స
namAmi nArAyaNa pAda paMkajaM
vadAmi nArAyaNa nAmanirmalaM
BhajAmi nArAyaNa tattvamavyayaM
karOmi nArAyaNa pUjanaM sadA |SlO|
AlOkya sarva SAstrANi
vicAryaca punah punah
idamEkaM suniShpan&naM
dhyAyEn&nArAyaNaM sadA |SlO|
Sree ramA hRdayESvarA - Bhakta jana citta jalaruha BhAskarA
kAruNya ratnAkarA - neeve gati kAvavE nArAyaNA || [1]
pApa karmamulam jEsi - naraka kUpamulam baDajAla nimkanu
neepAda Bhakti yosamgi - yokka darim jUpavE nArAyaNA || [2]
dAna dharmamulam jEya-nEra, nee dAsulanu bogaDa nEra,
nA nEramulam dalampaka - daya cEsi nan&nElu nArAyaNA || [3]
Ana yiMcuka lEkanu - durBhASha lADu nA jihva yaMdu,
nee nAma caturakshari - dRDhamugA nilupa vale nArAyaNA || [4]
okaTi pariSuddhi lEka - nA janma makaTa! vyarthaM bAyenu
akalaMka magu mArgamuM - jUpavE sakalESa! nArAyaNA || [5]
vEgi lEcinadi modalu - saMsAra sAgaraMbuna neemducu
mee guNamu noka vELanu - dalampagade mElanucu nArAyaNA || [6]
lOka vArtalaku maramgi - karNamula meekathala vina nEranu,
E karaNee Bhava jaladhim - dudamuTTa neemdedanu nArAyaNA || [7]
ila manuja janma metti - suj~nAna miMcu kaMtayu lEkanu,
kalamtam jeMdeDu cittamun^ - svacChaMbugAm jEyu nArAyaNA || [8]
yeMta pApAtmumDaina - mimum dalaMci kRtakRtyumDaunum,
buDami niMta parusamu sOmkina - lOhaMbu hEmamau nArAyaNA || [9]
kAmAMdhakAramunanu - bekku duShkarmamulam jEsi nEnu,
nee ma~rumgu joccinAnu - nAmeemda neneruMcu nArAyaNA || [10]
samayamainapuDu mim&mum -dalacuTaku Sakti galuguno kalu
gadO, samayamani talamtunipuDu -nA hRdaya kamalamuna nArAyaNA || [11]
ATalan&niyu ~raMkulu -nEnADu mATalan&niyu boMkulu,
pATiMpa niMtakaina -nun&nadE pApaMbu nArAyaNA || [12]
vAvi dappina vAmDanu -duShkriyA vartanumDa nagudu nEnu,
bAvanunigAm jEyave nanum batita pAvanumDa nArAyaNA || [13]
dEhamE dRDhamanucunu -delisi nE mOhabaddhumDa nagucunu,
sAhasaMbuna jEsitim -nEguru drOhaMbu nArAyaNA || [14]
en&ni jan&mamu lAyenO -nETi keMdeMdu jan&miMcinAnO
nan&nu darim jErpam gadavo -yimkanaina nA taMDri nArAyaNA || [15]
yama kiMkarulam dalamcina -nAguMDe yAvuliMpucu nun&nadi
yamuni bAdhalu mAn&panu -mAyappa vaidyumDavu nArAyaNA || [16]
arayam gAma krOdhamul -lOBhaMbu mOhamada matsara
mulu, ta~rumga veppuDu manasuna -nin&nepuDum dalacedanu || [17]
ASA piSAci paTTi, -vairAgya vAsanalam jEraneeyadu
gAsi peTTucu nun&nadi -nEnEmi cEyudunu nArAyaNA || [18]
tApatrayaMbum jeMdi -cAlam baritApa moMdeDu cittamu
nee pAdamulam jeMdinam -jallanai nilicedanu nArAyaNA || [19]
ciMtA paraMparalacEm -cittaMbu ceemkAku paDucun&nadi,
saMtOShamunam gUrpave -divya prasAdamulu nArAyaNA || [20]
prAyamellanu bOyenu -nASa leDam bAyam jAlaka yun&navi
mAyA prapaMcamEla -cEsedavi mAyayya nArAyaNA || [21]
SaraNum joccinavAmDanu -nEm jEyuduritamula napahariMci
parama pada mosamgam gadave -yimkanainam baramAtma nArAyaNA || [22]
saMkalpamulu puTTinam -garma vAsanala dRDhamugam jEyavu
saMkaTamu noMdiMcakE -nanu satya saMkalpa nArAyaNA || [23]
okavELa nun&na buddhi -yoka vELa nuMDadimka nEmi sEtu
viSadaMbugAm jEyavE -neevu nA cittamuna nArAyaNA || [24]
neTTukoni sakala jeeva -kOTulanu goTTi BhakshiMcinAnu
poTTa ko~rakai neecula -sEviMci raTTayiti nArAyaNA || [25]
nEnu puTTinadi modalu -AhAra nidralane jane kAlamu
pUni yeppuDu sEyudu -neepadadhyAnaMbu nArAyaNA || [26]
proddu vOvaka yun&nanu -vEsaraka porugiMDlu tirumgugAni
buddhimAlina cittamu -neeyaMdum boMdadE nArAyaNA || [27]
en&ni vidhamulam jUcina -nityamunu hRdayamuna mimu
ma~ravaka yun&naMtakan&na suKhamu -vE~rokkaTun&nadE nArAyaNA || [28]
lABha lOBhamula viDici -yihaparaMbulanu Phala mAsiMpaka
nee Bhaktulaina vAru -dhanyulai negaDedaru nArAyaNA || [29]
muMdu nee sRShTi lEka -saccidAnaMda svarUpaMbunu
boMdi BhEdamu noMdaka -brahmamai yuMduvamTa nArAyaNA || [30]
kAlatrayee bAdhyamai -ma~ri nirAkAramai yuMDu katanam
jAlamgAm dattvaj~nulu -teliyuduru sattaguTa nArAyaNA || [31]
j~nAna svarUpamunanu -najaDamai jaDa padArthamu nellanu
gAnamgAm jEyu katanam -jittaMDru Ghanulu ninu nArAyaNA || [32]
suKha duhKhamula reMTiki -vE~ragucu suKha rUpamaina katana
naKhila vEdAMta vidulu -AnaMdamaMDru ninu nArAyaNA || [33]
guNa mokaTiyaina lEni -neeyaMdu guNamayaMbaina mAya
gaNutiMpam ganu paTTeDu -darpaNamu kaivaDini nArAyaNA || [34]
aMdum bratibiMbiMcina -citsadAnaMda samudAyamellam
jeMdu neeSvara BhAvamu -triguNa saM SliShTamayi nArAyaNA ||[35]
satvaMbu rajamu tamamu -nanu mUmDu saMj~nalanu gramamu
tODam dattvaj~nulErpariMpam -sadguNa trayamulanu nArAyaNA || [36]
prakRti neeyaMdu leenamai -yuMDi smRtini jeMdina vELanu
sakala prapaMca miTulam -ganupaTTe nakaLaMka nArAyaNA || [37]
meeru saMkalpiMcina -yiShTaprakAramunu jeMdu mAya
yArUDhi vivariMceda -navvidhaM boppaMga nArAyaNA || [38]
paMcaBhUtamulu manasu -buddhiyunu brakaTahaMkAramu
lunu, neMcaMga niTTimAya -yidigA prapaMcaMbu nArAyaNA || [39]
BhUtapaMcaka tattva saM -GhAtamunam buTTe naMtahkaraNamu
KhyAtigA naMdum dOmci -cittu jeevAtmAye nArAyaNA || [40]
vesa manO buddhi cittA -haMkAra vRttu laMtahkaraNamu
pracuriMpa navi nAlugu -tattva rUpamulAye nArAyaNA || [41]
Bhautika rajOguNamulunu -nEkamai prANaMbu puTTiMcenu
vAda BhEdamulacEtam -baMca pApamulAye nArAyaNA || [42]
alaru prANa mapAnamu -vyAnaMbudAnamu samAnaMbulu
talampa nee saMj~nalamari -vAyutattvamu loppu nArAyaNA || [43]
pratyEka BhUta sattvaguNamulana -baramgi buddheeMdriyamulu
sattvamuna janiyiMcenu -dattva prapaMcamuga nArAyaNA || [44]
cevulu carmamum gan&nulu -jihva nAsikayum bErula cEtanu
dagili buddheeMdriyamula -viShaya saMtatim deliyu nArAyaNA || [45]
Bhautika tamOguNamuna -viShayamulu ta~rucugAm janiyiM
cenu, Sabda sparSa rUpa -rasa gaMdha nAmamulu nArAyaNA || [46]
tAdRSa rajOguNamuna -janiyiMce naraka karmEMdriyamulu
aidu tattvam&mu lagucunu -garma niShThAdulaku nArAyaNA || [47]
vAkpANipAdapAyU -pasthalanu vAni pELLamarucuMDum
bkvahRdayulakum deliyu -neevidhamu paramAtma nArAyaNA || [48]
paluku panulunu naDupunu -malamUtramulu viDucuTee ya
yidunu velayam garmEMdriyamula -viShayamulu naLinAksha nArAyaNA || [49]
paramgam jaMdruMDu brahma -kshEtraj~num DaruvoMdu rudrum
DacaTi, paramAnasAdulakunu -nadhipatulu vivariMpa nArAyaNA || [50]
araya dikkuna vAyuvu -sUryumDunu, varuNuMDu, naSvinu
lunu, baramga SrOtrAdulakunu -nadhipatulu parikiMpa nArAyaNA || [51]
analum, DiMdrumDu, viShNuvu -mRtyuvunu, nala prajApatiyum
gUDi, yonaramgA nADulakunu -nadhipatulu parikiMpa nArAyaNA || [52]
paMceekRtaMbAyenu -BhUtapaMcakamu, prabaliMci sRShTi
paMceekRtamucEtanu -sthUla rUpamu lAye nArAyaNA || [53]
padi yiMdriyamula manasu -buddhiyunu, brANaMbulaidu
gUDi, padiyEDu tattvamulanu -sUkshmarUpamulAye nArAyaNA || [54]
sthUlasUkshmamulu reMDu -kaluguTaku mUlamagu naj~nAna
mu, leela kAraNa mAyenu -jeevulaku nAlOna nArAyaNA || [55]
eereMDu dEhamulaku -viSvaMbu nellam brakaTanaMbAyenu
nAma rUpamula cEta -lOkaika nAyakumDa nArAyaNA || [56]
kon&ni mAyanum buTTunu -gruDlatOm gon&ni tanuvulu puTTu
nu, gon&ni dharaNini buTTunu -jemaTalanu gon&ni hari nArAyaNA || [57]
ee caturvidha BhUtamulaMdum -gaDu heccu mAnava janmamu
neecamani cUDarAdu -tathyamE nirNayamu nArAyaNA || [58]
ee janmamaMdekAni -mukti ma~ri yEjanmamaMdu lEdu
cEsEtam danu deliyaka -mAnavumDu ceDipOvu nArAyaNA || [59]
cEtanAcEtanamulu -puTTucunu rOmtalaku lOnagucunu
nAtaMka paDucuMDunu -garmamulam jEtamnuDu nArAyaNA || [60]
sakalayOnulam buTTucum -balumA~ru svarga narakamulam baDu
cu, nokaTa nU~raTa gAnaka -paritApa moMditini nArAyaNA || [61]
velaya nenubadinAlugu -laksha yOnulayaMdum buTTigiTTi
yalasi mUrChalam jeMducu -bahuduhKhamula cEta nArAyaNA || [62]
kramamutO manujagarBha -munam baDucum garmavaSagatumDagu
cunu, namitamuga naccOTanu -garBhanarakamunam baDu nArAyaNA || [63]
eeSvarAj~nanu buTTina -telivicE hRdayamunam dalapOyucu
viSvamunam danu boMdina -pATella vErvE~ru nArAyaNA || [64]
cAlu cee! yika janmamu -nimkam buTTum jAlu, Sreehari BhajiMci
mElu ceMdeda nanucunu -jiMtiMcu nAlOna nArAyaNA || [65]
prasavakAlamunam dalli -garBhamunam bAdukoni niluvalEka
vasudhapayi nUDipaDinam -delivicE vApOvu nArAyaNA || [66]
canumbAlu guDici prANa -dhAraNanu nimka mUtra malamu
lOnu, munimgitElucunuMDunu, durgaMdhamuna nArAyaNA || [67]
bAlatvamuna bittarai -nalugaDalam bA~rADu siggulEka
pAlupaDi yauvanamunam -viShayAnuBhavamoMdu nArAyaNA || [68]
mudimi vaccina venukanu -saMsAramOhaMbu mAnakuMDam
dudanEmgum garmagatulam -boMduTaku mudamEmi nArAyaNA || [69]
aj~nAna lakshaNam&mu -liTuvaMTivani vicAriMci narumDu
suj~nAnamunakum -dagina mArgaMbu cUDavale nArAyaNA || [70]
vEdAMta vEdiyaina -sadguruni pAdapadmamulu ceMdi
yAdayAnidhi karuNacE -sadbOdha maMdavale nArAyaNA || [71]
E vidyakaina guruvu -lEkun&na nAvidya paTTupaDadu
kAvunanu naBhyAsamu -guruSiksha kAvalenu nArAyaNA || [72]
gurumuKhaMbaina vidya -nen&nikai konina BhAvaj~nAnamu
ciratarAdhyAtma vidya -naBhyasiMpamga lEDu nArAyaNA || [73]
anapEkshakumDu sadayumDu -vEdAMtanipuNumDayyAcAryu
Du dorukuTapurUpamapuDu -gu~rutaina gu~ri yoppu nArAyaNA || [74]
aTTisadguruni vedaki -darSiMci yA mahAtmuni padamulu
paTTi kRtakRtyumDaunu -sAdhakumDu gaTTigA nArAyaNA || [75]
mogi sAdhanamulu nAlgu -galanarumDu muKhyAdhikAri yagunu
dagina yupadESamunaku -yOgasAdhakulalO nArAyaNA || [76]
idi nitya midiyanityaM -banucum dana madi vivEkiMcuTo
kaTi, yedanu nihapara suKhamulu -kOranidi yidiyokaTi || [77]
mudamutO SamadamAdi -ShaTka saMpada galigi yuMDuTo
kaTi, viditamuga muktim boMdam -gAMkshiMcu TadiyokaTi || [78]
eenAlgu sAdhanamula -nadhikAriyai nijAcAryum jEri
nAnA prakAramulanu -SuSrUSha naDupavale nArAyaNA || [79]
ullamunam gApaTyamu -lava maina nuMDa neeyaka satatamu
talli daMDriyum daivamu -guruvanucum dalampavale nArAyaNA || [80]
tanuvu, dhanamunu, saMpada -guruni som&mani samarpaNamu
cEsi, velasi tatparataMtrumDai -nityamunu melamgavale nArAyaNA || [81]
EniShTha guruniShThaku -deeTugAdee prapaMcaMbunaMdu
mAnasamu dRDhamu cEsi -yalaravale mauniyai nArAyaNA || [82]
iTTi SiShyuni pAtrata -veekshiMci hRdayamunam gAruNyamu
neTTukoni brahmavidya -gurumDosamgu neyyamuga nArAyaNA || [83]
brahmaMbu galumgamgAne -yEtatprapaMcaMbu galigi yuMDu
brahmaMbu lEkun&nanu -lEdee prapaMcaMbu nArAyaNA || [84]
ee vidhaMbuna sUktula -brahma sadBhAvaMbu galugam jEsi
BhAva gOcaramu cEyum -jitsvarUpamulella nArAyaNA || [85]
A brahmamaMde puTTu -viSvaMbu nAbrahmamaMde yuMDu
nA brahmamaMde yaNamgu -nade cUDu mani cUpu nArAyaNA || [86]
adi saccidAnaMdamu -adi Suddha madi baddha madi yuktamu
adi satya madi nityamu -adi vimalamani telupu nArAyaNA || [87]
ade brahma made viShNuvu -ade rudrum Dadiye sarvESvaruMDu
adi paraMjyOti yanucu -bOdhiMcu viditamuga nArAyaNA || [88]
BhAviMpa vaSamugAdu -iTTidani paluka SakyaMbugAdu
BhAvaMbu nilupucOTa -nasi tAnu baramaunu nArAyaNA || [89]
adi mAyatOm gUDamga -SivumDAye, nadiye vidyanu gU
Damga viditamugA jeevumDAye -nani telupu vErvE~ra nArAyaNA || [90]
SivumDu kAraNa Sareeri -kAryaMbu jeevumDA lakshaNamulu
dvividhamugam deliyu nanucu -bOdhiMcu vivaramuga nArAyaNA || [91]
araya niruvadi nAlugu -tattvaMbulai yuMDu naMdama
gucum garatalAmalakamuganu -bOdhiMcum brakaTamuga nArAyaNA || [92]
kAraNamu kAryamagucu -vyavahAra kAraNAKhyata nuMDunu
nArUDhi brahmAMDamu -piMDAMDa mani telupu nArAyaNA || [93]
aidu BhUtamulu, niMdri-yamulu padi, yaMtaraMgamulu
nAlgu, aidu viShayamulu tattva -saMGhAtamani telupu nArAyaNA || [94]
sthUla sUkshmAkRtulunu -gAraNamutO mUDu te~ramgulaku
nu, neelamagu naMdu namaru -nani telupu lAliMci nArAyaNA || [95]
velasi paMceekRtamulu -nagu BhUtamulakum buTTinadi tanu
vu, sthUlaMbu nadi yanucunu -bOdhiMcu dayatODa nArAyaNA || [96]
aidu nayidiMdriyamulu -prANaMbu layidu, manasunu bu
ddhiyum, bAdukoni sUkshma maMdu -bOdhiMcum brakaTamuga nArAyaNA || [97]
gADhamagu naj~nAnamu -eereetim gAraNa Sareera magunu
mUDhulaku vaSamugAdu -teliya vinu mOdamuna nArAyaNA || [98]
eemUmDu tanuvulaMdu -dA nuMDi eetanuvu tAnanucunu
vyAmOha paDucuMDu(nu) -jeevuMDu varusatO nArAyaNA || [99]
kalalEka nidriMcunu -kalamgAMci kaDu mElugOru cuMDunu
galakAla mee jeevumDu -trividhamulam galasiyunu nArAyaNA || [100]
prAj~nataijasa viSvulu -tAne, eeparyAyamuga jeevumDu
praj~nagOlpaDa poMdunu -saMsAra baMdhaMbu nArAyaNA || [101]
mUmDavasthalaku sAkshi -yainaTTi mUlaMbu tAm delisinam
jUDumani sanmArgamu -tETagAm jUpucunu nArAyaNA || [102]
neevu dEhaMbu gAvu -prANaMbu neevugAviMdriyamulu
neevugAdani telupunu -vEdAMta nilayamuna nArAyaNA || [103]
anala taptaMbu gAdu -jalamunanu munimgi taDim jeMdambO
du, anilaSulkaMbugAdu -nirupamaM bani telupu nArAyaNA || [104]
kAmahaMkAra mipuDu -cittaMbugA veevu buddhi neevu
kAvu manasulu satyamu -sAkshivagu gaTTigA nArAyaNA || [105]
dEhadharmamulu neekum -dOmcu TaMtEgAni nityamuganu
mOhaMbu mAnumanucu -bOdhiMcu muKhyamuga nArAyaNA || [106]
en&ni dEhamulu ceDina -neevu nEka svarUpuMDa vagucu
jen&nalari yuMdu vilanu -dattva prasiddhamuga nArAyaNA || [107]
an&ni vEdAMta vAkya -mulalO mahAvAkyamulu nAlugu
nin&nu neeSvarunigAnu -varNiMcu nikkamuga nArAyaNA || [108]
uBhaya dRSyOpAdhulu, kaDamdrOsipOka yayyAtma migula
naBhayamuga niTuleppuDu -ciMtiMpu mani telupu nArAyaNA || [109]
jeeva Siva tArataMya -muna naikya siddhi kAnEra danucu
BhAva saMSayamu deerpu -kAryArtha paTimacE nArAyaNA || [110]
nirvikArumDavu neevu -nee yaMde nijamaina caMdamunanu
barvum brakRti vikAramu -lani telupu prauDhicE nArAyaNA || [111]
sadguruM DeereetigA -bOdhiMcu saraLitO vAkyArthamu
hRdgatamum jEsiyuMDi -jagati jeeviMpudunu nArAyaNA || [112]
ani ciMtanamu jEyucum -jittamunam danivim jeMducu neppu
Du, kanudam&mulanu muDucucu -dhyAnaMbugAm jEyu nArAyaNA || [113]
apagatAGha kRtyumDai -eereeti naBhyAsa monariMcucu
naparOksha siddhi noMdu -brahmaMbu tAnagucu nArAyaNA || [114]
kaMdaLita hRdayumDagucu -saccidAnaMda svarUpumDagu
cu, saMdarSitAtmumDagucu -nuMDu navikAratanu nArAyaNA || [115]
avyayAnaMda pUjya -rAjya siMhAsanAseenumDagucu
BhavyAtmumDai velasenu -bUjya saMBhAvyumDai nArAyaNA || [116]
neevu sakalaMbugAni -yun&nadE neekan&na vE~rokkaTi
jeevumDani varNiMcuTa -vyavahAra siddhikini nArAyaNA || [117]
ciluka palukulu palikiti -nAkEmi teliyum dattva rahasya
mu, valadu nanu nErameMca -sAdhulaku naLinAksha nArAyaNA || [118]
SaraNu BhaktArtihAri -gururUpa SaraNu sajjana rakshaka
SaraNu duritauGhanASa -SaraNipuDu karuNiMcu nArAyaNA || [119]
tappoppulanu dayatO teliyajEyagalarani prArthana
-e. SEShu mAdhava rAvu #(adluriengr.mun.ca)#
నారాయణ శతకము
బమ్మెర పోతన
నమామి నారాయణ పాద
పంకజం
వదామి నారాయణ
నామనిర్మలం
భజామి నారాయణ
తత్త్వమవ్యయం
కరోమి నారాయణ
పూజనం సదా |శ్లో|
ఆలోక్య సర్వ
శాస్త్రాణి
విచార్యచ పునః
పునః
ఇదమేకం
సునిశ్హ్పన్నం
ధ్యాయేన్నారాయణం
సదా |శ్లో|
శ్రీ రమా
హృదయేశ్వరా - భక్త జన చిత్త జలరుహ భాస్కరా
కారుణ్య రత్నాకరా
- నీవె గతి కావవే నారాయణా || [1]
పాప కర్మములం జేసి
- నరక కూపములం బడజాల నింకను
నీపాద భక్తి యొసంగి
- యొక్క దరిం జూపవే నారాయణా || [2]
దాన ధర్మములం
జేయ-నేర, నీ దాసులను బొగడ నేర,
నా నేరములం దలంపక
- దయ చేసి నన్నేలు నారాయణా || [3]
ఆన యించుక లేకను -
దుర్భాశ్హ లాడు నా జిహ్వ యందు,
నీ నామ చతురక్షరి
- దృఢముగా నిలుప వలె నారాయణా || [4]
ఒకటి పరిశుద్ధి
లేక - నా జన్మ మకట! వ్యర్థం బాయెను
అకలంక మగు
మార్గముం - జూపవే సకలేశ! నారాయణా || [5]
వేగి లేచినది
మొదలు - సంసార సాగరంబున నీందుచు
మీ గుణము నొక
వేళను - దలంపగదె మేలనుచు నారాయణా || [6]
లోక వార్తలకు మరంగి
- కర్ణముల మీకథల విన నేరను,
ఏ కరణీ భవ జలధిం -
దుదముట్ట నీందెదను నారాయణా || [7]
ఇల మనుజ జన్మ
మెత్తి - సుజ్ఞాన మించు కంతయు లేకను,
కలంతం జెందెడు
చిత్తమున్ - స్వచ్ఛంబుగాం జేయు నారాయణా ||
[8]
యెంత పాపాత్ముండైన
- మిముం దలంచి కృతకృత్యుండౌనుం,
బుడమి నింత పరుసము
సోంకిన - లోహంబు హేమమౌ నారాయణా || [9]
కామాంధకారమునను -
బెక్కు దుశ్హ్కర్మములం జేసి నేను,
నీ మఱుంగు
జొచ్చినాను - నామీంద నెనెరుంచు నారాయణా ||
[10]
సమయమైనపుడు మిమ్ముం
-దలచుటకు శక్తి గలుగునొ కలు
గదో, సమయమని తలంతునిపుడు
-నా హృదయ కమలమున నారాయణా || [11]
ఆటలన్నియు ఱంకులు
-నేనాడు మాటలన్నియు బొంకులు,
పాటింప నింతకైన
-నున్నదే పాపంబు నారాయణా || [12]
వావి దప్పిన వాండను
-దుశ్హ్క్రియా వర్తనుండ నగుదు నేను,
బావనునిగాం జేయవె
ననుం బతిత పావనుండ నారాయణా || [13]
దేహమే దృఢమనుచును
-దెలిసి నే మోహబద్ధుండ నగుచును,
సాహసంబున జేసితిం
-నేగురు ద్రోహంబు నారాయణా || [14]
ఎన్ని జన్మము
లాయెనో -నేటి కెందెందు జన్మించినానో
నన్ను దరిం జేర్పం
గదవొ -యింకనైన నా తండ్రి నారాయణా || [15]
యమ కింకరులం దలంచిన
-నాగుండె యావులింపుచు నున్నది
యముని బాధలు
మాన్పను -మాయప్ప వైద్యుండవు నారాయణా ||
[16]
అరయం గామ
క్రోధముల్ -లోభంబు మోహమద మత్సర
ములు, తఱుంగ వెప్పుడు
మనసున -నిన్నెపుడుం దలచెదను || [17]
ఆశా పిశాచి పట్టి, -వైరాగ్య వాసనలం
జేరనీయదు
గాసి పెట్టుచు
నున్నది -నేనేమి చేయుదును నారాయణా || [18]
తాపత్రయంబుం జెంది
-చాలం బరితాప మొందెడు చిత్తము
నీ పాదములం జెందినం
-జల్లనై నిలిచెదను నారాయణా || [19]
చింతా పరంపరలచేం
-చిత్తంబు చీంకాకు పడుచున్నది,
సంతోశ్హమునం
గూర్పవె -దివ్య ప్రసాదములు నారాయణా || [20]
ప్రాయమెల్లను
బోయెను -నాశ లెడం బాయం జాలక యున్నవి
మాయా ప్రపంచమేల
-చేసెదవి మాయయ్య నారాయణా || [21]
శరణుం జొచ్చినవాండను
-నేం జేయుదురితముల నపహరించి
పరమ పద మొసంగం
గదవె -యింకనైనం బరమాత్మ నారాయణా || [22]
సంకల్పములు
పుట్టినం -గర్మ వాసనల దృఢముగం జేయవు
సంకటము నొందించకే
-నను సత్య సంకల్ప నారాయణా || [23]
ఒకవేళ నున్న
బుద్ధి -యొక వేళ నుండదింక నేమి సేతు
విశదంబుగాం జేయవే
-నీవు నా చిత్తమున నారాయణా || [24]
నెట్టుకొని సకల
జీవ -కోటులను గొట్టి భక్షించినాను
పొట్ట కొఱకై నీచుల
-సేవించి రట్టయితి నారాయణా || [25]
నేను పుట్టినది
మొదలు -ఆహార నిద్రలనె జనె కాలము
పూని యెప్పుడు
సేయుదు -నీపదధ్యానంబు నారాయణా || [26]
ప్రొద్దు వోవక
యున్నను -వేసరక పొరుగిండ్లు తిరుంగుగాని
బుద్ధిమాలిన
చిత్తము -నీయందుం బొందదే నారాయణా || [27]
ఎన్ని విధములం
జూచిన -నిత్యమును హృదయమున మిము
మఱవక యున్నంతకన్న
సుఖము -వేఱొక్కటున్నదే నారాయణా || [28]
లాభ లోభముల విడిచి
-యిహపరంబులను ఫల మాసింపక
నీ భక్తులైన వారు
-ధన్యులై నెగడెదరు నారాయణా || [29]
ముందు నీ సృశ్హ్టి
లేక -సచ్చిదానంద స్వరూపంబును
బొంది భేదము నొందక
-బ్రహ్మమై యుందువంట నారాయణా || [30]
కాలత్రయీ బాధ్యమై
-మఱి నిరాకారమై యుండు కతనం
జాలంగాం
దత్త్వజ్ఞులు -తెలియుదురు సత్తగుట నారాయణా ||
[31]
జ్ఞాన స్వరూపమునను
-నజడమై జడ పదార్థము నెల్లను
గానంగాం జేయు కతనం
-జిత్తండ్రు ఘనులు నిను నారాయణా || [32]
సుఖ దుఃఖముల
రెంటికి -వేఱగుచు సుఖ రూపమైన కతన
నఖిల వేదాంత
విదులు -ఆనందమండ్రు నిను నారాయణా || [33]
గుణ మొకటియైన లేని
-నీయందు గుణమయంబైన మాయ
గణుతింపం గను
పట్టెడు -దర్పణము కైవడిని నారాయణా || [34]
అందుం
బ్రతిబింబించిన -చిత్సదానంద సముదాయమెల్లం
జెందు నీశ్వర
భావము -త్రిగుణ సం శ్లిశ్హ్టమయి నారాయణా ||[35]
సత్వంబు రజము తమము
-నను మూండు సంజ్ఞలను గ్రమము
తోడం
దత్త్వజ్ఞులేర్పరింపం -సద్గుణ త్రయములను నారాయణా || [36]
ప్రకృతి నీయందు
లీనమై -యుండి స్మృతిని జెందిన వేళను
సకల ప్రపంచ మిటులం
-గనుపట్టె నకళంక నారాయణా || [37]
మీరు సంకల్పించిన
-యిశ్హ్టప్రకారమును జెందు మాయ
యారూఢి వివరించెద
-నవ్విధం బొప్పంగ నారాయణా || [38]
పంచభూతములు మనసు
-బుద్ధియును బ్రకటహంకారము
లును, నెంచంగ నిట్టిమాయ
-యిదిగా ప్రపంచంబు నారాయణా || [39]
భూతపంచక తత్త్వ సం
-ఘాతమునం బుట్టె నంతఃకరణము
ఖ్యాతిగా నందుం దోంచి
-చిత్తు జీవాత్మాయె నారాయణా || [40]
వెస మనో బుద్ధి
చిత్తా -హంకార వృత్తు లంతఃకరణము
ప్రచురింప నవి
నాలుగు -తత్త్వ రూపములాయె నారాయణా || [41]
భౌతిక
రజోగుణములును -నేకమై ప్రాణంబు పుట్టించెను
వాద భేదములచేతం
-బంచ పాపములాయె నారాయణా || [42]
అలరు ప్రాణ మపానము
-వ్యానంబుదానము సమానంబులు
తలంప నీ సంజ్ఞలమరి
-వాయుతత్త్వము లొప్పు నారాయణా || [43]
ప్రత్యేక భూత
సత్త్వగుణములన -బరంగి బుద్ధీంద్రియములు
సత్త్వమున
జనియించెను -దత్త్వ ప్రపంచముగ నారాయణా || [44]
చెవులు చర్మముం
గన్నులు -జిహ్వ నాసికయుం బేరుల చేతను
దగిలి
బుద్ధీంద్రియముల -విశ్హయ సంతతిం దెలియు నారాయణా || [45]
భౌతిక తమోగుణమున
-విశ్హయములు తఱుచుగాం జనియిం
చెను, శబ్ద స్పర్శ రూప
-రస గంధ నామములు నారాయణా || [46]
తాదృశ రజోగుణమున
-జనియించె నరక కర్మేంద్రియములు
ఐదు తత్త్వమ్ము
లగుచును -గర్మ నిశ్హ్ఠాదులకు నారాయణా ||
[47]
వాక్పాణిపాదపాయూ
-పస్థలను వాని పేళ్ళమరుచుండుం
బ్క్వహృదయులకుం
దెలియు -నీవిధము పరమాత్మ నారాయణా || [48]
పలుకు పనులును
నడుపును -మలమూత్రములు విడుచుటీ య
యిదును వెలయం
గర్మేంద్రియముల -విశ్హయములు నళినాక్ష నారాయణా ||
[49]
పరంగం జంద్రుండు
బ్రహ్మ -క్షేత్రజ్ఞుం డరువొందు రుద్రుం
డచటి, పరమానసాదులకును
-నధిపతులు వివరింప నారాయణా || [50]
అరయ దిక్కున
వాయువు -సూర్యుండును, వరుణుండు, నశ్విను
లును, బరంగ శ్రోత్రాదులకును
-నధిపతులు పరికింప నారాయణా || [51]
అనలుం, డింద్రుండు, విశ్హ్ణువు
-మృత్యువును, నల ప్రజాపతియుం
గూడి, యొనరంగా నాడులకును
-నధిపతులు పరికింప నారాయణా || [52]
పంచీకృతంబాయెను
-భూతపంచకము, ప్రబలించి సృశ్హ్టి
పంచీకృతముచేతను
-స్థూల రూపము లాయె నారాయణా || [53]
పది యింద్రియముల
మనసు -బుద్ధియును, బ్రాణంబులైదు
గూడి, పదియేడు
తత్త్వములను -సూక్ష్మరూపములాయె నారాయణా ||
[54]
స్థూలసూక్ష్మములు
రెండు -కలుగుటకు మూలమగు నజ్ఞాన
ము, లీల కారణ మాయెను
-జీవులకు నాలోన నారాయణా || [55]
ఈరెండు దేహములకు
-విశ్వంబు నెల్లం బ్రకటనంబాయెను
నామ రూపముల చేత
-లోకైక నాయకుండ నారాయణా || [56]
కొన్ని మాయనుం
బుట్టును -గ్రుడ్లతోం గొన్ని తనువులు పుట్టు
ను, గొన్ని ధరణిని
బుట్టును -జెమటలను గొన్ని హరి నారాయణా ||
[57]
ఈ చతుర్విధ
భూతములందుం -గడు హెచ్చు మానవ జన్మము
నీచమని చూడరాదు
-తథ్యమే నిర్ణయము నారాయణా || [58]
ఈ జన్మమందెకాని
-ముక్తి మఱి యేజన్మమందు లేదు
చేసేతం దను దెలియక
-మానవుండు చెడిపోవు నారాయణా || [59]
చేతనాచేతనములు
-పుట్టుచును రోంతలకు లోనగుచును
నాతంక పడుచుండును
-గర్మములం జేతమ్నుడు నారాయణా || [60]
సకలయోనులం
బుట్టుచుం -బలుమాఱు స్వర్గ నరకములం బడు
చు, నొకట నూఱట గానక
-పరితాప మొందితిని నారాయణా || [61]
వెలయ
నెనుబదినాలుగు -లక్ష యోనులయందుం బుట్టిగిట్టి
యలసి మూర్ఛలం
జెందుచు -బహుదుఃఖముల చేత నారాయణా || [62]
క్రమముతో మనుజగర్భ
-మునం బడుచుం గర్మవశగతుండగు
చును, నమితముగ నచ్చోటను
-గర్భనరకమునం బడు నారాయణా || [63]
ఈశ్వరాజ్ఞను
బుట్టిన -తెలివిచే హృదయమునం దలపోయుచు
విశ్వమునం దను
బొందిన -పాటెల్ల వేర్వేఱు నారాయణా || [64]
చాలు చీ! యిక
జన్మము -నింకం బుట్టుం జాలు, శ్రీహరి భజించి
మేలు చెందెద
ననుచును -జింతించు నాలోన నారాయణా || [65]
ప్రసవకాలమునం
దల్లి -గర్భమునం బాదుకొని నిలువలేక
వసుధపయి నూడిపడినం
-దెలివిచే వాపోవు నారాయణా || [66]
చనుంబాలు గుడిచి
ప్రాణ -ధారణను నింక మూత్ర మలము
లోను, మునింగితేలుచునుండును, దుర్గంధమున
నారాయణా || [67]
బాలత్వమున బిత్తరై
-నలుగడలం బాఱాడు సిగ్గులేక
పాలుపడి యౌవనమునం
-విశ్హయానుభవమొందు నారాయణా || [68]
ముదిమి వచ్చిన
వెనుకను -సంసారమోహంబు మానకుండం
దుదనేంగుం
గర్మగతులం -బొందుటకు ముదమేమి నారాయణా ||
[69]
అజ్ఞాన లక్షణమ్ము
-లిటువంటివని విచారించి నరుండు
సుజ్ఞానమునకుం
-దగిన మార్గంబు చూడవలె నారాయణా || [70]
వేదాంత వేదియైన
-సద్గురుని పాదపద్మములు చెంది
యాదయానిధి కరుణచే
-సద్బోధ మందవలె నారాయణా || [71]
ఏ విద్యకైన గురువు
-లేకున్న నావిద్య పట్టుపడదు
కావునను నభ్యాసము
-గురుశిక్ష కావలెను నారాయణా || [72]
గురుముఖంబైన విద్య
-నెన్నికై కొనిన భావజ్ఞానము
చిరతరాధ్యాత్మ
విద్య -నభ్యసింపంగ లేడు నారాయణా || [73]
అనపేక్షకుండు సదయుండు
-వేదాంతనిపుణుండయ్యాచార్యు
డు
దొరుకుటపురూపమపుడు -గుఱుతైన గుఱి యొప్పు నారాయణా || [74]
అట్టిసద్గురుని
వెదకి -దర్శించి యా మహాత్ముని పదములు
పట్టి కృతకృత్యుండౌను
-సాధకుండు గట్టిగా నారాయణా || [75]
మొగి సాధనములు
నాల్గు -గలనరుండు ముఖ్యాధికారి యగును
దగిన యుపదేశమునకు
-యోగసాధకులలో నారాయణా || [76]
ఇది నిత్య
మిదియనిత్యం -బనుచుం దన మది వివేకించుటొ
కటి, యెదను నిహపర
సుఖములు -కోరనిది యిదియొకటి || [77]
ముదముతో శమదమాది
-శ్హట్క సంపద గలిగి యుండుటొ
కటి, విదితముగ ముక్తిం
బొందం -గాంక్షించు టదియొకటి || [78]
ఈనాల్గు సాధనముల
-నధికారియై నిజాచార్యుం జేరి
నానా ప్రకారములను
-శుశ్రూశ్హ నడుపవలె నారాయణా || [79]
ఉల్లమునం గాపట్యము
-లవ మైన నుండ నీయక సతతము
తల్లి దండ్రియుం
దైవము -గురువనుచుం దలంపవలె నారాయణా || [80]
తనువు, ధనమును, సంపద -గురుని
సొమ్మని సమర్పణము
చేసి, వెలసి తత్పరతంత్రుండై
-నిత్యమును మెలంగవలె నారాయణా || [81]
ఏనిశ్హ్ఠ
గురునిశ్హ్ఠకు -దీటుగాదీ ప్రపంచంబునందు
మానసము దృఢము చేసి
-యలరవలె మౌనియై నారాయణా || [82]
ఇట్టి శిశ్హ్యుని
పాత్రత -వీక్షించి హృదయమునం గారుణ్యము
నెట్టుకొని
బ్రహ్మవిద్య -గురుండొసంగు నెయ్యముగ నారాయణా ||
[83]
బ్రహ్మంబు గలుంగంగానె
-యేతత్ప్రపంచంబు గలిగి యుండు
బ్రహ్మంబు
లేకున్నను -లేదీ ప్రపంచంబు నారాయణా || [84]
ఈ విధంబున సూక్తుల
-బ్రహ్మ సద్భావంబు గలుగం జేసి
భావ గోచరము చేయుం
-జిత్స్వరూపములెల్ల నారాయణా || [85]
ఆ బ్రహ్మమందె
పుట్టు -విశ్వంబు నాబ్రహ్మమందె యుండు
నా బ్రహ్మమందె యణంగు
-నదె చూడు మని చూపు నారాయణా || [86]
అది సచ్చిదానందము
-అది శుద్ధ మది బద్ధ మది యుక్తము
అది సత్య మది
నిత్యము -అది విమలమని తెలుపు నారాయణా ||
[87]
అదె బ్రహ్మ మదె
విశ్హ్ణువు -అదె రుద్రుం డదియె సర్వేశ్వరుండు
అది పరంజ్యోతి
యనుచు -బోధించు విదితముగ నారాయణా || [88]
భావింప వశముగాదు
-ఇట్టిదని పలుక శక్యంబుగాదు
భావంబు నిలుపుచోట
-నసి తాను బరమౌను నారాయణా || [89]
అది మాయతోం గూడంగ
-శివుండాయె, నదియె విద్యను గూ
డంగ విదితముగా
జీవుండాయె -నని తెలుపు వేర్వేఱ నారాయణా ||
[90]
శివుండు కారణ
శరీరి -కార్యంబు జీవుండా లక్షణములు
ద్వివిధముగం
దెలియు ననుచు -బోధించు వివరముగ నారాయణా ||
[91]
అరయ నిరువది
నాలుగు -తత్త్వంబులై యుండు నందమ
గుచుం
గరతలామలకముగను -బోధించుం బ్రకటముగ నారాయణా ||
[92]
కారణము కార్యమగుచు
-వ్యవహార కారణాఖ్యత నుండును
నారూఢి
బ్రహ్మాండము -పిండాండ మని తెలుపు నారాయణా ||
[93]
ఐదు భూతములు, నింద్రి-యములు పది, యంతరంగములు
నాల్గు, ఐదు విశ్హయములు
తత్త్వ -సంఘాతమని తెలుపు నారాయణా || [94]
స్థూల
సూక్ష్మాకృతులును -గారణముతో మూడు తెఱంగులకు
ను, నీలమగు నందు నమరు
-నని తెలుపు లాలించి నారాయణా || [95]
వెలసి పంచీకృతములు
-నగు భూతములకుం బుట్టినది తను
వు, స్థూలంబు నది
యనుచును -బోధించు దయతోడ నారాయణా || [96]
ఐదు
నయిదింద్రియములు -ప్రాణంబు లయిదు, మనసును బు
ద్ధియుం, బాదుకొని సూక్ష్మ
మందు -బోధించుం బ్రకటముగ నారాయణా || [97]
గాఢమగు నజ్ఞానము
-ఈరీతిం గారణ శరీర మగును
మూఢులకు వశముగాదు
-తెలియ విను మోదమున నారాయణా || [98]
ఈమూండు తనువులందు
-దా నుండి ఈతనువు తాననుచును
వ్యామోహ
పడుచుండు(ను) -జీవుండు వరుసతో నారాయణా ||
[99]
కలలేక నిద్రించును
-కలంగాంచి కడు మేలుగోరు చుండును
గలకాల మీ జీవుండు
-త్రివిధములం గలసియును నారాయణా || [100]
ప్రాజ్ఞతైజస
విశ్వులు -తానె, ఈపర్యాయముగ జీవుండు
ప్రజ్ఞగోల్పడ
పొందును -సంసార బంధంబు నారాయణా || [101]
మూండవస్థలకు
సాక్షి -యైనట్టి మూలంబు తాం దెలిసినం
జూడుమని
సన్మార్గము -తేటగాం జూపుచును నారాయణా ||
[102]
నీవు దేహంబు గావు
-ప్రాణంబు నీవుగావింద్రియములు
నీవుగాదని
తెలుపును -వేదాంత నిలయమున నారాయణా || [103]
అనల తప్తంబు గాదు
-జలమునను మునింగి తడిం జెందంబో
దు, అనిలశుల్కంబుగాదు
-నిరుపమం బని తెలుపు నారాయణా || [104]
కామహంకార మిపుడు
-చిత్తంబుగా వీవు బుద్ధి నీవు
కావు మనసులు
సత్యము -సాక్షివగు గట్టిగా నారాయణా ||
[105]
దేహధర్మములు నీకుం
-దోంచు టంతేగాని నిత్యముగను
మోహంబు మానుమనుచు
-బోధించు ముఖ్యముగ నారాయణా || [106]
ఎన్ని దేహములు
చెడిన -నీవు నేక స్వరూపుండ వగుచు
జెన్నలరి యుందు
విలను -దత్త్వ ప్రసిద్ధముగ నారాయణా ||
[107]
అన్ని వేదాంత
వాక్య -ములలో మహావాక్యములు నాలుగు
నిన్ను
నీశ్వరునిగాను -వర్ణించు నిక్కముగ నారాయణా ||
[108]
ఉభయ దృశ్యోపాధులు, కడంద్రోసిపోక
యయ్యాత్మ మిగుల
నభయముగ
నిటులెప్పుడు -చింతింపు మని తెలుపు నారాయణా ||
[109]
జీవ శివ తారతంయ
-మున నైక్య సిద్ధి కానేర దనుచు
భావ సంశయము దీర్పు
-కార్యార్థ పటిమచే నారాయణా || [110]
నిర్వికారుండవు
నీవు -నీ యందె నిజమైన చందమునను
బర్వుం బ్రకృతి
వికారము -లని తెలుపు ప్రౌఢిచే నారాయణా ||
[111]
సద్గురుం డీరీతిగా
-బోధించు సరళితో వాక్యార్థము
హృద్గతముం
జేసియుండి -జగతి జీవింపుదును నారాయణా ||
[112]
అని చింతనము
జేయుచుం -జిత్తమునం దనివిం జెందుచు నెప్పు
డు, కనుదమ్ములను
ముడుచుచు -ధ్యానంబుగాం జేయు నారాయణా ||
[113]
అపగతాఘ కృత్యుండై
-ఈరీతి నభ్యాస మొనరించుచు
నపరోక్ష సిద్ధి
నొందు -బ్రహ్మంబు తానగుచు నారాయణా || [114]
కందళిత హృదయుండగుచు
-సచ్చిదానంద స్వరూపుండగు
చు, సందర్శితాత్ముండగుచు
-నుండు నవికారతను నారాయణా || [115]
అవ్యయానంద పూజ్య
-రాజ్య సింహాసనాసీనుండగుచు
భవ్యాత్ముండై
వెలసెను -బూజ్య సంభావ్యుండై నారాయణా ||
[116]
నీవు సకలంబుగాని
-యున్నదే నీకన్న వేఱొక్కటి
జీవుండని
వర్ణించుట -వ్యవహార సిద్ధికిని నారాయణా ||
[117]
చిలుక పలుకులు
పలికితి -నాకేమి తెలియుం దత్త్వ రహస్య
ము, వలదు నను నేరమెంచ
-సాధులకు నళినాక్ష నారాయణా || [118]
శరణు
భక్తార్తిహారి -గురురూప శరణు సజ్జన రక్షక
శరణు దురితౌఘనాశ
-శరణిపుడు కరుణించు నారాయణా || [119]
తప్పొప్పులను దయతో తెలియజేయగలరని ప్రార్థన
-ఎ. శేశ్హు మాధవ రావు (adluriengr.mun.ca)
nArAyaNa
Satakamu
bam&mera
pOtana
namAmi nArAyaNa pAda paMkajaM
vadAmi nArAyaNa nAmanirmalaM
BhajAmi nArAyaNa tattvamavyayaM
karOmi nArAyaNa pUjanaM sadA |SlO|
AlOkya sarva SAstrANi
vicAryaca punah punah
idamEkaM suniShpan&naM
dhyAyEn&nArAyaNaM sadA |SlO|
Sree ramA hRdayESvarA - Bhakta jana citta jalaruha BhAskarA
kAruNya ratnAkarA - neeve gati kAvavE nArAyaNA || [1]
pApa karmamulam jEsi - naraka kUpamulam baDajAla nimkanu
neepAda Bhakti yosamgi - yokka darim jUpavE nArAyaNA || [2]
dAna dharmamulam jEya-nEra, nee dAsulanu bogaDa nEra,
nA nEramulam dalampaka - daya cEsi nan&nElu nArAyaNA || [3]
Ana yiMcuka lEkanu - durBhASha lADu nA jihva yaMdu,
nee nAma caturakshari - dRDhamugA nilupa vale nArAyaNA || [4]
okaTi pariSuddhi lEka - nA janma makaTa! vyarthaM bAyenu
akalaMka magu mArgamuM - jUpavE sakalESa! nArAyaNA || [5]
vEgi lEcinadi modalu - saMsAra sAgaraMbuna neemducu
mee guNamu noka vELanu - dalampagade mElanucu nArAyaNA || [6]
lOka vArtalaku maramgi - karNamula meekathala vina nEranu,
E karaNee Bhava jaladhim - dudamuTTa neemdedanu nArAyaNA || [7]
ila manuja janma metti - suj~nAna miMcu kaMtayu lEkanu,
kalamtam jeMdeDu cittamun^ - svacChaMbugAm jEyu nArAyaNA || [8]
yeMta pApAtmumDaina - mimum dalaMci kRtakRtyumDaunum,
buDami niMta parusamu sOmkina - lOhaMbu hEmamau nArAyaNA || [9]
kAmAMdhakAramunanu - bekku duShkarmamulam jEsi nEnu,
nee ma~rumgu joccinAnu - nAmeemda neneruMcu nArAyaNA || [10]
samayamainapuDu mim&mum -dalacuTaku Sakti galuguno kalu
gadO, samayamani talamtunipuDu -nA hRdaya kamalamuna nArAyaNA || [11]
ATalan&niyu ~raMkulu -nEnADu mATalan&niyu boMkulu,
pATiMpa niMtakaina -nun&nadE pApaMbu nArAyaNA || [12]
vAvi dappina vAmDanu -duShkriyA vartanumDa nagudu nEnu,
bAvanunigAm jEyave nanum batita pAvanumDa nArAyaNA || [13]
dEhamE dRDhamanucunu -delisi nE mOhabaddhumDa nagucunu,
sAhasaMbuna jEsitim -nEguru drOhaMbu nArAyaNA || [14]
en&ni jan&mamu lAyenO -nETi keMdeMdu jan&miMcinAnO
nan&nu darim jErpam gadavo -yimkanaina nA taMDri nArAyaNA || [15]
yama kiMkarulam dalamcina -nAguMDe yAvuliMpucu nun&nadi
yamuni bAdhalu mAn&panu -mAyappa vaidyumDavu nArAyaNA || [16]
arayam gAma krOdhamul -lOBhaMbu mOhamada matsara
mulu, ta~rumga veppuDu manasuna -nin&nepuDum dalacedanu || [17]
ASA piSAci paTTi, -vairAgya vAsanalam jEraneeyadu
gAsi peTTucu nun&nadi -nEnEmi cEyudunu nArAyaNA || [18]
tApatrayaMbum jeMdi -cAlam baritApa moMdeDu cittamu
nee pAdamulam jeMdinam -jallanai nilicedanu nArAyaNA || [19]
ciMtA paraMparalacEm -cittaMbu ceemkAku paDucun&nadi,
saMtOShamunam gUrpave -divya prasAdamulu nArAyaNA || [20]
prAyamellanu bOyenu -nASa leDam bAyam jAlaka yun&navi
mAyA prapaMcamEla -cEsedavi mAyayya nArAyaNA || [21]
SaraNum joccinavAmDanu -nEm jEyuduritamula napahariMci
parama pada mosamgam gadave -yimkanainam baramAtma nArAyaNA || [22]
saMkalpamulu puTTinam -garma vAsanala dRDhamugam jEyavu
saMkaTamu noMdiMcakE -nanu satya saMkalpa nArAyaNA || [23]
okavELa nun&na buddhi -yoka vELa nuMDadimka nEmi sEtu
viSadaMbugAm jEyavE -neevu nA cittamuna nArAyaNA || [24]
neTTukoni sakala jeeva -kOTulanu goTTi BhakshiMcinAnu
poTTa ko~rakai neecula -sEviMci raTTayiti nArAyaNA || [25]
nEnu puTTinadi modalu -AhAra nidralane jane kAlamu
pUni yeppuDu sEyudu -neepadadhyAnaMbu nArAyaNA || [26]
proddu vOvaka yun&nanu -vEsaraka porugiMDlu tirumgugAni
buddhimAlina cittamu -neeyaMdum boMdadE nArAyaNA || [27]
en&ni vidhamulam jUcina -nityamunu hRdayamuna mimu
ma~ravaka yun&naMtakan&na suKhamu -vE~rokkaTun&nadE nArAyaNA || [28]
lABha lOBhamula viDici -yihaparaMbulanu Phala mAsiMpaka
nee Bhaktulaina vAru -dhanyulai negaDedaru nArAyaNA || [29]
muMdu nee sRShTi lEka -saccidAnaMda svarUpaMbunu
boMdi BhEdamu noMdaka -brahmamai yuMduvamTa nArAyaNA || [30]
kAlatrayee bAdhyamai -ma~ri nirAkAramai yuMDu katanam
jAlamgAm dattvaj~nulu -teliyuduru sattaguTa nArAyaNA || [31]
j~nAna svarUpamunanu -najaDamai jaDa padArthamu nellanu
gAnamgAm jEyu katanam -jittaMDru Ghanulu ninu nArAyaNA || [32]
suKha duhKhamula reMTiki -vE~ragucu suKha rUpamaina katana
naKhila vEdAMta vidulu -AnaMdamaMDru ninu nArAyaNA || [33]
guNa mokaTiyaina lEni -neeyaMdu guNamayaMbaina mAya
gaNutiMpam ganu paTTeDu -darpaNamu kaivaDini nArAyaNA || [34]
aMdum bratibiMbiMcina -citsadAnaMda samudAyamellam
jeMdu neeSvara BhAvamu -triguNa saM SliShTamayi nArAyaNA ||[35]
satvaMbu rajamu tamamu -nanu mUmDu saMj~nalanu gramamu
tODam dattvaj~nulErpariMpam -sadguNa trayamulanu nArAyaNA || [36]
prakRti neeyaMdu leenamai -yuMDi smRtini jeMdina vELanu
sakala prapaMca miTulam -ganupaTTe nakaLaMka nArAyaNA || [37]
meeru saMkalpiMcina -yiShTaprakAramunu jeMdu mAya
yArUDhi vivariMceda -navvidhaM boppaMga nArAyaNA || [38]
paMcaBhUtamulu manasu -buddhiyunu brakaTahaMkAramu
lunu, neMcaMga niTTimAya -yidigA prapaMcaMbu nArAyaNA || [39]
BhUtapaMcaka tattva saM -GhAtamunam buTTe naMtahkaraNamu
KhyAtigA naMdum dOmci -cittu jeevAtmAye nArAyaNA || [40]
vesa manO buddhi cittA -haMkAra vRttu laMtahkaraNamu
pracuriMpa navi nAlugu -tattva rUpamulAye nArAyaNA || [41]
Bhautika rajOguNamulunu -nEkamai prANaMbu puTTiMcenu
vAda BhEdamulacEtam -baMca pApamulAye nArAyaNA || [42]
alaru prANa mapAnamu -vyAnaMbudAnamu samAnaMbulu
talampa nee saMj~nalamari -vAyutattvamu loppu nArAyaNA || [43]
pratyEka BhUta sattvaguNamulana -baramgi buddheeMdriyamulu
sattvamuna janiyiMcenu -dattva prapaMcamuga nArAyaNA || [44]
cevulu carmamum gan&nulu -jihva nAsikayum bErula cEtanu
dagili buddheeMdriyamula -viShaya saMtatim deliyu nArAyaNA || [45]
Bhautika tamOguNamuna -viShayamulu ta~rucugAm janiyiM
cenu, Sabda sparSa rUpa -rasa gaMdha nAmamulu nArAyaNA || [46]
tAdRSa rajOguNamuna -janiyiMce naraka karmEMdriyamulu
aidu tattvam&mu lagucunu -garma niShThAdulaku nArAyaNA || [47]
vAkpANipAdapAyU -pasthalanu vAni pELLamarucuMDum
bkvahRdayulakum deliyu -neevidhamu paramAtma nArAyaNA || [48]
paluku panulunu naDupunu -malamUtramulu viDucuTee ya
yidunu velayam garmEMdriyamula -viShayamulu naLinAksha nArAyaNA || [49]
paramgam jaMdruMDu brahma -kshEtraj~num DaruvoMdu rudrum
DacaTi, paramAnasAdulakunu -nadhipatulu vivariMpa nArAyaNA || [50]
araya dikkuna vAyuvu -sUryumDunu, varuNuMDu, naSvinu
lunu, baramga SrOtrAdulakunu -nadhipatulu parikiMpa nArAyaNA || [51]
analum, DiMdrumDu, viShNuvu -mRtyuvunu, nala prajApatiyum
gUDi, yonaramgA nADulakunu -nadhipatulu parikiMpa nArAyaNA || [52]
paMceekRtaMbAyenu -BhUtapaMcakamu, prabaliMci sRShTi
paMceekRtamucEtanu -sthUla rUpamu lAye nArAyaNA || [53]
padi yiMdriyamula manasu -buddhiyunu, brANaMbulaidu
gUDi, padiyEDu tattvamulanu -sUkshmarUpamulAye nArAyaNA || [54]
sthUlasUkshmamulu reMDu -kaluguTaku mUlamagu naj~nAna
mu, leela kAraNa mAyenu -jeevulaku nAlOna nArAyaNA || [55]
eereMDu dEhamulaku -viSvaMbu nellam brakaTanaMbAyenu
nAma rUpamula cEta -lOkaika nAyakumDa nArAyaNA || [56]
kon&ni mAyanum buTTunu -gruDlatOm gon&ni tanuvulu puTTu
nu, gon&ni dharaNini buTTunu -jemaTalanu gon&ni hari nArAyaNA || [57]
ee caturvidha BhUtamulaMdum -gaDu heccu mAnava janmamu
neecamani cUDarAdu -tathyamE nirNayamu nArAyaNA || [58]
ee janmamaMdekAni -mukti ma~ri yEjanmamaMdu lEdu
cEsEtam danu deliyaka -mAnavumDu ceDipOvu nArAyaNA || [59]
cEtanAcEtanamulu -puTTucunu rOmtalaku lOnagucunu
nAtaMka paDucuMDunu -garmamulam jEtamnuDu nArAyaNA || [60]
sakalayOnulam buTTucum -balumA~ru svarga narakamulam baDu
cu, nokaTa nU~raTa gAnaka -paritApa moMditini nArAyaNA || [61]
velaya nenubadinAlugu -laksha yOnulayaMdum buTTigiTTi
yalasi mUrChalam jeMducu -bahuduhKhamula cEta nArAyaNA || [62]
kramamutO manujagarBha -munam baDucum garmavaSagatumDagu
cunu, namitamuga naccOTanu -garBhanarakamunam baDu nArAyaNA || [63]
eeSvarAj~nanu buTTina -telivicE hRdayamunam dalapOyucu
viSvamunam danu boMdina -pATella vErvE~ru nArAyaNA || [64]
cAlu cee! yika janmamu -nimkam buTTum jAlu, Sreehari BhajiMci
mElu ceMdeda nanucunu -jiMtiMcu nAlOna nArAyaNA || [65]
prasavakAlamunam dalli -garBhamunam bAdukoni niluvalEka
vasudhapayi nUDipaDinam -delivicE vApOvu nArAyaNA || [66]
canumbAlu guDici prANa -dhAraNanu nimka mUtra malamu
lOnu, munimgitElucunuMDunu, durgaMdhamuna nArAyaNA || [67]
bAlatvamuna bittarai -nalugaDalam bA~rADu siggulEka
pAlupaDi yauvanamunam -viShayAnuBhavamoMdu nArAyaNA || [68]
mudimi vaccina venukanu -saMsAramOhaMbu mAnakuMDam
dudanEmgum garmagatulam -boMduTaku mudamEmi nArAyaNA || [69]
aj~nAna lakshaNam&mu -liTuvaMTivani vicAriMci narumDu
suj~nAnamunakum -dagina mArgaMbu cUDavale nArAyaNA || [70]
vEdAMta vEdiyaina -sadguruni pAdapadmamulu ceMdi
yAdayAnidhi karuNacE -sadbOdha maMdavale nArAyaNA || [71]
E vidyakaina guruvu -lEkun&na nAvidya paTTupaDadu
kAvunanu naBhyAsamu -guruSiksha kAvalenu nArAyaNA || [72]
gurumuKhaMbaina vidya -nen&nikai konina BhAvaj~nAnamu
ciratarAdhyAtma vidya -naBhyasiMpamga lEDu nArAyaNA || [73]
anapEkshakumDu sadayumDu -vEdAMtanipuNumDayyAcAryu
Du dorukuTapurUpamapuDu -gu~rutaina gu~ri yoppu nArAyaNA || [74]
aTTisadguruni vedaki -darSiMci yA mahAtmuni padamulu
paTTi kRtakRtyumDaunu -sAdhakumDu gaTTigA nArAyaNA || [75]
mogi sAdhanamulu nAlgu -galanarumDu muKhyAdhikAri yagunu
dagina yupadESamunaku -yOgasAdhakulalO nArAyaNA || [76]
idi nitya midiyanityaM -banucum dana madi vivEkiMcuTo
kaTi, yedanu nihapara suKhamulu -kOranidi yidiyokaTi || [77]
mudamutO SamadamAdi -ShaTka saMpada galigi yuMDuTo
kaTi, viditamuga muktim boMdam -gAMkshiMcu TadiyokaTi || [78]
eenAlgu sAdhanamula -nadhikAriyai nijAcAryum jEri
nAnA prakAramulanu -SuSrUSha naDupavale nArAyaNA || [79]
ullamunam gApaTyamu -lava maina nuMDa neeyaka satatamu
talli daMDriyum daivamu -guruvanucum dalampavale nArAyaNA || [80]
tanuvu, dhanamunu, saMpada -guruni som&mani samarpaNamu
cEsi, velasi tatparataMtrumDai -nityamunu melamgavale nArAyaNA || [81]
EniShTha guruniShThaku -deeTugAdee prapaMcaMbunaMdu
mAnasamu dRDhamu cEsi -yalaravale mauniyai nArAyaNA || [82]
iTTi SiShyuni pAtrata -veekshiMci hRdayamunam gAruNyamu
neTTukoni brahmavidya -gurumDosamgu neyyamuga nArAyaNA || [83]
brahmaMbu galumgamgAne -yEtatprapaMcaMbu galigi yuMDu
brahmaMbu lEkun&nanu -lEdee prapaMcaMbu nArAyaNA || [84]
ee vidhaMbuna sUktula -brahma sadBhAvaMbu galugam jEsi
BhAva gOcaramu cEyum -jitsvarUpamulella nArAyaNA || [85]
A brahmamaMde puTTu -viSvaMbu nAbrahmamaMde yuMDu
nA brahmamaMde yaNamgu -nade cUDu mani cUpu nArAyaNA || [86]
adi saccidAnaMdamu -adi Suddha madi baddha madi yuktamu
adi satya madi nityamu -adi vimalamani telupu nArAyaNA || [87]
ade brahma made viShNuvu -ade rudrum Dadiye sarvESvaruMDu
adi paraMjyOti yanucu -bOdhiMcu viditamuga nArAyaNA || [88]
BhAviMpa vaSamugAdu -iTTidani paluka SakyaMbugAdu
BhAvaMbu nilupucOTa -nasi tAnu baramaunu nArAyaNA || [89]
adi mAyatOm gUDamga -SivumDAye, nadiye vidyanu gU
Damga viditamugA jeevumDAye -nani telupu vErvE~ra nArAyaNA || [90]
SivumDu kAraNa Sareeri -kAryaMbu jeevumDA lakshaNamulu
dvividhamugam deliyu nanucu -bOdhiMcu vivaramuga nArAyaNA || [91]
araya niruvadi nAlugu -tattvaMbulai yuMDu naMdama
gucum garatalAmalakamuganu -bOdhiMcum brakaTamuga nArAyaNA || [92]
kAraNamu kAryamagucu -vyavahAra kAraNAKhyata nuMDunu
nArUDhi brahmAMDamu -piMDAMDa mani telupu nArAyaNA || [93]
aidu BhUtamulu, niMdri-yamulu padi, yaMtaraMgamulu
nAlgu, aidu viShayamulu tattva -saMGhAtamani telupu nArAyaNA || [94]
sthUla sUkshmAkRtulunu -gAraNamutO mUDu te~ramgulaku
nu, neelamagu naMdu namaru -nani telupu lAliMci nArAyaNA || [95]
velasi paMceekRtamulu -nagu BhUtamulakum buTTinadi tanu
vu, sthUlaMbu nadi yanucunu -bOdhiMcu dayatODa nArAyaNA || [96]
aidu nayidiMdriyamulu -prANaMbu layidu, manasunu bu
ddhiyum, bAdukoni sUkshma maMdu -bOdhiMcum brakaTamuga nArAyaNA || [97]
gADhamagu naj~nAnamu -eereetim gAraNa Sareera magunu
mUDhulaku vaSamugAdu -teliya vinu mOdamuna nArAyaNA || [98]
eemUmDu tanuvulaMdu -dA nuMDi eetanuvu tAnanucunu
vyAmOha paDucuMDu(nu) -jeevuMDu varusatO nArAyaNA || [99]
kalalEka nidriMcunu -kalamgAMci kaDu mElugOru cuMDunu
galakAla mee jeevumDu -trividhamulam galasiyunu nArAyaNA || [100]
prAj~nataijasa viSvulu -tAne, eeparyAyamuga jeevumDu
praj~nagOlpaDa poMdunu -saMsAra baMdhaMbu nArAyaNA || [101]
mUmDavasthalaku sAkshi -yainaTTi mUlaMbu tAm delisinam
jUDumani sanmArgamu -tETagAm jUpucunu nArAyaNA || [102]
neevu dEhaMbu gAvu -prANaMbu neevugAviMdriyamulu
neevugAdani telupunu -vEdAMta nilayamuna nArAyaNA || [103]
anala taptaMbu gAdu -jalamunanu munimgi taDim jeMdambO
du, anilaSulkaMbugAdu -nirupamaM bani telupu nArAyaNA || [104]
kAmahaMkAra mipuDu -cittaMbugA veevu buddhi neevu
kAvu manasulu satyamu -sAkshivagu gaTTigA nArAyaNA || [105]
dEhadharmamulu neekum -dOmcu TaMtEgAni nityamuganu
mOhaMbu mAnumanucu -bOdhiMcu muKhyamuga nArAyaNA || [106]
en&ni dEhamulu ceDina -neevu nEka svarUpuMDa vagucu
jen&nalari yuMdu vilanu -dattva prasiddhamuga nArAyaNA || [107]
an&ni vEdAMta vAkya -mulalO mahAvAkyamulu nAlugu
nin&nu neeSvarunigAnu -varNiMcu nikkamuga nArAyaNA || [108]
uBhaya dRSyOpAdhulu, kaDamdrOsipOka yayyAtma migula
naBhayamuga niTuleppuDu -ciMtiMpu mani telupu nArAyaNA || [109]
jeeva Siva tArataMya -muna naikya siddhi kAnEra danucu
BhAva saMSayamu deerpu -kAryArtha paTimacE nArAyaNA || [110]
nirvikArumDavu neevu -nee yaMde nijamaina caMdamunanu
barvum brakRti vikAramu -lani telupu prauDhicE nArAyaNA || [111]
sadguruM DeereetigA -bOdhiMcu saraLitO vAkyArthamu
hRdgatamum jEsiyuMDi -jagati jeeviMpudunu nArAyaNA || [112]
ani ciMtanamu jEyucum -jittamunam danivim jeMducu neppu
Du, kanudam&mulanu muDucucu -dhyAnaMbugAm jEyu nArAyaNA || [113]
apagatAGha kRtyumDai -eereeti naBhyAsa monariMcucu
naparOksha siddhi noMdu -brahmaMbu tAnagucu nArAyaNA || [114]
kaMdaLita hRdayumDagucu -saccidAnaMda svarUpumDagu
cu, saMdarSitAtmumDagucu -nuMDu navikAratanu nArAyaNA || [115]
avyayAnaMda pUjya -rAjya siMhAsanAseenumDagucu
BhavyAtmumDai velasenu -bUjya saMBhAvyumDai nArAyaNA || [116]
neevu sakalaMbugAni -yun&nadE neekan&na vE~rokkaTi
jeevumDani varNiMcuTa -vyavahAra siddhikini nArAyaNA || [117]
ciluka palukulu palikiti -nAkEmi teliyum dattva rahasya
mu, valadu nanu nErameMca -sAdhulaku naLinAksha nArAyaNA || [118]
SaraNu BhaktArtihAri -gururUpa SaraNu sajjana rakshaka
SaraNu duritauGhanASa -SaraNipuDu karuNiMcu nArAyaNA || [119]
tappoppulanu dayatO teliyajEyagalarani prArthana
-e. SEShu mAdhava rAvu #(adluriengr.mun.ca)#
ద్గురుం డీరీతిగా -బోధించు సరళితో వాక్యార్థము
హృద్గతముం జేసియుండి
-జగతి జీవింపుదును నారాయణా