Sunday, July 31, 2016

గర్భిణీల్లో మధుమేహ సమస్య జెస్టేషనల్‌ డయాబెటిస్‌(gestational Diabetes )

                    నేడు ప్రపంచవ్యాప్తంగా మధుమేహ రోగుల సంఖ్య పెరుగుతోంది. ఎంతలా అంటే. ఇంకా భూమిపై పడని అమ్మకడుపులోని పాపాయి ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపేంతగా. గర్భిణుల్లో వచ్చే మధుమేహం కొంతమందిలో ప్రసవం తర్వాత దూరమవుతుంది. మరికొందరిలో ప్రసవం తర్వాత కూడా కొనసాగుతుంది. ఈ అంశంపై అంతర్జాతీయస్థాయిలో అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. దీని నియంత్రణకు గర్భిణీల్లో వచ్చే మధుమేహం కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెంచుకోవాలి.
గర్భిణీల్లో మధుమేహం సర్వసాధారణ సమస్యగా మారిపోయింది. కాబోయే అమ్మ గర్భం దాల్చి 24 వారాలు నిండిన తర్వాత తప్పనిసరిగా ఓరల్‌ గ్లూకోజ్‌ టోరెన్స్‌ టెస్ట్‌ (ఓజిటిటి/OGTT ) చేయించుకోవాలి. ఫాస్టింగ్‌ షుగర్‌ పరీక్షలో రక్తంలో గ్లూకోజ్‌ స్థాయి 90 కన్నా ఎక్కువ, పోస్టుప్రాండియాల్ షుగర్‌ పరీక్షలో 140 కన్నా ఎక్కువగా ఉన్నా జెస్టేషనల్‌ డయాబెటిస్‌(gestational Diabetes ) అంటారు. ఇందుకు కారణాలు ప్రధానంగా గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పుల వల్ల రక్తంలో గ్లూకోజ్‌ లెవల్స్‌ బాగా పెరుగుతాయి. జెస్టేషనల్‌ డయాబెటిస్‌ ఉన్నవారు ఆహార మార్పులతో పాటు అవసరమైతే డాక్టర్‌ సలహా మేరకు ఇన్సులిన్‌ వాడవలసి ఉంటుంది. జెస్టేషనల్‌ డయాబెటిస్‌ వల్ల రెండు ప్రధాన సమస్యలు వస్తాయి. అవి ఒకటి గర్భస్థ శిశువు పరిమాణం, బరువు పెరుగుతుంది. దీనివల్ల ప్రసవ సమయంలో ఇబ్బందులు వస్తాయి. రెండు శిశువుకు గర్భంలో షుగర్‌ అలవాటు కావడం వల్ల డెలివరీ అయిన వెంటనే శిశువు శరీరంలో షుగర్‌ లెవల్స్‌ పడిపోతాయి. పాపాయిని ఐసియులో ఉంచాల్సిన పరిస్థితి వస్తుంది. తల్లికి ప్రెగెన్సీలో డయాబెటిస్‌ వస్తే బిడ్డకు డయాబెటిస్‌ వస్తుందని చాలా మంది భయపడతారు. ఇది కేవలం అపోహ మాత్రమే. గర్భిణీలకు డయాబెటిస్‌ ఉంటే పిల్లలకు  వెంటనే రాదు. జెస్టేషనల్‌ డయాబెటీస్‌ ఉన్నవారిలో ప్రసవం తర్వాత డయాబెటిస్‌  మామూలుగా తగ్గిపోతుంది. అయితే వీరిలో యాభై శాతం మందికి నాలుగైదు సంవత్సరాల్లో డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి. 
జాగ్రత్తలు
ప్రసవం తర్వాత సరైన ఆహారం తీసుకోనివారిలో, ఆహారపు నియమాలు పాటించని వారిలో త్వరగా డయాబెటీస్‌ వచ్చే ప్రమాదం ఉంది. ప్రసవం తర్వాత బరువు తగ్గుతారు. కొంతమంది మాత్రం మొదటి మూడునెలలు బరువు తగ్గి ఆ తర్వాత క్రమంగా బరువు పెరుగుతారు. ఇది ఆరోగ్యకరమైన లక్షణం కాదు. బిడ్డకు తప్పనిసరిగా తల్లిపాలు ఇవ్వాలి. బిడ్డకు పాలివ్వని తల్లులు బరువు పెరుగుతారు. బిడ్డకు పాలివ్వడం అనేది తల్లీబిడ్డల ఆరోగ్యానికి ఎంతో మేలు.
అంటే కాకుండా ఎక్సర్ సైస్  మరియు డయటింగ్ పాటించి  మధుమేహం రాకుండా జాగ్రత్త పడాలి 

బేస్డ్  ఆన్ http://www.prajasakti.com/Content/1759064

No comments: