డయాబెటిస్ స్వీయ-నిర్వహణ కు ముఖ్యమైన అడ్డంకులు
డయాబెటిస్ స్వీయ-నిర్వహణ కు ముఖ్యమైన అడ్డంకులు
1) డయాబెటిస్ గురించి పరిజ్ఞానం మరియు అవగాహన లేకపోవడం
2) ఒక నిర్దిష్ట స్థిరమైన ఆహార పద్ధతి లేకపోవడం
3) డాక్టర్ పేషంట్ మరియు కుటుంబ సభ్యుల మద్య సమన్వయం లేకపోవడం
4) చెప్పిన దంతా చేస్తున్నా బ్లడ్ షుగర్ సరిగ్గా కంట్రోల్ కాకపోవడం, దీన్తొ చిరాకు, కోపం, నిరాశ, నిస్సహాయత కలిగి , మొత్తానికే ఎటువంటి కంట్రోల్ చేయకుండా, ఇది నా కర్మ అనుకోని డాక్టర్ల దగ్గరికి పోవడం ఆపేయడం.
5) పెషంట్లకి, అప్పుడప్పుడు డాక్టర్లకి కుడా డయాబెటిక్ మందులు పనిచేసే విధానం నిర్దుష్టంగా తెలియక, ఒకే రకం గా పని చేసే రెండు మందులు కలిపి ఇవ్వడం/ తీసుకోవడం వల్ల కంట్రోల్ లేక పోవడం, డబ్బు దుబారా అవడం జరుగుతుంది.
6) గుర్తుపెట్టుకొని సిఫార్సు చేసిన పరికరాలు, మందులు, ప్రయోగశాల/ రక్త పరీక్షలు చేయడానికి కావలసిన
డబ్బు సమయం లేకపోవడం.
7) వందల రకాల డైట్ ప్రోగ్రామ్లు, మందులు, టెస్టు చేసే మెషిన్లు, కుప్పలు కుప్పలుగా వచ్చి, ఏది తీసుకుంటే ఎంత మంచి లేదా చెడు జరుగుతుందో అని తెలుసుకోవడం గజిబిజి అయిపొవడం
8) డయాబెటిస్ ఉన్న ప్రతి పేషంట్ యునీక్ గా ఉన్నా, సగటు వ్యక్తికీ అవసరపడే ఒకటో లేదా రెండు స్థిరమైన మందుల ఆహార ప్రణాళికను సులభం గా అర్థమై, తక్కువ ప్రయాసతో అవలంబించి మంచి బ్లడ్ షుగర్ కంట్రోల్ చేసుకొని డయాబెటిస్ యొక్క కాంప్లికేషన్లు అవ్వకుండా కాపాడుకోవడానికి ప్రణాళికలు సులువుగా ప్రాంతీయ భాషలలో అందుబాటులో లేకపోవడం
9) ఇందులో అతి ముఖ్యమైన విషయం చివరిది. ఈ లోపం పూరించడానికి,నేను ఒక ఉచితంగా అందుబాటులో ఉండే వెబ్సైట్ రూపొందించేందుకు ప్రయత్నించబోతున్నాను. దీనికోసం ప్రతి ఒక్కరి సహాయం అర్థిస్తున్నాను
“ఇంతకు ముందు నేను చూసిన డాక్టర్ మధుమేహం తరగతులు లేదా ఏదైనా ఎడ్యుకేషన్ క్లాసుల గురించి ఎప్పుడూ మాట్లాడ లేదు, కేవలం మధుమేహం ఉన్నట్లయితే నాకు చెప్పారు. కేవలం నన్ను ఒక మాత్ర వేసుకోండి చాలు అన్నారు, కాని ఇంకేమీ విషయాలు నాకు చెప్పలేదు”
నేను పని లో ఉన్నప్పుడు ఒక రోజు నా చక్కెర 47 కి పడిపోయింది ... మీ చక్కెర తక్కువ ఐనప్పుడు, ఎక్కువ ఐనప్పుడు ఏం చెయ్యాలి అన్నది వివరంగా నాకు చెప్పలేదు. నేను ఇక్కడ (ఈ వైద్యుడు) దగ్గరికి రావడం ప్రారంభించాకే నేని పద్దతులన్నీ నేర్చుకొన్నాను అని ఏంతో మంది రోగులు నాకు చెప్తుంటారు
మీ శరీరం నయం చెయ్యడానికి ముందు,మీ మెదడుకు శిక్షణ ఉండాలి
కాబట్టి ఒక విస్తృతమైన తెలుగు బాషలో సులువుగా అర్థమయ్యే ట్లు ఉండే డయాబెటిస్ /మధుమేహం గురించి దాని చికిత్స రోగ పరిస్థితి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రతి ఒక్కరికి మళ్లీ మళ్ళి చెప్పేందుకు బదులు ఒక మంచి పుస్తకమో ఒక వెబ్ సైట్ తయారు చేస్తే అది ప్రతి ఒక్కరికి పనికొస్తుందని నాకు అనిపించింది .
నేను నా భార్య ఇద్దరమూ డాక్తర్లము ఇద్దరికీ డయాబెటిస్ ఉంది నాకు రెండు నెలల క్రితం తెలిసింది, మా ఆవిడకి దాదాపు పది సంవత్సరాలనుండి ఉన్నది .
నా ఇద్దరి బ్రదర్స్ , మా ఆవిడక ముగ్గురు బ్రదర్స్ కి ,నా అత్తగారికి ఇది ఉండడమే కాక చాలా కాంప్లికేషన్స్ అయ్యి ఒక బ్రదర్ ఇటీవలే కిడ్నీ ఫైల్యూర్ వల్ల మరణించడం జరిగింద.
ఇవన్ని జరిగాక ఎంతోమంది స్ట్రగుల్ చెయ్యడం చూసినాక ఒక మంచి పుస్తకమో, ఒక వెబ్ సైట్ లాంటిదో తయారు చెయ్యడం ఏంతో అవసరమనిపించి ఇది మొదలెట్టాను.
No comments:
Post a Comment