Tuesday, February 21, 2017

telugu cartoonists

LIST OF NAMES OF TELUGU CARTOONISTS AND THEIR PHOTOS

By Patamata Rajesh Babu at 23:06:00  Telugu Cartoons  

మన తెలుగు కార్టూనిస్టులు.

(వరుసగా... శ్రీమతులు రాగతి పండరి, వాగ్దేవి గార్లు, శ్రీయుతులు మల్లిక్, సుభాని, బాచి, సరసి, లేపాక్షి, ఓనావ

బ్నీం, రావెళ్ళ,గాంధీ, గోపాలకృష్ణ, హరగోపాల్,నాగిశెట్టి, పుక్కళ్ళ, చక్రవర్తి, వర్చస్వి, కందికట్ల, ఆకుండి, బన్ను

కామేశ్, ఎన్.ఎస్,కే.ప్రసాద్, కీ.శే. శేఖర్, గోపి బూరుగ, కృష్ణ, కళాసాగర్,కళాధర్ బాపు, కోలపల్లి, రామ్మోహన్

వి.ఆర్.ప్రసాద్,అల్లాడి మోహన్, రామశేషు, కలిమిశ్రీ, శ్రీమతి పద్మ, శ్రీ రామకృష్ణ, రంగరాజు, వినోద్, రవిప్రసాద్

పండరినాధ్, శేఖర్, బి.వి., చంటిబాబు, శర్మ, రవిశర్మ, నరేశ్, దొరశ్రీ, ప్రభురాం, తోపల్లి ఆనంద్ గార్లు


మహిళా కార్టూనిస్ట్ రాగతి పండరి కన్నుమూత!

గురువారం, 19 ఫిబ్రవరి 2015 (19:36 IST)

ప్రముఖ మహిళా కార్టూనిస్ట్ రాగతి పండరి కన్నుమూశారు. అవివాహిత అయిన రాగతి చిన్నతనంలోనే పోలియో వ్యాధి బారిన పడ్డారు. అయినప్పటికీ కార్టూనిస్టుగా రాణించి.. చూడగానే నవ్వు వచ్చే విధంగా ఆమె కార్టూన్లు గీసేవారు. ఈ నేపథ్యంలో గురువారం విశాఖలో ఆమె తుదిశ్వాస విడిచారని.. మరణించేనాటికి ఆమె వయస్సు 50 సంవత్సరాలు. 
ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ వచ్చిన ఆమెను విశాఖలోని ఓ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందిన రాగతి గురువారం కన్నుమూశారు. 
అయితే రాగతి పండరి అవయవాలను సావిత్రిబాయి పూలే మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఆమె కుటుంబ సభ్యులు దానం చేశారు. మహిళలు చాలా తక్కువ సంఖ్యలో వున్న కార్టూన్ రంగంలో రాగతి పండరి గుర్తింపు పొందారు. అనేక పత్రికల్లో రాగతి కార్టూన్లు అచ్చయ్యాయి. వ్యంగ్యంగా కార్టూన్లు గీయడంతో రాగతి దిట్ట. దురాచారాల్ని ప్రశ్నిస్తూ.. హాస్యం మేళవిస్తూ కార్టూన్లు గీసిన గీత ఆగిపోయింది. 

No comments: