1) ప్రశ్న . గుండె ఆరోగ్యానికి చెయ్యవలసిన పనులు ఏమిటి ?
జవాబు :
1)తక్కువ కార్బోహైడ్రేట్లు , ఎక్కువ ప్రోటీన్స్ , తక్కువ నూనెలు.
2) వారానికి కనీసం 5 రోజులు రోజుకు ఒక అరగంట చొప్పున నడక , లిఫ్ట్ ఎక్కడం మానడం , ఎక్కువ సేపు కూర్చోకుండా ఉండడం.
3) ధూమ పానం మానడం.
4) బరువు కంట్రోల్ లో ఉంచుకోవడం.
5) బి పి. షుగరు కంట్రోల్ లో ఉంచుకోవడం.
2) ప్రశ్న : ఆరోగ్యంగా కనిపించే వ్యక్తి కూడా ఒక్కోసారి హార్ట్ ఎటాక్ కి గురి అవుతున్నాడు . ఇది ఆశ్చర్యం కదా ! దీన్ని ఎలా అర్ధం చేసుకోవాలి ?
జవాబు : దీనినే సైలెంట్ ఎటాక్ అంటారు . అందుకే 30 సంవత్సరాలు దాటినా ప్రతీ వ్యక్తీ హెల్త్ చెక్ అప్ చేయించుకోవాలి .
3) ప్రశ్న : గుండె పోటు వంశ పారం పర్యమా ?
జవాబు : అవును
4) ప్రశ్న : గుండె పై ఒత్తిడి ఎలా వస్తుంది ఒత్తిడి తగ్గించుకోవడం ఎలా ? (స్ట్రెస్)
జవాబు : జీవితం పట్ల మీ వైఖరి మారాలి . ఏదీ పూర్తి పర్ఫెక్ట్ గా ఉండక పోవచ్చు అనేది గుర్తుంచుకోవాలి.
5) ప్రశ్న: ఆరోగ్య వంత మైన గుండె కోసం జాగ్గింగ్ , నడక రెండింటిలో ఏది ఉత్తమం ?
జవాబు : నడక మంచిది . జాగ్గింగ్ లో జాయింట్స్ మీద ఒత్తిడి పెరిగి ప్రమాదం జరగవచ్చు.
6) ప్రశ్న : లో బ్లడ్ ప్రెషర్ వారికి గుండె పోటూ వచ్చే అవకాశం ఉందా ?
జవాబు : చాలా తక్కువ.
7) ప్రశ్న : అకాల భోజనాలు గుండె మీద ప్రభావం చూపిస్తాయా ?
జవాబు : మీరు అకాల భోజనాలు చెయ్యడం వలన జంక్ ఫుడ్ తింటారు . ఆ ఆహారం జీర్ణం కావడానికి ఊరవలసిన ఎంజైములు కన్ఫ్యూజ్ అవుతాయి .
8) ప్రశ్న : మందులు వాడకుండా కొలెస్టరాల్ కంట్రోల్ చెయ్యడం ఎలా ?
జవాబు : ఆహార నియంత్రణ , నడక , వాల్ నట్స్ తినడం ద్వారా కొలెస్టరాల్ కంట్రోల్ చేయవచ్చు.
9) ప్రశ్న : గుండె ఆరోగ్యానికి మంచి ఆహారం ఏది ? చెడ్డ ఆహారం ఏది ?
జవాబు : పళ్ళు , కాయగూరలూ మంచివి . నూనెలు చెడ్డవి.
10) ప్రశ్న : ఏమేమి టెస్టులు చేయించుకోవాలి ? ఏదైనా ప్రత్యెక టెస్ట్ ఉందా ?
జవాబు : రొటీన్ షుగర్ , బి . పి , కొలెస్టరాల్ చాలు . ఎకో టెస్ట్ చేయించుకుని ట్రెడ్ మిల్ చేయించుకోండి.
.
11) ప్రశ్న : గుండె పోటు వచ్చిన వారికి చెయ్యవలసిన తక్షణ సహాయం ఏమిటి ?
జవాబు : గుండె పోటు వచ్చిన వ్యక్తిని పడుకోబెట్టండి . ఒక ఆస్ప్రిన్ మాత్ర నాలుక కింద పెట్టండి . సోర్బిట్రేట్ మాత్ర అందుబాటులో ఉంటె అది కూడా పెట్టండి . వీలయినంత త్వరగా గుండె వ్యాధి నిపుణుడి దగ్గరకి తీసుకు వెళ్ళండి . మొదటి గంట లోపులోనే మరణం సంభవించే అవకాశాలు ఎక్కువ .
12) ప్రశ్న : గేస్త్రిక్ నొప్పికీ - గుండె నొప్పికీ తేడా తెలుసుకోవడం ఎలా ?
జవాబు : ఈ సి జీ చూస్తే గానీ చెప్పలేము.
13) ప్రశ్న : యువకులలో గుండె వ్యాధులూ , హార్ట్ ఎటాక్ లు పెరిగి పోవడానికి కారణం ఏమిటి ? ( 30 - 40 మధ్య యువతలో హార్ట్ ఎటాక్ లు , గుండె వ్యాధులూ ఈ మధ్య ఎక్కువ అయ్యాయి )
జవాబు : యువతలో అవేర్నెస్ పెరిగింది . అందు వలన కేసులు కనిపిస్తున్నాయి . జీవన విధానం ( బద్ధకం ) , జంక్ ఫుడ్ , వ్యాయామం లేక పోవడం , పొగ తాగడం . మన దేశం లో జెనేటికల్ గా అమెరికా , యూరోప్ దేశాలతో పోలిస్తే గుండెపోటు అవకాశాలు 3 రెట్లు ఎక్కువ .
.
14) ప్రశ్న : బి. పి 120 /80 కంటే ఎక్కువ గా ఉండి పూర్తి ఆరోగ్యంగా ఉండే వ్యక్తులు ఉంటారా ?
జవాబు : ఉంటారు.
15) ప్రశ్న: ఎన్టీ హైపర్ టేన్సివ్ మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ? ( దీర్ఘ కాలం లో కానీ / స్వల్పకాలం లో కానీ )
జవాబు : చాలా మందులకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి . ఇప్పుడు వస్తున్న కొన్ని మందులు చాలా వరకూ సేఫ్.
16) ప్రశ్న : కాఫీ / టీ ఎక్కువ తాగడం వలన గుండెకు ఏమైనా ప్రమాదం ఉందా ?
జవాబు : లేదు అది కేవలం అపోహ మాత్రమే.
17) ప్రశ్న : మీ దృష్టిలో జంక్ ఫుడ్ అంటే ఏమిటి ?
జవాబు : వేపుళ్ళు ఉదాహరణ కెంటకీ , మెక్ డొనాల్డ్స్ , సమోసాలు , మసాలా దోశలు కూడా.
18) ప్రశ్న: భారతీయులు గుండె జబ్బులకు గురి అయ్యే అవకాశం 3 రెట్లు ఎక్కువ అమెరికా , యూరోపు వారితో పోల్చితే అన్నారు . వాళ్ళు కూడా జంక్ ఫుడ్ ఎక్కువ తింటారు కదా !
జవాబు : ప్రతీ జాతీ కొన్ని జబ్బులకు గురిఅవుతూ ఉంటుంది ( అనుకూలత ఉంటుంది ) దురదృష్ట వశాత్తూ భారతీయులు ఖరీదైన గుండె జబ్బులకు గురి కావడం జరుగుతున్నది .
19) ప్రశ్న : లో వైట్ బ్లడ్ సెల్స్ ( తక్కువ తెల్ల రక్త కణాలు ) హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం గుండె జబ్బులకు కారణాలు అవుతాయా ?
జవాబు : కావు . కానీ నార్మల్ హిమోగ్లోబిన్ వలన మీరు ఎక్సేర్సైజ్ చేసే కెపాసిటీ పెరుగుతుంది.
20) ప్రశ్న : షుగరుకూ , గుండె జబ్బులకూ సంబధం ఉందా ?
జవాబు : ఉంది . షుగర్ పేషెంట్ కి గుండె జబ్బులు వచ్చే అవకాశం మిగిలిన వారితో పోలిస్తే ఎక్కువ .
21) ప్రశ్న : గుండె ఆపరేషన్ తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి ?
జవాబు : ఆహారం , ఎక్సేర్సైజ్ , మందులు సకాలం లో వేసుకోవడం , కొలెస్టరాల్ , బరువు , బి పీ లను కంట్రోల్ లో ఉంచుకోవడం.
.
22) ప్రశ్న : ఆడవాళ్ళల్లో కంటే మగవాళ్ళల్లో గుండె జబ్బుల రేటు ఎక్కువ ఎందువలనా ?
జవాబు : ప్రకృతి ఆడ వాళ్ళను 45 సంవత్సరాల వరకూ రక్షిస్తూ ఉంటుంది ( ఇప్పడు వెలువడిన గణాంకాల ప్రకారం ఆడవాళ్ళల్లో ప్రస్తుతం ఈ రేటు మగవాళ్ళల్లో కన్నా ఎక్కువగా ఉంది.
ఆఖరు ప్రశ్న :
గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలా ?
జవాబు :
ఆరోగ్య వంత మైన ఆహారం తినండి
ప్రతి రోజూ ఎక్సేర్సైజ్ చెయ్యండి
జంక్ ఫుడ్ తినకండి
స్మోకింగ్ మానండి
30 సంవత్సరాల తర్వాత ప్రతీ ఆరు నెలలకూ హెల్త్ చెక్ అప్ చేయించుకోండి (రికమెండెడ్)
No comments:
Post a Comment