Wednesday, July 01, 2009

with some modifications from india development website

మధుమేహ వ్యాధి / dayabeTisu
మధుమేహ వ్యాధిని - చెక్కర వ్యాది, షుగర్ వ్యాధి అని సాధారణంగా అంటూ వుంటారు.
కారణాలు
1. శరీరములో ఉత్పత్తి అయే ఇన్సులిన్ హార్మోను - శరీరములోని షుగర్ ను సమతుల్యము చేసి, అవసరానికి షుగర్ అందుబాటులో వుండునట్లు చేయుటలో ఇన్సులిన్ ప్రధానపాత్ర వహిస్తుంది.
2. శరీరంలో ఇన్సులిన్ శాతం తగ్గిన laedaa
ఉత్పత్తి అయిన ఇన్సులిన్ శరీరంలోని కణాలు సరిగ వినియోగించుకోక పోవడం వలన - మధుమేహ వ్యాధి వస్తుంది.

సాధారణంగా మధుమేహం ఎవరికి వస్తుంది?
1. అధిక బరువు వున్న వాళ్ళు - చిన్నవారైన - పెద్దవారికైన రావచ్చు.
2. మానసిక వత్తిడికి లోనైనవారు.
3. శారీరక శ్రమ లేనివారికి (sedentary jobs).
4. కొన్ని సందర్భాలలో - వారసత్వంగా కూడా ఈ వ్యాధి రావచ్చును.
5. అవసరమైన మోతాదులకన్నా - ఎక్కువగా ఆహారము తినేవాళ్ళకు.
6. తరచుగా జబ్బులతో బాధపడువారు రోగనిరోధక శక్తిని కోల్పోయి - మధుమేహ వ్యాధి రావచ్చును
7. కొన్ని రకాల మందులు దీర్ఘకాలం వాడడం వలన ఈ వ్యాధి రావచ్చును.

మధుమేహ వ్యాధి లక్షణాలు
1. ఆకలి ఎక్కువగా వుండి - చాలా మార్లు, ఎక్కువగా ఆహారం తీసుకోవడం
2. సాధారణం కన్నా ఎక్కవగా నీరు దప్పికకావడం - ఎక్కువగా నీరు త్రాగడం
3. ఎక్కువసార్లు మూత్రవిసర్జకు వెళ్ళడం.
4. కొంతమందిలో బరువు తగ్గడం, గాయం తగిలిన సరిగా మానకపోవడం - త్వరగా తగ్గకపోవడం.
5. నీరసంగా,నిస్త్ర్రాణంగావుండడం, స్త్ర్రీలలో అసాధారణంగా తెల్లబట్ట(white discharge)
6. తరచుగా చర్మ వ్యాధులు రావడం
7. కొందరిలో కాళ్ళు - చేతులు ముఖ్యంగా పాదాలు అరచేతులు తిమ్మిరిగా వుండడం.
8. ఏదైనా పని చేయాలన్న - చికాకు, అసహనము కలిగి త్వరగా అలసిపోవడం, వంటి లక్షణాలలో ఏ లక్షణాలైనా వుండవచ్చును.

మధుమేహం వలన ఎక్కువ శాతం అన్ని అవయవాలకు అనారోగ్యం కలిగే అవకాశం వుంది.
ముఖ్యమైన అవయవాలు:-
మూత్ర పిండాలు
గుండె
రక్త నాళాలు
కళ్ళు - కంటిలో రక్త నాళాలు, నరాలు
కాళ్ళు, పాదాల నరాల కు మధుమేహప్రభావం కారణంగా - గాయం అయినా, పుండు అయినా - మానకపోవడం లేదా నిదానంగా మానడం జరుగుతుంది.
తీసుకోవలసిన జాగ్రత్తలు:-
వీలైనంత త్వరగా లక్షణాలను గుర్తించి, ఏ రకమైన మధుమేహమో, నిర్ధారించుకోవలసిన అవసరం వుంది - డాక్టరును సంప్రదించి వ్యాధినిర్ధారణ, వైద్యం చేయించుకోవడం ప్రధానము.
శారీర కష్టం చేయనివారు, క్రమంతప్పక వ్యాయామం (అంటేనడక) చేయాలి. ప్రతిరోజు సుమారు 30 నిమిషాలు జోరుగా నడవాలి (Brisk walk). కనీసం వారంలో 5-6 రోజులు నడక వ్యాయామం చేయాలి.
పాదరక్షల lopali భాగము మెత్తగా స్పాంజిలాగా/maikro sellular వుండే విధంగా చూడాలి.
పాదాలు ఎల్లప్పుడు శుభ్రంగా వుంచుకొని - వీలైనప్పుడు డాక్టరును సంప్రదించి రక్తపరీక్షలు -మూత్రపరీక్షలు చేయించుకోవాలి.
క్రమం తప్పక వైద్యం చేయించుకోవాలి.
మితంగా అహారం తీసుకోవాలి.
"కడుపు నిండకూడదు - ఖాళీ వుండకూడదు" అన్న నానుడికి అనువుగా ఆహారపు అలవాట్లు అలవరచుకోవాలి.

ఆహారంలో తీసుకోవలసిన పదార్ధాలు
ఆకు కూరలు, వంకాయ, బెండ, కాకర, పొట్ల, కాబేజి, దొండకాయ, మునగకాడలు, టమాట, కాలిఫ్లవర్ మొదలగునవి -

ఆహారములో తీసుకోకూడని పదార్ధాలు
పంచదార, తీపిపదార్ధాలు, బెల్లం, జీడిపప్పు, బాదం, కొబ్బరి నీళ్ళు, హార్లిక్స్ లాంటి పొడి పదార్ధాలు, అరటి, మామిడి, సపోటా, సీతాఫలం, ద్రాక్షవంటి పండ్లు, బిస్కట్లు, చాక్లెట్, కేకులు మొ"నవి, బంగాళాదుంప, నెయ్యి, ఇతర నూనె పదార్ధాలు.

తీసుకోవలసిన జాగ్రత్తలు :
చర్మం - ప్రత్యేకమైన జాగ్రత్తలు ఎందుకు అనగా గ్లూకోస్ రక్తం లో ఎక్కువ మెతాదు లో ఉన్నందున సూక్ష్మ క్రిములు (అనగా బాక్టీరియా) ఫంగస్ ఎక్కువ ఉత్పత్తి అవడం జరుగుతుంది. సామాన్యం గా మధుమేహ వ్యాధి గ్రస్తులకు వ్యాధి నిరోధక శక్తి తగ్గినందువలన సూక్ష్మ క్రిముల తో పోరాడడం తగ్గుతుంది.
అందు వలన చర్మం ఎప్పుడు సుభ్రంగా ఉంచాలి
చర్మం రంగు మారినా, మందంగా ఉన్నా
చర్మం పై బొబ్బలు ఉన్నా
చర్మం ఎర్రగా వాపు ఉండి, వేడిగా ఉన్నా ఇది చర్మం ఇన్ ఫెక్షన్ అయిఉండవచ్చు
గజ్జలలో దురద స్త్రీ మర్మాంగ అవయవాలలో చంకలలో కాలి వేళ్ళ మధ్య దురదలు ఎక్కువగా ఉన్నా
దెబ్బ తగిలి మానకుండా ఉన్నా
వెంటనే డాక్టర్ సలహా పొందాలి (చర్మవ్యాధి డాక్టర్ )
ప్రతి రోజూ క్రమం తప్పకుండా గోరు వెచ్చని నీళ్ళ తో సున్నితమైన సబ్బు వాడి స్నానం చేయాలి, మరిగే నీళ్ళు వాడరాదు.
స్నానం అయిన తరువాత మెత్తటి సుభ్రమైన పొడి బట్టతో తడి అంతా తుడుచుకోవాలి, శరీరం పై ఎక్కడా నెమ్ము ఉండరాదు. ప్రత్యేకంగా చర్మం ముడతలలో, తడి ఉన్నచో చర్మం దురదతో గోకిన చొ బాక్టీరియల్ ఇన్ ఫెక్షన్ రావచ్చు.
ఎక్కువ నీరు త్రాగటం అలవాటు చేసుకోవాలి , చర్మం ఎండి పోయినట్లు ఉండదు

మధుమేహ వ్యాధి గ్రస్ధులు – తీసుకొవలసిన ఆహారం

మధుమేహ వ్యాధి గ్రస్ధులు – తీసుకొవలసిన ఆహారం
నీరు కావలసినంత మొతాదు ( రోజుకు సుమారు 8 గ్లాసులు )
వీరు తీసుకొనే ఆహారంలో పిండి పదార్ధాలు తక్కువగా ఉండి సంపూర్ణ ఆహారమై ఉండాలి
వీరు తీసుకొనే ఆహారం వారి చికిత్స పై ఆధారపడి ఉంటుంది
వీరు తీసుకొనే ఆహారంలో ముఖ్యంగా ఈ క్రింద చూపబడినవి తగు పాళ్ళలో ఉండాలి : ఉదాహరణకు
పదార్ధాలు
( గ్రా ) శాకాహారులు
( గ్రా ) మాంశాహరము
గింజ ధాన్యాలు
200
250
పప్పు ధాన్యాలు
60
20
ఆకు కూరలు
200
200
పండ్లు
200
200
పాలు
400
200
నూనెలు
20
20
చేపలు/ కోడి మాంసము చర్మం లేకుండా
-
100
మిగతా కూరగాయలు
200
200

పైన చెప్పిన ఆహారం లో శక్తి
మొత్తం కాలరీస్
1600
మాంసకృత్తులు
65gs
కొవ్వు
40gs
పిండి పదార్ధాలు
245gs

No comments: