ఆహార నియమాలు పాటించాలి
పిజ్జా, బర్గర్, ఫైడ్రైస్, న్యూడిల్స్ వంటి ఫుడ్స్, నిల్వచేసిన ఆహార పదార్థాలు, వేపుళ్లు, మసాలా పుడ్స్ తినడం ద్వారా ఒబిసిటి థైరాయిడ్, సుగర్, అధికబరువు వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. ఒక మనిషి రోజుకి 1600 నుంచి 1800 క్యాలరీలు ఆహార పదార్థాలుగా తీసుకోవాల్సి ఉంది. 2000 నుంచి 2,500 క్యాలరీలు తీసుకుంటున్నారు.
శారీరక శ్రమ, వ్యాయామం చేయాలి
ప్రస్తుత సమాజంలో బిజిబిజీగా ఉండే ప్రజలు శారీరక శ్రమ, వ్యాయామం చేయడానికి విస్మరిస్తున్నారు. గతంలో పురుషులు, మహిళలు రోజుకు కొంత సమయాన్ని తోటల్లో మొక్కలు పెంపకం, ఇళ్లల్లో తేలికపాటి పనులు చేస్తూ శారీరకంగా శ్రమించేవారు. ప్రజల జీవనవిధానంలో మార్పులు, యాంత్రికరణతో శారీరక శ్రమ జోలికి పోవడం లేదు. ఆధునిక కాలంలో వ్యాయామం చేయడానికి సరిగ్గా సమయం దొరకడం లేదు. వ్యాధులబారిన పడకుండా ఉండాలంటే ప్రతి మనిషీ రోజుకు 30 నుంచి 40 నిమిషాల పాటు నడవాలి. ప్రజలు వారానికి ఐదురోజులు 45 నిమిషాలు పాటు నడవాలని వైద్యులు సూచిస్తున్నారు.
మానసిక ఒత్తిడికి దూరంగా
ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఆధునిక కాలంలో మానసిక ఒత్తిడి వల్ల రక్తపోటు, మధుమేహం, గుండెపోటు, ఆయాసం, థైౖరాయిడ్ వంటి వ్యాధుల బారిన ప్రజలు పడుతున్నట్లు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. మానసిక ఒత్తిడిలకు దూరంగా ఉండాలంటే యోగా, మెడిటేషన్ చేయాలి.
మధుమేహ వ్యాధిపై అవగాహన
ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది మధుమేహంపై అవగాహనకు పిలుపు నిచ్చారు. మధుమేహ వ్యాధి లక్షణాలు, వ్యాధి నిర్ధారణ, చికిత్సపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం కల్పించి తద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ద్వారా మధుమేహ వ్యాధిని నియంత్రించొచ్చు. మధుమేహ వ్యాధి భారం, దాని పరిణామాలు, వ్యాధి పరివీక్షణ, నివారణ మార్గాలు, మధుమేహ రోగులకు సమర్థ వంతమైన చికిత్సలపై ప్రభుత్వాలను సన్నద్ధులను చేయాలి.
శారీరక శ్రమ, వ్యాయామం తప్పనిసరి
ప్రస్తుతం కాలంలో ప్రజలు బిజిగా ఉంటున్నారు. వారి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. శారీరక శ్రమ, వ్యాయామం చేయడం మానసిక ఒత్తిడుల నుంచి దూరంగా ఉండడం ద్వారా భావితరాలకు ఆరోగ్యాన్ని అందించొచ్చు. తల్లిదండ్రులు, పిల్లలు మధ్యంతరం రాకుండా ఉండాలంటే ప్రతి కుటుంబం రోజుకి గంటసేపు కుటుంబ సభ్యులతో గడపాలి. ప్రతి కుటుంబం ఒక మొక్కను నాటాలి. భావి తరాలు ఆరోగ్యంగా ఉంటే దేశం ఆరోగ్యంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది.
డాక్టర్ మోకా ప్రసాదరావు, వైద్య నిపుణులు, రాజోలు

No comments:
Post a Comment