాయణా || [32]



సుఖ దుఃఖముల రెంటికి -వేఱగుచు సుఖ రూపమైన కతన
నఖిల వేదాంత విదులు -ఆనందమండ్రు నిను నారాయణా || [33]



గుణ మొకటియైన లేని -నీయందు గుణమయంబైన మాయ
గణుతింపం గను పట్టెడు -దర్పణము కైవడిని నారాయణా || [34]



అందుం బ్రతిబింబించిన -చిత్సదానంద సముదాయమెల్లం
జెందు నీశ్వర భావము -త్రిగుణ సం శ్లిశ్హ్టమయి నారాయణా ||[35]



సత్వంబు రజము తమము -నను మూండు సంజ్ఞలను గ్రమము
తోడం దత్త్వజ్ఞులేర్పరింపం -సద్గుణ త్రయములను నారాయణా || [36]



ప్రకృతి నీయందు లీనమై -యుండి స్మృతిని జెందిన వేళను
సకల ప్రపంచ మిటులం -గనుపట్టె నకళంక నారాయణా || [37]



మీరు సంకల్పించిన -యిశ్హ్టప్రకారమును జెందు మాయ
యారూఢి వివరించెద -నవ్విధం బొప్పంగ నారాయణా || [38]



పంచభూతములు మనసు -బుద్ధియును బ్రకటహంకారము
లును, నెంచంగ నిట్టిమాయ -యిదిగా ప్రపంచంబు నారాయణా || [39]



భూతపంచక తత్త్వ సం -ఘాతమునం బుట్టె నంతఃకరణము
ఖ్యాతిగా నందుం దోంచి -చిత్తు జీవాత్మాయె నారాయణా || [40]



వెస మనో బుద్ధి చిత్తా -హంకార వృత్తు లంతఃకరణము
ప్రచురింప నవి నాలుగు -తత్త్వ రూపములాయె నారాయణా || [41]



భౌతిక రజోగుణములును -నేకమై ప్రాణంబు పుట్టించెను
వాద భేదములచేతం -బంచ పాపములాయె నారాయణా || [42]



అలరు ప్రాణ మపానము -వ్యానంబుదానము సమానంబులు
తలంప నీ సంజ్ఞలమరి -వాయుతత్త్వము లొప్పు నారాయణా || [43]



ప్రత్యేక భూత సత్త్వగుణములన -బరంగి బుద్ధీంద్రియములు
సత్త్వమున జనియించెను -దత్త్వ ప్రపంచముగ నారాయణా || [44]



చెవులు చర్మముం గన్నులు -జిహ్వ నాసికయుం బేరుల చేతను
దగిలి బుద్ధీంద్రియముల -విశ్హయ సంతతిం దెలియు నారాయణా || [45]



భౌతిక తమోగుణమున -విశ్హయములు తఱుచుగాం జనియిం
చెను, శబ్ద స్పర్శ రూప -రస గంధ నామములు నారాయణా || [46]



తాదృశ రజోగుణమున -జనియించె నరక కర్మేంద్రియములు
ఐదు తత్త్వమ్ము లగుచును -గర్మ నిశ్హ్ఠాదులకు నారాయణా || [47]



వాక్పాణిపాదపాయూ -పస్థలను వాని పేళ్ళమరుచుండుం
బ్క్వహృదయులకుం దెలియు -నీవిధము పరమాత్మ నారాయణా || [48]



పలుకు పనులును నడుపును -మలమూత్రములు విడుచుటీ య
యిదును వెలయం గర్మేంద్రియముల -విశ్హయములు నళినాక్ష నారాయణా || [49]



పరంగం జంద్రుండు బ్రహ్మ -క్షేత్రజ్ఞుం డరువొందు రుద్రుం
డచటి, పరమానసాదులకును -నధిపతులు వివరింప నారాయణా || [50]



అరయ దిక్కున వాయువు -సూర్యుండును, వరుణుండు, నశ్విను
లును, బరంగ శ్రోత్రాదులకును -నధిపతులు పరికింప నారాయణా || [51]



అనలుం, డింద్రుండు, విశ్హ్ణువు -మృత్యువును, నల ప్రజాపతియుం
గూడి, యొనరంగా నాడులకును -నధిపతులు పరికింప నారాయణా || [52]



పంచీకృతంబాయెను -భూతపంచకము, ప్రబలించి సృశ్హ్టి
పంచీకృతముచేతను -స్థూల రూపము లాయె నారాయణా || [53]



పది యింద్రియముల మనసు -బుద్ధియును, బ్రాణంబులైదు
గూడి, పదియేడు తత్త్వములను -సూక్ష్మరూపములాయె నారాయణా || [54]



స్థూలసూక్ష్మములు రెండు -కలుగుటకు మూలమగు నజ్ఞాన
ము, లీల కారణ మాయెను -జీవులకు నాలోన నారాయణా || [55]



ఈరెండు దేహములకు -విశ్వంబు నెల్లం బ్రకటనంబాయెను
నామ రూపముల చేత -లోకైక నాయకుండ నారాయణా || [56]



కొన్ని మాయనుం బుట్టును -గ్రుడ్లతోం గొన్ని తనువులు పుట్టు
ను, గొన్ని ధరణిని బుట్టును -జెమటలను గొన్ని హరి నారాయణా || [57]



ఈ చతుర్విధ భూతములందుం -గడు హెచ్చు మానవ జన్మము
నీచమని చూడరాదు -తథ్యమే నిర్ణయము నారాయణా || [58]



ఈ జన్మమందెకాని -ముక్తి మఱి యేజన్మమందు లేదు
చేసేతం దను దెలియక -మానవుండు చెడిపోవు నారాయణా || [59]



చేతనాచేతనములు -పుట్టుచును రోంతలకు లోనగుచును
నాతంక పడుచుండును -గర్మములం జేతమ్నుడు నారాయణా || [60]



సకలయోనులం బుట్టుచుం -బలుమాఱు స్వర్గ నరకములం బడు
చు, నొకట నూఱట గానక -పరితాప మొందితిని నారాయణా || [61]



వెలయ నెనుబదినాలుగు -లక్ష యోనులయందుం బుట్టిగిట్టి
యలసి మూర్ఛలం జెందుచు -బహుదుఃఖముల చేత నారాయణా || [62]



క్రమముతో మనుజగర్భ -మునం బడుచుం గర్మవశగతుండగు
చును, నమితముగ నచ్చోటను -గర్భనరకమునం బడు నారాయణా || [63]



ఈశ్వరాజ్ఞను బుట్టిన -తెలివిచే హృదయమునం దలపోయుచు
విశ్వమునం దను బొందిన -పాటెల్ల వేర్వేఱు నారాయణా || [64]



చాలు చీ! యిక జన్మము -నింకం బుట్టుం జాలు, శ్రీహరి భజించి
మేలు చెందెద ననుచును -జింతించు నాలోన నారాయణా || [65]



ప్రసవకాలమునం దల్లి -గర్భమునం బాదుకొని నిలువలేక
వసుధపయి నూడిపడినం -దెలివిచే వాపోవు నారాయణా || [66]



చనుంబాలు గుడిచి ప్రాణ -ధారణను నింక మూత్ర మలము
లోను, మునింగితేలుచునుండును, దుర్గంధమున నారాయణా || [67]



బాలత్వమున బిత్తరై -నలుగడలం బాఱాడు సిగ్గులేక
పాలుపడి యౌవనమునం -విశ్హయానుభవమొందు నారాయణా || [68]



ముదిమి వచ్చిన వెనుకను -సంసారమోహంబు మానకుండం
దుదనేంగుం గర్మగతులం -బొందుటకు ముదమేమి నారాయణా || [69]



అజ్ఞాన లక్షణమ్ము -లిటువంటివని విచారించి నరుండు
సుజ్ఞానమునకుం -దగిన మార్గంబు చూడవలె నారాయణా || [70]



వేదాంత వేదియైన -సద్గురుని పాదపద్మములు చెంది
యాదయానిధి కరుణచే -సద్బోధ మందవలె నారాయణా || [71]



ఏ విద్యకైన గురువు -లేకున్న నావిద్య పట్టుపడదు
కావునను నభ్యాసము -గురుశిక్ష కావలెను నారాయణా || [72]



గురుముఖంబైన విద్య -నెన్నికై కొనిన భావజ్ఞానము
చిరతరాధ్యాత్మ విద్య -నభ్యసింపంగ లేడు నారాయణా || [73]



అనపేక్షకుండు సదయుండు -వేదాంతనిపుణుండయ్యాచార్యు
డు దొరుకుటపురూపమపుడు -గుఱుతైన గుఱి యొప్పు నారాయణా || [74]



అట్టిసద్గురుని వెదకి -దర్శించి యా మహాత్ముని పదములు
పట్టి కృతకృత్యుండౌను -సాధకుండు గట్టిగా నారాయణా || [75]



మొగి సాధనములు నాల్గు -గలనరుండు ముఖ్యాధికారి యగును
దగిన యుపదేశమునకు -యోగసాధకులలో నారాయణా || [76]



ఇది నిత్య మిదియనిత్యం -బనుచుం దన మది వివేకించుటొ
కటి, యెదను నిహపర సుఖములు -కోరనిది యిదియొకటి || [77]



ముదముతో శమదమాది -శ్హట్క సంపద గలిగి యుండుటొ
కటి, విదితముగ ముక్తిం బొందం -గాంక్షించు టదియొకటి || [78]



ఈనాల్గు సాధనముల -నధికారియై నిజాచార్యుం జేరి
నానా ప్రకారములను -శుశ్రూశ్హ నడుపవలె నారాయణా || [79]



ఉల్లమునం గాపట్యము -లవ మైన నుండ నీయక సతతము
తల్లి దండ్రియుం దైవము -గురువనుచుం దలంపవలె నారాయణా || [80]



తనువు, ధనమును, సంపద -గురుని సొమ్మని సమర్పణము
చేసి, వెలసి తత్పరతంత్రుండై -నిత్యమును మెలంగవలె నారాయణా || [81]



ఏనిశ్హ్ఠ గురునిశ్హ్ఠకు -దీటుగాదీ ప్రపంచంబునందు
మానసము దృఢము చేసి -యలరవలె మౌనియై నారాయణా || [82]



ఇట్టి శిశ్హ్యుని పాత్రత -వీక్షించి హృదయమునం గారుణ్యము
నెట్టుకొని బ్రహ్మవిద్య -గురుండొసంగు నెయ్యముగ నారాయణా || [83]



బ్రహ్మంబు గలుంగంగానె -యేతత్ప్రపంచంబు గలిగి యుండు
బ్రహ్మంబు లేకున్నను -లేదీ ప్రపంచంబు నారాయణా || [84]



ఈ విధంబున సూక్తుల -బ్రహ్మ సద్భావంబు గలుగం జేసి
భావ గోచరము చేయుం -జిత్స్వరూపములెల్ల నారాయణా || [85]



ఆ బ్రహ్మమందె పుట్టు -విశ్వంబు నాబ్రహ్మమందె యుండు
నా బ్రహ్మమందె యణంగు -నదె చూడు మని చూపు నారాయణా || [86]



అది సచ్చిదానందము -అది శుద్ధ మది బద్ధ మది యుక్తము
అది సత్య మది నిత్యము -అది విమలమని తెలుపు నారాయణా || [87]



అదె బ్రహ్మ మదె విశ్హ్ణువు -అదె రుద్రుం డదియె సర్వేశ్వరుండు
అది పరంజ్యోతి యనుచు -బోధించు విదితముగ నారాయణా || [88]



భావింప వశముగాదు -ఇట్టిదని పలుక శక్యంబుగాదు
భావంబు నిలుపుచోట -నసి తాను బరమౌను నారాయణా || [89]



అది మాయతోం గూడంగ -శివుండాయె, నదియె విద్యను గూ
డంగ విదితముగా జీవుండాయె -నని తెలుపు వేర్వేఱ నారాయణా || [90]



శివుండు కారణ శరీరి -కార్యంబు జీవుండా లక్షణములు
ద్వివిధముగం దెలియు ననుచు -బోధించు వివరముగ నారాయణా || [91]



అరయ నిరువది నాలుగు -తత్త్వంబులై యుండు నందమ
గుచుం గరతలామలకముగను -బోధించుం బ్రకటముగ నారాయణా || [92]



కారణము కార్యమగుచు -వ్యవహార కారణాఖ్యత నుండును
నారూఢి బ్రహ్మాండము -పిండాండ మని తెలుపు నారాయణా || [93]



ఐదు భూతములు, నింద్రి-యములు పది, యంతరంగములు
నాల్గు, ఐదు విశ్హయములు తత్త్వ -సంఘాతమని తెలుపు నారాయణా || [94]



స్థూల సూక్ష్మాకృతులును -గారణముతో మూడు తెఱంగులకు
ను, నీలమగు నందు నమరు -నని తెలుపు లాలించి నారాయణా || [95]



వెలసి పంచీకృతములు -నగు భూతములకుం బుట్టినది తను
వు, స్థూలంబు నది యనుచును -బోధించు దయతోడ నారాయణా || [96]



ఐదు నయిదింద్రియములు -ప్రాణంబు లయిదు, మనసును బు
ద్ధియుం, బాదుకొని సూక్ష్మ మందు -బోధించుం బ్రకటముగ నారాయణా || [97]



గాఢమగు నజ్ఞానము -ఈరీతిం గారణ శరీర మగును
మూఢులకు వశముగాదు -తెలియ విను మోదమున నారాయణా || [98]



ఈమూండు తనువులందు -దా నుండి ఈతనువు తాననుచును
వ్యామోహ పడుచుండు(ను) -జీవుండు వరుసతో నారాయణా || [99]



కలలేక నిద్రించును -కలంగాంచి కడు మేలుగోరు చుండును
గలకాల మీ జీవుండు -త్రివిధములం గలసియును నారాయణా || [100]



ప్రాజ్ఞతైజస విశ్వులు -తానె, ఈపర్యాయముగ జీవుండు
ప్రజ్ఞగోల్పడ పొందును -సంసార బంధంబు నారాయణా || [101]



మూండవస్థలకు సాక్షి -యైనట్టి మూలంబు తాం దెలిసినం
జూడుమని సన్మార్గము -తేటగాం జూపుచును నారాయణా || [102]



నీవు దేహంబు గావు -ప్రాణంబు నీవుగావింద్రియములు
నీవుగాదని తెలుపును -వేదాంత నిలయమున నారాయణా || [103]



అనల తప్తంబు గాదు -జలమునను మునింగి తడిం జెందంబో
దు, అనిలశుల్కంబుగాదు -నిరుపమం బని తెలుపు నారాయణా || [104]



కామహంకార మిపుడు -చిత్తంబుగా వీవు బుద్ధి నీవు
కావు మనసులు సత్యము -సాక్షివగు గట్టిగా నారాయణా || [105]



దేహధర్మములు నీకుం -దోంచు టంతేగాని నిత్యముగను
మోహంబు మానుమనుచు -బోధించు ముఖ్యముగ నారాయణా || [106]



ఎన్ని దేహములు చెడిన -నీవు నేక స్వరూపుండ వగుచు
జెన్నలరి యుందు విలను -దత్త్వ ప్రసిద్ధముగ నారాయణా || [107]



అన్ని వేదాంత వాక్య -ములలో మహావాక్యములు నాలుగు
నిన్ను నీశ్వరునిగాను -వర్ణించు నిక్కముగ నారాయణా || [108]



ఉభయ దృశ్యోపాధులు, కడంద్రోసిపోక యయ్యాత్మ మిగుల
నభయముగ నిటులెప్పుడు -చింతింపు మని తెలుపు నారాయణా || [109]



జీవ శివ తారతంయ -మున నైక్య సిద్ధి కానేర దనుచు
భావ సంశయము దీర్పు -కార్యార్థ పటిమచే నారాయణా || [110]



నిర్వికారుండవు నీవు -నీ యందె నిజమైన చందమునను
బర్వుం బ్రకృతి వికారము -లని తెలుపు ప్రౌఢిచే నారాయణా || [111]



సద్గురుం డీరీతిగా -బోధించు సరళితో వాక్యార్థము
హృద్గతముం జేసియుండి -జగతి జీవింపుదును నారాయణా || [112]



అని చింతనము జేయుచుం -జిత్తమునం దనివిం జెందుచు నెప్పు
డు, కనుదమ్ములను ముడుచుచు -ధ్యానంబుగాం జేయు నారాయణా || [113]



అపగతాఘ కృత్యుండై -ఈరీతి నభ్యాస మొనరించుచు
నపరోక్ష సిద్ధి నొందు -బ్రహ్మంబు తానగుచు నారాయణా || [114]



కందళిత హృదయుండగుచు -సచ్చిదానంద స్వరూపుండగు
చు, సందర్శితాత్ముండగుచు -నుండు నవికారతను నారాయణా || [115]



అవ్యయానంద పూజ్య -రాజ్య సింహాసనాసీనుండగుచు
భవ్యాత్ముండై వెలసెను -బూజ్య సంభావ్యుండై నారాయణా || [116]



నీవు సకలంబుగాని -యున్నదే నీకన్న వేఱొక్కటి
జీవుండని వర్ణించుట -వ్యవహార సిద్ధికిని నారాయణా || [117]



చిలుక పలుకులు పలికితి -నాకేమి తెలియుం దత్త్వ రహస్య
ము, వలదు నను నేరమెంచ -సాధులకు నళినాక్ష నారాయణా || [118]



శరణు భక్తార్తిహారి -గురురూప శరణు సజ్జన రక్షక
శరణు దురితౌఘనాశ -శరణిపుడు కరుణించు నారాయణా || [119]



 తప్పొప్పులను దయతో తెలియజేయగలరని ప్రార్థన
-ఎ. శేశ్హు మాధవ రావు (adluriengr.mun.ca)
nArAyaNa Satakamu
bam&mera pOtana

namAmi nArAyaNa pAda paMkajaM
vadAmi nArAyaNa nAmanirmalaM
BhajAmi nArAyaNa tattvamavyayaM
karOmi nArAyaNa pUjanaM sadA |SlO|


AlOkya sarva SAstrANi
vicAryaca punah punah 
idamEkaM suniShpan&naM
dhyAyEn&nArAyaNaM sadA |SlO|


Sree ramA hRdayESvarA - Bhakta jana citta jalaruha BhAskarA
kAruNya ratnAkarA - neeve gati kAvavE nArAyaNA || [1]


pApa karmamulam jEsi - naraka kUpamulam baDajAla nimkanu
neepAda Bhakti yosamgi - yokka darim jUpavE nArAyaNA || [2]


dAna dharmamulam jEya-nEra, nee dAsulanu bogaDa nEra,
nA nEramulam dalampaka - daya cEsi nan&nElu nArAyaNA || [3]


Ana yiMcuka lEkanu - durBhASha lADu nA jihva yaMdu,
nee nAma caturakshari - dRDhamugA nilupa vale nArAyaNA || [4]


okaTi pariSuddhi lEka - nA janma makaTa! vyarthaM bAyenu
akalaMka magu mArgamuM - jUpavE sakalESa! nArAyaNA || [5]


vEgi lEcinadi modalu - saMsAra sAgaraMbuna neemducu
mee guNamu noka vELanu - dalampagade mElanucu nArAyaNA || [6]


lOka vArtalaku maramgi - karNamula meekathala vina nEranu,
E karaNee Bhava jaladhim - dudamuTTa neemdedanu nArAyaNA || [7]


ila manuja janma metti - suj~nAna miMcu kaMtayu lEkanu,
kalamtam jeMdeDu cittamun^ - svacChaMbugAm jEyu nArAyaNA || [8]


yeMta pApAtmumDaina - mimum dalaMci kRtakRtyumDaunum,
buDami niMta parusamu sOmkina - lOhaMbu hEmamau nArAyaNA || [9]


kAmAMdhakAramunanu - bekku duShkarmamulam jEsi nEnu,
nee ma~rumgu joccinAnu - nAmeemda neneruMcu nArAyaNA || [10]


samayamainapuDu mim&mum -dalacuTaku Sakti galuguno kalu
gadO, samayamani talamtunipuDu -nA hRdaya kamalamuna nArAyaNA || [11]


ATalan&niyu ~raMkulu -nEnADu mATalan&niyu boMkulu,
pATiMpa niMtakaina -nun&nadE pApaMbu nArAyaNA || [12]


vAvi dappina vAmDanu -duShkriyA vartanumDa nagudu nEnu,
bAvanunigAm jEyave nanum batita pAvanumDa nArAyaNA || [13]


dEhamE dRDhamanucunu -delisi nE mOhabaddhumDa nagucunu,
sAhasaMbuna jEsitim -nEguru drOhaMbu nArAyaNA || [14]


en&ni jan&mamu lAyenO -nETi keMdeMdu jan&miMcinAnO
nan&nu darim jErpam gadavo -yimkanaina nA taMDri nArAyaNA || [15]


yama kiMkarulam dalamcina -nAguMDe yAvuliMpucu nun&nadi
yamuni bAdhalu mAn&panu -mAyappa vaidyumDavu nArAyaNA || [16]


arayam gAma krOdhamul -lOBhaMbu mOhamada matsara
mulu, ta~rumga veppuDu manasuna -nin&nepuDum dalacedanu || [17]


ASA piSAci paTTi, -vairAgya vAsanalam jEraneeyadu
gAsi peTTucu nun&nadi -nEnEmi cEyudunu nArAyaNA || [18]


tApatrayaMbum jeMdi -cAlam baritApa moMdeDu cittamu
nee pAdamulam jeMdinam -jallanai nilicedanu nArAyaNA || [19]


ciMtA paraMparalacEm -cittaMbu ceemkAku paDucun&nadi,
saMtOShamunam gUrpave -divya prasAdamulu nArAyaNA || [20]


prAyamellanu bOyenu -nASa leDam bAyam jAlaka yun&navi
mAyA prapaMcamEla -cEsedavi mAyayya nArAyaNA || [21]


SaraNum joccinavAmDanu -nEm jEyuduritamula napahariMci
parama pada mosamgam gadave -yimkanainam baramAtma nArAyaNA || [22]


saMkalpamulu puTTinam -garma vAsanala dRDhamugam jEyavu
saMkaTamu noMdiMcakE -nanu satya saMkalpa nArAyaNA || [23]


okavELa nun&na buddhi -yoka vELa nuMDadimka nEmi sEtu
viSadaMbugAm jEyavE -neevu nA cittamuna nArAyaNA || [24]


neTTukoni sakala jeeva -kOTulanu goTTi BhakshiMcinAnu
poTTa ko~rakai neecula -sEviMci raTTayiti nArAyaNA || [25]


nEnu puTTinadi modalu -AhAra nidralane jane kAlamu
pUni yeppuDu sEyudu -neepadadhyAnaMbu nArAyaNA || [26]


proddu vOvaka yun&nanu -vEsaraka porugiMDlu tirumgugAni
buddhimAlina cittamu -neeyaMdum boMdadE nArAyaNA || [27]


en&ni vidhamulam jUcina -nityamunu hRdayamuna mimu
ma~ravaka yun&naMtakan&na suKhamu -vE~rokkaTun&nadE nArAyaNA || [28]


lABha lOBhamula viDici -yihaparaMbulanu Phala mAsiMpaka
nee Bhaktulaina vAru -dhanyulai negaDedaru nArAyaNA || [29]


muMdu nee sRShTi lEka -saccidAnaMda svarUpaMbunu
boMdi BhEdamu noMdaka -brahmamai yuMduvamTa nArAyaNA || [30]


kAlatrayee bAdhyamai -ma~ri nirAkAramai yuMDu katanam
jAlamgAm dattvaj~nulu -teliyuduru sattaguTa nArAyaNA || [31]


j~nAna svarUpamunanu -najaDamai jaDa padArthamu nellanu
gAnamgAm jEyu katanam -jittaMDru Ghanulu ninu nArAyaNA || [32]


suKha duhKhamula reMTiki -vE~ragucu suKha rUpamaina katana
naKhila vEdAMta vidulu -AnaMdamaMDru ninu nArAyaNA || [33]


guNa mokaTiyaina lEni -neeyaMdu guNamayaMbaina mAya
gaNutiMpam ganu paTTeDu -darpaNamu kaivaDini nArAyaNA || [34]


aMdum bratibiMbiMcina -citsadAnaMda samudAyamellam
jeMdu neeSvara BhAvamu -triguNa saM SliShTamayi nArAyaNA ||[35]


satvaMbu rajamu tamamu -nanu mUmDu saMj~nalanu gramamu
tODam dattvaj~nulErpariMpam -sadguNa trayamulanu nArAyaNA || [36]


prakRti neeyaMdu leenamai -yuMDi smRtini jeMdina vELanu
sakala prapaMca miTulam -ganupaTTe nakaLaMka nArAyaNA || [37]


meeru saMkalpiMcina -yiShTaprakAramunu jeMdu mAya
yArUDhi vivariMceda -navvidhaM boppaMga nArAyaNA || [38]


paMcaBhUtamulu manasu -buddhiyunu brakaTahaMkAramu
lunu, neMcaMga niTTimAya -yidigA prapaMcaMbu nArAyaNA || [39]


BhUtapaMcaka tattva saM -GhAtamunam buTTe naMtahkaraNamu
KhyAtigA naMdum dOmci -cittu jeevAtmAye nArAyaNA || [40]


vesa manO buddhi cittA -haMkAra vRttu laMtahkaraNamu
pracuriMpa navi nAlugu -tattva rUpamulAye nArAyaNA || [41]


Bhautika rajOguNamulunu -nEkamai prANaMbu puTTiMcenu
vAda BhEdamulacEtam -baMca pApamulAye nArAyaNA || [42]


alaru prANa mapAnamu -vyAnaMbudAnamu samAnaMbulu
talampa nee saMj~nalamari -vAyutattvamu loppu nArAyaNA || [43]


pratyEka BhUta sattvaguNamulana -baramgi buddheeMdriyamulu
sattvamuna janiyiMcenu -dattva prapaMcamuga nArAyaNA || [44]


cevulu carmamum gan&nulu -jihva nAsikayum bErula cEtanu
dagili buddheeMdriyamula -viShaya saMtatim deliyu nArAyaNA || [45]


Bhautika tamOguNamuna -viShayamulu ta~rucugAm janiyiM
cenu, Sabda sparSa rUpa -rasa gaMdha nAmamulu nArAyaNA || [46]


tAdRSa rajOguNamuna -janiyiMce naraka karmEMdriyamulu
aidu tattvam&mu lagucunu -garma niShThAdulaku nArAyaNA || [47]


vAkpANipAdapAyU -pasthalanu vAni pELLamarucuMDum
bkvahRdayulakum deliyu -neevidhamu paramAtma nArAyaNA || [48]


paluku panulunu naDupunu -malamUtramulu viDucuTee ya
yidunu velayam garmEMdriyamula -viShayamulu naLinAksha nArAyaNA || [49]


paramgam jaMdruMDu brahma -kshEtraj~num DaruvoMdu rudrum
DacaTi, paramAnasAdulakunu -nadhipatulu vivariMpa nArAyaNA || [50]


araya dikkuna vAyuvu -sUryumDunu, varuNuMDu, naSvinu
lunu, baramga SrOtrAdulakunu -nadhipatulu parikiMpa nArAyaNA || [51]


analum, DiMdrumDu, viShNuvu -mRtyuvunu, nala prajApatiyum
gUDi, yonaramgA nADulakunu -nadhipatulu parikiMpa nArAyaNA || [52]


paMceekRtaMbAyenu -BhUtapaMcakamu, prabaliMci sRShTi
paMceekRtamucEtanu -sthUla rUpamu lAye nArAyaNA || [53]


padi yiMdriyamula manasu -buddhiyunu, brANaMbulaidu
gUDi, padiyEDu tattvamulanu -sUkshmarUpamulAye nArAyaNA || [54]


sthUlasUkshmamulu reMDu -kaluguTaku mUlamagu naj~nAna
mu, leela kAraNa mAyenu -jeevulaku nAlOna nArAyaNA || [55]


eereMDu dEhamulaku -viSvaMbu nellam brakaTanaMbAyenu
nAma rUpamula cEta -lOkaika nAyakumDa nArAyaNA || [56]


kon&ni mAyanum buTTunu -gruDlatOm gon&ni tanuvulu puTTu
nu, gon&ni dharaNini buTTunu -jemaTalanu gon&ni hari nArAyaNA || [57]


ee caturvidha BhUtamulaMdum -gaDu heccu mAnava janmamu
neecamani cUDarAdu -tathyamE nirNayamu nArAyaNA || [58]


ee janmamaMdekAni -mukti ma~ri yEjanmamaMdu lEdu
cEsEtam danu deliyaka -mAnavumDu ceDipOvu nArAyaNA || [59]


cEtanAcEtanamulu -puTTucunu rOmtalaku lOnagucunu
nAtaMka paDucuMDunu -garmamulam jEtamnuDu nArAyaNA || [60]


sakalayOnulam buTTucum -balumA~ru svarga narakamulam baDu
cu, nokaTa nU~raTa gAnaka -paritApa moMditini nArAyaNA || [61]


velaya nenubadinAlugu -laksha yOnulayaMdum buTTigiTTi
yalasi mUrChalam jeMducu -bahuduhKhamula cEta nArAyaNA || [62]


kramamutO manujagarBha -munam baDucum garmavaSagatumDagu
cunu, namitamuga naccOTanu -garBhanarakamunam baDu nArAyaNA || [63]


eeSvarAj~nanu buTTina -telivicE hRdayamunam dalapOyucu
viSvamunam danu boMdina -pATella vErvE~ru nArAyaNA || [64]


cAlu cee! yika janmamu -nimkam buTTum jAlu, Sreehari BhajiMci
mElu ceMdeda nanucunu -jiMtiMcu nAlOna nArAyaNA || [65]


prasavakAlamunam dalli -garBhamunam bAdukoni niluvalEka
vasudhapayi nUDipaDinam -delivicE vApOvu nArAyaNA || [66]


canumbAlu guDici prANa -dhAraNanu nimka mUtra malamu
lOnu, munimgitElucunuMDunu, durgaMdhamuna nArAyaNA || [67]


bAlatvamuna bittarai -nalugaDalam bA~rADu siggulEka
pAlupaDi yauvanamunam -viShayAnuBhavamoMdu nArAyaNA || [68]


mudimi vaccina venukanu -saMsAramOhaMbu mAnakuMDam
dudanEmgum garmagatulam -boMduTaku mudamEmi nArAyaNA || [69]


aj~nAna lakshaNam&mu -liTuvaMTivani vicAriMci narumDu
suj~nAnamunakum -dagina mArgaMbu cUDavale nArAyaNA || [70]


vEdAMta vEdiyaina -sadguruni pAdapadmamulu ceMdi
yAdayAnidhi karuNacE -sadbOdha maMdavale nArAyaNA || [71]


E vidyakaina guruvu -lEkun&na nAvidya paTTupaDadu
kAvunanu naBhyAsamu -guruSiksha kAvalenu nArAyaNA || [72]


gurumuKhaMbaina vidya -nen&nikai konina BhAvaj~nAnamu
ciratarAdhyAtma vidya -naBhyasiMpamga lEDu nArAyaNA || [73]


anapEkshakumDu sadayumDu -vEdAMtanipuNumDayyAcAryu
Du dorukuTapurUpamapuDu -gu~rutaina gu~ri yoppu nArAyaNA || [74]


aTTisadguruni vedaki -darSiMci yA mahAtmuni padamulu
paTTi kRtakRtyumDaunu -sAdhakumDu gaTTigA nArAyaNA || [75]


mogi sAdhanamulu nAlgu -galanarumDu muKhyAdhikAri yagunu
dagina yupadESamunaku -yOgasAdhakulalO nArAyaNA || [76]


idi nitya midiyanityaM -banucum dana madi vivEkiMcuTo
kaTi, yedanu nihapara suKhamulu -kOranidi yidiyokaTi || [77]


mudamutO SamadamAdi -ShaTka saMpada galigi yuMDuTo
kaTi, viditamuga muktim boMdam -gAMkshiMcu TadiyokaTi || [78]


eenAlgu sAdhanamula -nadhikAriyai nijAcAryum jEri
nAnA prakAramulanu -SuSrUSha naDupavale nArAyaNA || [79]


ullamunam gApaTyamu -lava maina nuMDa neeyaka satatamu
talli daMDriyum daivamu -guruvanucum dalampavale nArAyaNA || [80]


tanuvu, dhanamunu, saMpada -guruni som&mani samarpaNamu
cEsi, velasi tatparataMtrumDai -nityamunu melamgavale nArAyaNA || [81]


EniShTha guruniShThaku -deeTugAdee prapaMcaMbunaMdu
mAnasamu dRDhamu cEsi -yalaravale mauniyai nArAyaNA || [82]


iTTi SiShyuni pAtrata -veekshiMci hRdayamunam gAruNyamu
neTTukoni brahmavidya -gurumDosamgu neyyamuga nArAyaNA || [83]


brahmaMbu galumgamgAne -yEtatprapaMcaMbu galigi yuMDu
brahmaMbu lEkun&nanu -lEdee prapaMcaMbu nArAyaNA || [84]


ee vidhaMbuna sUktula -brahma sadBhAvaMbu galugam jEsi
BhAva gOcaramu cEyum -jitsvarUpamulella nArAyaNA || [85]


A brahmamaMde puTTu -viSvaMbu nAbrahmamaMde yuMDu
nA brahmamaMde yaNamgu -nade cUDu mani cUpu nArAyaNA || [86]


adi saccidAnaMdamu -adi Suddha madi baddha madi yuktamu
adi satya madi nityamu -adi vimalamani telupu nArAyaNA || [87]


ade brahma made viShNuvu -ade rudrum Dadiye sarvESvaruMDu
adi paraMjyOti yanucu -bOdhiMcu viditamuga nArAyaNA || [88]


BhAviMpa vaSamugAdu -iTTidani paluka SakyaMbugAdu
BhAvaMbu nilupucOTa -nasi tAnu baramaunu nArAyaNA || [89]


adi mAyatOm gUDamga -SivumDAye, nadiye vidyanu gU
Damga viditamugA jeevumDAye -nani telupu vErvE~ra nArAyaNA || [90]


SivumDu kAraNa Sareeri -kAryaMbu jeevumDA lakshaNamulu
dvividhamugam deliyu nanucu -bOdhiMcu vivaramuga nArAyaNA || [91]


araya niruvadi nAlugu -tattvaMbulai yuMDu naMdama
gucum garatalAmalakamuganu -bOdhiMcum brakaTamuga nArAyaNA || [92]


kAraNamu kAryamagucu -vyavahAra kAraNAKhyata nuMDunu
nArUDhi brahmAMDamu -piMDAMDa mani telupu nArAyaNA || [93]


aidu BhUtamulu, niMdri-yamulu padi, yaMtaraMgamulu
nAlgu, aidu viShayamulu tattva -saMGhAtamani telupu nArAyaNA || [94]


sthUla sUkshmAkRtulunu -gAraNamutO mUDu te~ramgulaku
nu, neelamagu naMdu namaru -nani telupu lAliMci nArAyaNA || [95]


velasi paMceekRtamulu -nagu BhUtamulakum buTTinadi tanu
vu, sthUlaMbu nadi yanucunu -bOdhiMcu dayatODa nArAyaNA || [96]


aidu nayidiMdriyamulu -prANaMbu layidu, manasunu bu
ddhiyum, bAdukoni sUkshma maMdu -bOdhiMcum brakaTamuga nArAyaNA || [97]


gADhamagu naj~nAnamu -eereetim gAraNa Sareera magunu
mUDhulaku vaSamugAdu -teliya vinu mOdamuna nArAyaNA || [98]


eemUmDu tanuvulaMdu -dA nuMDi eetanuvu tAnanucunu
vyAmOha paDucuMDu(nu) -jeevuMDu varusatO nArAyaNA || [99]


kalalEka nidriMcunu -kalamgAMci kaDu mElugOru cuMDunu
galakAla mee jeevumDu -trividhamulam galasiyunu nArAyaNA || [100]


prAj~nataijasa viSvulu -tAne, eeparyAyamuga jeevumDu
praj~nagOlpaDa poMdunu -saMsAra baMdhaMbu nArAyaNA || [101]


mUmDavasthalaku sAkshi -yainaTTi mUlaMbu tAm delisinam
jUDumani sanmArgamu -tETagAm jUpucunu nArAyaNA || [102]


neevu dEhaMbu gAvu -prANaMbu neevugAviMdriyamulu
neevugAdani telupunu -vEdAMta nilayamuna nArAyaNA || [103]


anala taptaMbu gAdu -jalamunanu munimgi taDim jeMdambO
du, anilaSulkaMbugAdu -nirupamaM bani telupu nArAyaNA || [104]


kAmahaMkAra mipuDu -cittaMbugA veevu buddhi neevu
kAvu manasulu satyamu -sAkshivagu gaTTigA nArAyaNA || [105]


dEhadharmamulu neekum -dOmcu TaMtEgAni nityamuganu
mOhaMbu mAnumanucu -bOdhiMcu muKhyamuga nArAyaNA || [106]


en&ni dEhamulu ceDina -neevu nEka svarUpuMDa vagucu
jen&nalari yuMdu vilanu -dattva prasiddhamuga nArAyaNA || [107]


an&ni vEdAMta vAkya -mulalO mahAvAkyamulu nAlugu
nin&nu neeSvarunigAnu -varNiMcu nikkamuga nArAyaNA || [108]


uBhaya dRSyOpAdhulu, kaDamdrOsipOka yayyAtma migula 
naBhayamuga niTuleppuDu -ciMtiMpu mani telupu nArAyaNA || [109]


jeeva Siva tArataMya -muna naikya siddhi kAnEra danucu
BhAva saMSayamu deerpu -kAryArtha paTimacE nArAyaNA || [110]


nirvikArumDavu neevu -nee yaMde nijamaina caMdamunanu
barvum brakRti vikAramu -lani telupu prauDhicE nArAyaNA || [111]


sadguruM DeereetigA -bOdhiMcu saraLitO vAkyArthamu
hRdgatamum jEsiyuMDi -jagati jeeviMpudunu nArAyaNA || [112]


ani ciMtanamu jEyucum -jittamunam danivim jeMducu neppu
Du, kanudam&mulanu muDucucu -dhyAnaMbugAm jEyu nArAyaNA || [113]


apagatAGha kRtyumDai -eereeti naBhyAsa monariMcucu
naparOksha siddhi noMdu -brahmaMbu tAnagucu nArAyaNA || [114]


kaMdaLita hRdayumDagucu -saccidAnaMda svarUpumDagu
cu, saMdarSitAtmumDagucu -nuMDu navikAratanu nArAyaNA || [115]


avyayAnaMda pUjya -rAjya siMhAsanAseenumDagucu
BhavyAtmumDai velasenu -bUjya saMBhAvyumDai nArAyaNA || [116]


neevu sakalaMbugAni -yun&nadE neekan&na vE~rokkaTi
jeevumDani varNiMcuTa -vyavahAra siddhikini nArAyaNA || [117]


ciluka palukulu palikiti -nAkEmi teliyum dattva rahasya
mu, valadu nanu nErameMca -sAdhulaku naLinAksha nArAyaNA || [118]


SaraNu BhaktArtihAri -gururUpa SaraNu sajjana rakshaka
SaraNu duritauGhanASa -SaraNipuDu karuNiMcu nArAyaNA || [119]


 tappoppulanu dayatO teliyajEyagalarani prArthana 
-e. SEShu mAdhava rAvu #(adluriengr.mun.ca)#

ద్గురుం డీరీతిగా -బోధించు సరళితో వాక్యార్థము

హృద్గతముం జేసియుండి -జగతి జీవింపుదును నారాయణా