కాకిపడిగెల
తెలుగువారి జానపద కళారూపాల్లో కాకిపడిగెల కథలకు ప్రత్యేక స్థానం ఉంది. నకాశీ కళాకారులు రూపొందించిన పటాలను ఉపయోగించి కథలు చెప్పే కాకిపడిగెలవారు ముదిరాజు (తెనుగు) కులానికి మిరాశి కులం. వీరు ప్రతి రెండు లేదా మూడు సంవత్సరాలకొకసారి 'త్యాగం' ఉన్న గ్రామాలకు పోయి కథలు చెప్పి ముదిరాజుల నుంచి ప్రతిఫలం తీసుకుంటారు. వీరు చెప్పే కథల్లో ఎంతో వైవిధ్యం ఉంటుంది. రాసిలోనూ వాసిలోనూ ఈ కథలు తమకు తామే సాటిగా ఉంటాయి.
కాకిపడిగెలవారు మూడు రకాలుగా కథలు చెప్తారు. మొదటివి త్యాగం కథలు, రెండోవి చావుకథలు, మూడోవి ఉల్ఫా కథలు. వీరు ప్రదర్శించే కథలు ముదిరాజ్ వాళ్ళు ఇచ్చే త్యాగం (తేగం) పై ఆధారపడి ఉంటాjయి. పూర్వం ఐదు లేదా తొమ్మిది రోజులు కథలను ప్రదర్శించేవారు. ప్రస్తుతం తగ్గించారు. ప్రధానంగా వీరు చెప్పే కథల్లో ముదిరాజ్‌ల వృత్తాంతం, పాండవుల పుట్టుక, ధర్మరాజు జూదం, పాండవుల వనవాసం, విరాటకొలువు, ద్రౌపది స్వయంవరం, బకాసురవధ, కీచకవధ, గారములకోట, సుభద్రాపరిణయం, కర్ణునిపెళ్ళి, సహదేవకళ్యాణం, గోవులచెర, శశరేఖ పరిణయం, నవలోకసుందరి, రంభారంపాల, మాయాబజార్, గదాయుద్ధం, భీష్మమరణం, భీమ విషమన్నం, అభిమన్యు మరణం, దుర్యోధన మరణం, కురుక్షేత్రం, అల్లిరాణి, లక్షాగృహం, రాజసూయ యాగం, భీమాంజనేయ యుద్ధం, శ్రీకృష్ణరాయభారం మొదలగునవి ముఖ్యమైనవి.
కాకిపడిగెల కులోత్పత్తి
పూర్వం ముదిరాజ్ వాళ్ళలో ఐదుగురు అన్నదమ్ములు కల్సి పెందోట వనం చేసి ఆ వనానికి కావలి ఉండేవారు. అయితే ఒకరోజు అవుసలి బ్రహ్మ పండ్లు పెట్టమని వీరితోటకు వచ్చాడు. అతనికి పండ్లు పెట్టలేదు. ఎంత గట్టిగా పెట్టమని మాట్లాడినా కూడా వీళ్లు పెట్టక అతన్ని పెందోట వనం నుండి వెళ్ళగొట్టినారు. దీనితో అవుసలి బ్రహ్మకు కోపం వచ్చి ఒక బంగారు కాకిని చేసి ప్రాణం పోసినాడు. ఆ కాకి పెందోట వనంలోని పండ్లన్ని పాడుచేస్తుంటే ఈ ఐదుగురు ముదిరాజ్‌లకు కోపం వచ్చింది. అందులో చిన్నోడు ఒక బాణం తీసి ఆ కాకికి వేస్తే అది రెక్కలు విరిగి పడిపోతుంది. దాన్ని పట్టుకొని ఇంటికి వచ్చి ''అమ్మా! నేను కాకిని పట్టుకొని వచ్చిన'' అంటాడు'' అందుకా తల్లి ''మనం ముదిరాజ్ వాళ్ళం. మనం మాంసం తినేవాళ్ళం కాదు. సూర్యున్ని చూసి చుక్కబొట్టు పెట్టం. చంద్రున్ని చూసి చంద్రవంక పెట్టం, వరాహావతారం ఎదురొచ్చినదంటే ఏడు నూతలల్ల స్నానం చేసి వచ్చేవాళ్ళం. అట్లాంటిది నీవు కాకిని చంపి కాకిని పట్టుకొని వచ్చినావు కాబట్టి కాకిపడిగెల వానివై పక్కనుండాలి'' అని శపించింది. దానితో ''అమ్మా! నీవు శపించినావు కాబట్టి నేను పక్కకే ఉంటాను'' అని అన్నం తినకుండా పక్కకుంటాడు.కొడుకు అన్నం తింటలేదని బాధపడి ఆ తల్లి ''కొడుకా! ఎన్ని రోజులు ఇట్ల అన్నం తినకుండా పక్కకుంటావు బిడ్డా'' అని అన్నం తీసుకపోయి పెడుతుంది.
అప్పుడు ''అమ్మా! నీవు పక్కకు కూర్చోని అన్నం పెట్టినావు కాబట్టి నీ ఇంటోల్లకు నాకు అన్నం పొత్తు ఉంటుంది. నీవు తెచ్చి పెడితేనే తినాలి కాని నేను నీ ఇంట్లోకొచ్చి తినను'' అంటాడు. అప్పుడు ఆ తల్లి ''మన ఇండ్లల్ల ఎవరైనా పుడితే పురుడు కట్నం, పెడితే పెండ్లి కట్నం, సమర్త అయితే కట్నం, చస్తే చావు కట్నం నీకు ఇస్త అని కట్టుచేసి, మనకు పాండవులంటే మనకిష్టము కదా! వాళ్ళకు సంబంధించిన
వృత్తాంతము చెబుతూ ముదిరాజులను అడుక్కొని బ్రతుకు బిడ్డా'' అని చెప్పింది. అప్పటి నుండి కాకిపడిగెల వాడై పాండవుల కథ చెపుతూ జీవనం గడుపుతున్నాడు. ఇట్లా కొంతకాలానికి ఊరికే నోటితో చెప్పితే సరిగా అర్ధమయితలేదని గుడ్డమీద మహాభారతం సంబంధించి బొమ్మలు వేయించి బొమ్మలు చూపిస్తూ కథ చెప్పడం ప్రారంభించాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు అదేవిధంగా కథ చెపుతూ ముదిరాజ్ వాళ్ళను త్యాగం అడుక్కొని జీవిస్తున్నారు.
రంగస్థలం
కథ చెప్పడానికి ముదిరాజ్ ఇండ్ల మధ్యలో కొంచెం విశాలంగా ఉన్న స్థలాన్ని ఎన్నుకుంటారు. ఎండాకాలం ఐతే వారి ఇండ్ల దగ్గరలో చెట్లు ఉండి నీడ ఉన్న ప్రాంతాన్ని చూసి వేదిక కట్టుకుంటారు. కథా ప్రారంభానికి ముందు రంగస్థలం దగ్గర ప్రేక్షకులు రావడం కోసం నగారా వాయిస్తారు. ఆ తర్వాత మహాభారతంలోని పాటలు పాడతారు. ప్రేక్షకులు వచ్చిన తరువాత కొబ్బరికాయ కొట్టి ప్రార్థనా గీతంపాడి కథ ప్రారంభిస్తారు.
కథ చెప్పే వాళ్ళు మొత్తం ఐదుగురు ఉంటారు. వీరిని మేళం అంటారు. వీరిలో ఒకరు ప్రధాన కథకుడు, ఇద్దరు వంతలుకాగా, ఒకరు హార్మోనియం వాయిస్తారు. ఇంకొకరు తాళాలు కొడతారు. ఈ ఇద్దరు వంతలలో ఒకరు మద్దెల నడుముకు కట్టుకొని వాయిస్తారు. ప్రధాన కథకుడు తెల్లధోవతి రంగు లాల్చి తొడుక్కొని నడుముకు ఒక పంచె కట్టుకొని ఉంటాడు. వంతలు, ధోవతి, అంగీలు తొడుక్కొని ఉంటారు.
కథా ప్రదర్శనలో అనుష్ఠానాలు
కథాప్రదర్శన సమయంలో కొన్ని అనుష్ఠానాలు నిర్వర్తిస్తారు. పద్మవ్యూహం కథలో అభిమన్యుడు చనిపోయినపుడు, కురుక్షేత్రం కథలో ద్రోణుడు, భీష్ముడు, దుర్యోధనుడు చనిపోయినపుడు కూడా యాటను లేదా కోడిని గాని కోస్తారు. ఈ రెండూ లేకపోయినా ఒక కొబ్బరికాయైనా కొడతారు. కీచకవధ కథలో కీచకుడు చనిపోయినపుడు, బకాసురవధలో బకాసురుడు చనిపోయినపుడు ఒక కొబ్బరికాయ కొట్టి శాంత పరుస్తారు.
కథా ప్రదర్శనలో కళ్యాణఘట్టాలు వచ్చినపుడు ఒసగులు (కట్నాలు) చదివించమని చెప్పి తీసుకుంటారు. కథాప్రదర్శన చివరలో మంగళహారతి పాడిన తర్వాత ప్రేక్షకులు తమకు తోచినంత డబ్బులు ఇస్తే తీసుకుంటారు. కళ్యాణం సమయంలో కట్నాలు ఇస్తే దీవనార్తి పెడతారు. ''ఫలానా రామయ్య ఐదు రూపాయలు కట్నం ఇచ్చాడు. మరి వారికి ముట్టింది ముత్యమై, పట్టింది బంగారమై, నగదు నాలుగు రెట్లయి. వారి ధాన్యమందున పెద్దవ్వ తల్లి దీవెన గల్గి కొడుకులు బిడ్డలు చల్లంగ ఉండి ఒక్క ఇల్లుకు పదిండ్లయి చల్లగ బతకాలి'' అని దీవిస్తారు.
అయితే పూర్వం ప్రదర్శనకు నేటి ప్రదర్శనకు చాలా మార్పు వచ్చింది. పూర్వం భార్య, భర్త కలిసి కూర్చొని పటం చూపిస్తూ కథ చెప్పే వాళ్ళు. కాని నేడు ఆ విధంగా చెపితే వినటం లేదని మహాభారతం పుస్తకం చదివి దాన్ని ఆధారంగా చేసుకొని, తమ బాణీలో ఆకర్షణీయంగా చెపుతున్నారు. కొందరు తమ ప్రదర్శనలో ఒగ్గుకథ, యక్షగాన బాణీని కూడా ఉపయోగిస్తున్నారు.
త్యాగం కథలు అయిపోయిన చివరిరోజు ఉదయం తొమ్మిది గంటలకే కథ ప్రారంభించి మధ్యాహ్నం పన్నెండు గంటలకు కథ ముగించి సాయంత్రం మూడు లేదా నాలుగు గంటలకు పెద్దమ్మ పండుగ కార్యక్రమం మొదలు పెడతారు.
పెద్దమ్మ పండుగ
రంగస్థలం దగ్గరనే అలికి పచ్చపిండితో ముగ్గు వేసి పటం తీసి అందులో నుండి పెద్దమ్మ బొమ్మను తీసి ఉంచుతారు. ముదిరాజ్‌ల కులపెద్ద భార్య,మిగతా ముదిరాజ్ వాళ్ళు కూడా బోనాలు తెస్తారు. పటం ముందు బోనాలు పెట్టి కల్లు ఆరబోసి, బోనాల నుండి కొంచెం కొంచెం అన్నం తీసి ఆరు పడులు (పంచపాండవులకు, కృష్ణునికి) పెట్టి ఒక కొత్త చీర, రవిక పెద్దమ్మ దగ్గర పెట్టి ఒక యాటను కోస్తారు. కొన్ని ఊర్లలో యాటను కోసి రక్తాన్ని జొన్నన్నంలో కలిపి ముదిరాజ్ ఇండ్ల మీద బలి కూడా చల్లించుకుంటారు. యాటను పాళ్ళప్రకారం ముదిరాజ్‌లు తీసుకుంటారు.
త్యాగం కథలు అయిపోయిన తరువాత పాళ్ళ ప్రకారం ముదిరాజ్ వాళ్ళకు ఎన్ని డబ్బులు పడతాయో అన్ని ఒక్కొక్కరి దగ్గర వసూలు చేసుకొని మొత్తం వసూలు అయిన తర్వాత వేరొక ఊరికి వెళ్ళిపోతారు.
కాకిపడిగెల వారి జీవనస్థితి గమనిస్తే ఆర్థిక విషయంలో పూర్వానికి ఇప్పటికి కొంత మెరుగైనట్లు అనిపిస్తుంది. కాని ఆదరణ విషయంలో కొంత తగ్గింది. వారి అభిప్రాయం ప్రకారం ఈ తరం పోతే తమను చూసే వారు ఆదరించే వారు ఉండరేమో అని అంటున్నారు. సామాజికంగా వారి పరిస్థితి దయనీయంగానే ఉంది.

No comments:
Post a Comment