Wednesday, January 17, 2018

जबकि केहि किताबहरु मा मधुमेह को जागरूकता को लागी उपलब्ध छ, मधुमेह रोग को जीवन मा धेरै चीजहरु लाई यस जवाब को जवाब मा उत्तर नहीं गर्न सक्छन् कि अधिकांश यिनी मधुमेहहरु मा एकदम अधिक सरल तरिका मा उपलब्ध पुस्तकहरु को अधिकांश मा जवाब दिइन्छ केही व्यक्ति जसले सम्पूर्ण रामायणलाई "पुल निर्माण गरे, रावणको हत्या गर्यो र सट्टा फेरि ल्याए" भवन, काटन, मारियो, ल्याइयो {



त्यसपछि त्यहाँ प्रत्येक टम डिक र हैरी वेबसाइटहरु मा लेखिएको छ, यसो भनिन्छ यदि मधुमेह गायब हुनेछ भने, वा यदि तपाईले यो गर्नु हुँदैन भने, मधुमेह औषधि नदिनुहोस् वा होमियोपैथिक औषधि आयुर्वेद प्रयास गर्नुहोस्। योगा या मधुमेह बिरामीहरू बेवकूफ र निराश भएका छन्



म यस पुस्तकको लागि कष्टप्रद ड्रग्समा खर्चको सट्टा पैसा कहाँ पुग्छु?

र रोगीहरू यसो भन्दै छन् "वैसे पनि यो मलाई सबै जान्दछ, किन किन किताबहरू खरीद गर्दछ" र तिनीहरूलाई किन खरीद गर्दैन

यस समयमा

एक डाक्टरको रूपमा, जसले भारत र अमेरिकामा 35 वर्षको लागि सेवा गरिरहेको छ, मैले सबै चीजको बारेमा सबै भन्दा राम्रो ब्लगहरू सुरू गर्ने निर्णय गरेको छु, मधुमेह बारे एक व्यापक ब्लग।

नि: शुल्क पुस्तक मा मधुमेह को एक व्यापक समझ को लागि काम गरेर रह हूँ। यस साइटमा तुरुन्तै निःशुल्क PDF फाइल ढाँचा बनाइयो डाउनलोड गर्नुहोस्।



मधुमेह रोगीहरू वा तिनीहरूका आफन्तहरू र साथीहरू जसले तेल र अन्य भारतीय भाषाहरूमा लेख्ने क्षमताको योग्य छन्, जो सक्षम र इच्छुक हुन्छन्, केही समयले अंग्रेजी विषयलाई तेलुगु र अन्य भारतीय भाषाहरूमा अनुवाद गर्न भनेका छन् भने उनीहरूलाई मद्दत गर्न चाहन्छन्।
कृपया मेरो आफ्नै ईमेलमा एउटा सानो इमेल लेख्नुहोस्
मा
अन्तरराष्ट्रीय RSI@gmail.com



यो पढ्नको लागि अन्त्यमा

धन्यवाद



डा। हरिहरन राममूर्ति

మధుమేహం ఒక చెద పురుగులాంటిది! కట్టడి చెయ్యకుండా వదిలే ఒళ్లంతా గుల్ల చేస్తుంది

మధుమేహం ఒక చెద పురుగులాంటిది! కట్టడి చెయ్యకుండా వదిలే ఒళ్లంతా గుల్ల చేస్తుంది
 కళ్ల నుంచి కాళ్ల వరకూ, గుండె నుంచి కిడ్నీల వరకూ, శరీరంలోని దాదాపు అన్ని అవయవ వ్యవస్థలన్నిటినీ దెబ్బతీస్తుంది. ఈ విషయం ఇప్పడు అందరికీ తెలిసిందే. ఆయితే పెద్దగా అందరికీ తెలియని మధుమేహం కారణంగా మన జీర్ణ అవయవాలు, జీర్ణ ప్రక్రియ ప్రభావితం అవుతాయి
దీర్ఘకాలంగా మధుమేహం ఉన్నవారిలో. ముఖ్యంగా అది నియంత్రణలో లేనివారిలో, జీర్ణ అవయవాల్లో కీలక కూర్పులు కావచ్చు దీనివల్ల నోటి నుంచి మలద్వారం వరకూ వండే జీర్ణ అవయవాలన్నిటి లోనూ తలెత్తవచ్చు. వీటిని గుర్తించటంలోనే కాడు. చికిత్సలను అందించటంలో కూడా నేటి ఆధునిక వైద్యరంగం ఎంతో పురోగతి సాధిస్తోంది.
మధుమేహానికీ, జీర్ణవ్యవస్థకూ మధ్య సంబంధం అవినాభావం. అసలు మధుమేహానికి కేంద్ర స్థానమైన క్లోమం. జీర్ణవ్యవస్థల్లో భాగమే !
ఈ క్లోమం గ్రంథి లోని - ఐలెట్ లు గ్లూకోజును నియంత్రిస్తుండే కీలక "ఇన్సులిన్
ఉత్పత్తి చేస్తాయి, ఇదొక్కటే కాదు, పేగుల్లోని మరికొన్ని హార్మోన్లు కూడా నియంత్రణలో కీలకపాత్ర పోషిస్తున్నట్టు ఇటీవలి అధ్యయనాల్లో గుర్తించారు. చిన్న పేగు చివర భాగమైన ఐలియంలో తయారయ్యే GLP-1 అనే హార్మోను ఇన్సులిన్ స్రావం పైన నియత్రణ కలిగి ఉంది
సమస్యలు
ఎందుకంటే ఇన్సులిన్ స్థాయిలు ఎక్కువే ఉన్నా శరీరం దాన్ని గ్రహించలేకపోవచ్చు దీన్నే "ఇన్సులిన్ /రెసిస్టెన్స్ /నిరోధక్షత' అంటున్నారు. అందుకే శరీరంలో గ్లూకోస్ నియంత్రణ అన్నది కొన్ని వ్యవస్థలు సమిష్టిగా నిర్వర్తించే ప్రక్రియ నెట్వర్క్ అనీ, దీనిలో శరీరంలోని వివిధ హార్మోన్లన్నీ కలగలిసి పాలుపంచుకుంటున్నాయని ఇపుడు స్పష్టంగా దీనర్థం - దీన్ని బట్టి గ్లూకోస్ నియంత్రణలో జీర్ణకోశం మొత్తానికీ ప్రాధాన్యం ఉందనే! మనం తీసుకునే ఆహారం ముందుగా గ్లూకోస్ గా మారుతుంది ఆ తర్వాతే శరీరం దాన్ని గ్రహిస్తుంది. ఈ ప్రక్రియలో ఏ దశలోనైనా ఇబ్బందులు తలెత్తి ఆహారం సరిగా జీర్ణం కాకపోతే  గ్లూకోస్ ను గ్రహించటం తగ్గిపోతుంది ఒకవేళ ఆహారం చాలా త్వరగా జీర్ణమై.. చిన్న పేగుల్లోకి వెళ్లిపోతే హఠాత్తుగా "డంపింగ్ సిండ్రోమ్' అంటారు.)పోర్మోన్డే కదలికలకూ ప్రాముఖ్యం ఉంది నోటి నుంచి మలద్వారం వరకూ వుండే జీర్ణవ్యవస్థపై మధుమేహం రకరకాలుగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మధుమేహుల్లో స్వయంచాలిత (ఆటనమిక్) నాడీవ్యవస్థ దెబ్బతింటుంది, ఇది మన ప్రమేయం లేకుండా శరీర ప్రక్రియలను నిరాఘాటంగా నడిపిస్తుండే కీలకమైన నాడీవ్యవస్థ మధుమేహూల్లో జీర్ణకోశ ఇబ్బందులకు చాలావరకు ఈ నాడీవ్యవస్థ దెబ్బతినటమే కారణం. దీనిలో భాగమైన సింపదిటిక్, పారాసింపదిటిక్ నాడీవ్యవస్థలు జీర్ణకోశాన్ని నియంత్రిస్తుంటాయి. పారాసింపధిటిక్ నాడీ వ్యవస్థ స్పందనలు తగ్గి, మొద్దుబారితే పేగుల కదలికలు తగ్గుతాయి. స్వయంచాలిత నాడీ వ్యవస్థ చురుకుదనం తగ్గితే పేగుల్లో కీలక స్రావాలూ తగ్గుతాయి. ముఖ్యంగా కంటిలో, కిడ్నీల్లో సమస్యలున్న మధుమేహాల్లో ఈ అటానమిక్ నాడీవ్యవస్థ కూడా దెబ్బతినటం తరచుగా చూస్తుంటాయి. ఈ అటానమిక్ నాడీ వ్యవస్థ దెబ్బతిందన్న విషయాన్ని బీపీ పరీక్ష ద్వారా తేలికగా గుర్తించొచ్చు మామూలుగా మనం పడుకొని, పైకి లేచి నిలబడినపుడు ముందు రక్తపోటు కొద్దిగా తగ్గి, వెంటనే మళ్లీ పెరుగుతుంది. కానీ ఈ రకం సమస్య వున్నవారు పడుకుని, లేచి నిలబడినపుడు ఒక్కసారిగా సిస్టాలిక్ యోక్క రక్తపోటు పడిపోతుంది. కళ్ల తిరిగినట్లవుతుంటుంది.) ఈ స్వయంచాలిత నాడీ వ్యవస్థ పనితీరు దెబ్బతినటం వల్ల మధుమేహుల్లో నోటి మంచి మలద్వారం వరకూ జీర్ణ అవయవాలన్నీ ప్రభావితమవుతాయి. అసిడిటీ నుంచి మలబద్దకం వరకూ రకరకాల జీర్ణ సమస్యలు బయల్దేరతాయి

నోరు : + తరచుగా పుండ్లు : మధుమేహాల్లో తరచుగా నోట్లో పుండ్లు ఏర్పడుతుంటాయి. దీన్నే ఆఫ్థస్ స్టోమటైటిస్అంటారు. పైగా వీరిలో ఈ పండ్లు తగ్గటానికి చాలా రోజులు పడుతుంది కూడా సాధారణంగా ఇవి మధుమేహం సరిగా నియంత్రణలో లేనప్పడు ఎక్కువగా చస్తాయి. గ్లూకోస్ నియంత్రణలో వుంటే పుండ్లు కూడా తగ్గిపోతాయి.

కాలేయం : మధుమేహం

 కాలేయం :
కాలేయానికి కొవ్వు  ; దీర్ఘకాలం మధుమేహం నియంత్రణలో లేనివారిలో కాలేయానికి కొవ్వు పట్టే అవకాశం (ఫ్యాటీ లివర్, చాలా ఎక్కువ. దీనివల్ల హెపటైటిస్, దాని నుంచి లివర్ గట్టి పడిపోయి సిరోసిస్ లోకీ వెళ్లవచ్చు, అందుకే మధుమేహం లో హెపటైటిస్-బి, ఆల్కహాల్ అలవాటు వంటివేమీ లేకున్నా కూడా సిరోసిస్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది, దీనివల్ల లివర్ పూర్తిగా దెబ్బతిని ప్రమాదకర స్థితి తలఎత్తుతుంది

ఏం చేస్తారు ? :
దీన్ని ముందుగా గుర్తించటం అవసరం. వీరికి అపుడపుడు పొత్తికడుపు ఆల్రాసౌండ్ లివర్ ఎంజైముల పరీక్షలు చేయిస్తుండటం మంచిది. ఈ పరీక్షల్లో లివర్ వద్ద కొవ్వు చేరిందని తేలినా, ఎంజైముల్లో తేడాలున్నా దాన్ని ఏమాత్ర నిర్లక్ష్యం చెయ్యకుండా చికిత్స చెయ్యాలి. ఉర్సిడోడీఆక్సీకోలిక్ యాసిడ్ మొదలైన మందులతో చికిత్స శారీరక వ్యాయామం సిఫారసు చేస్తారు.
వీటితో కాలేయం కొవ్వు తగ్గేలా చూసుకోవాలి.

గ్యాస్ట్రోపెరిసిస్ : మధుమేహుల్లో జీర్ణాశయం కదలికలూ తగ్గుతాయి

గ్యాస్ట్రోపెరిసిస్ : మధుమేహుల్లో జీర్ణాశయం కదలికలూ తగ్గుతాయి దీంతో తిన్న ఆహారం జీర్ణాశయం నుంచి పేగుల్లో ప్రవేశించటానికి ఎక్కువ సమయం పడుతుంది. దీన్ని డయాబెటిక్ గ్యాస్ట్రోపెరిసిస్ అంటారు. దీనివల్ల రోజుల తరబడి ఆహారం జీర్ణాశయంలోనే ఉండిపోతుంది. కొన్నిసార్లు 2,3 రోజుల ముందు తిన్న ఆహారమూ అలాగే ఉండిపోతుంది, మధుమేహుల్లో ఇది చాలా పెద్ద సమస్య ఫలితంగా ఆకలి తగ్గిపోతుంది. తిన్నది జీర్ణం కాదు. వాంతి అయితే రెండు, మూడు రోజుల ముందు తిన్నది వస్తుంటుంది. గొంతులో ఏదో అడ్డుపడినట్టుంటుంది
బరువు తగ్గుతారు. దీనితో తీవ్ర వ్యథ అనుభవిస్తుంటాడు. జీవితమే వృధా అన్నంత. అలాగని వీరికి ఎక్స్రేగానీ, ఎండోస్కోపిగానీ చేస్తే కనిపించవు. కొన్నిసార్లు లక్షణాలు చూసి దీన్ని క్యాన్సర్" అనుకుంటారు కూడా, కొందరితో ఇది పాక్షికంగా కూడా ఉండొచ్చు త్రేన్పులు, కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి లక్షణాలే కనిపించొచ్చు
ఏం చేస్తారు ? : తొలిదశలో దీవికి మండులు బాగానే పని
 సాధారణంగా గాస్త్రైటిస్  కు ఇచ్చే మందులు అంతగా పనిచేయవు గానీ
ఇటియోపైడ్,అలాగే అంటీబయోటిక్ మందైన 'ఎరిత్రోమైసిన్' వంటివి బాగా
పయోగపడతాయి. వీటిని దీర్ఘకాలం వాడటం వల్ల కదలికలు మెరుగుపడతాయి. అయితే "మెటాక్లోప్రమైడ్' అనేదీ ఇస్తారు, అయితే ఈ మందులు అందరిలోనూ ఇవ్వకపోవచ్చు అందుకే దీనిపై పరిశోధనలు, అధ్యయనాలు జరుగుతున్నాయి.

గ్యాస్ట్రోపెరిసిస్ కు జీర్ణాశయం కదలికలు తగ్గటం ముఖ్యకారణం కాబట్టి కదలికలు మెరుగుపరిచే దిశగా చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. బయటి నుంచి విద్యుత్ ప్రచోదనాలను (కరెంట్ పల్సెస్) ఇచ్చే పరికరాలూ అందుబాటులోకి వస్తున్నాయి. ఇవి గుండెకు అమర్చే పేస్ మేకర్ల లాంటివి. వీటిని 'గ్యాస్ట్రిక్ పేస్ మేకర్లనవచ్చు. వీటి తీగలను ల్యాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా జీర్ణాశయం పైన అమరుస్తారు. సర్జరీ అవసరం లేకుండా ఎండోస్కోపి ద్వారా అమర్చే విధానాలూ రానున్నా ఆహారం తీసుకున్న తర్వాత బయటి నుంచి రిమోట్ ద్వారా ఎలక్ట్రోడ్లను  ఆన్ చేస్తే జీర్ణాశయంలో కదలికలు పెరిగి, ఆహారం ముందుకు కదులుతుంది. దీనిపై ప్రస్తుతం అమెరికా పరిశోధకులతో కలిసి హైదరాబాద్‌లోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్మాస్ట్రోఎంటరాలజీ వైద్యులు విస్తృతంగా కృషి చేస్తున్నారు.

డయాబెటిక్ రిస్కు

డయాబెటికస్ ఉన్నట్లే

డయాబెటిస్ నెప్రోపతి

అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఎక్కువ బాధపెట్టేటువంటి వ్యాధి డయాబెటిస్ నెప్రోపతి! దీనిలో దాని పని అది నెరవేర్చక పోవటం. దీని వలన. శరీరంలో వ్యర్థ పదార్ధములు, రసాయనములను నిరోధించలేక పోవటం జరుగుతుంది. దీనివలన- అనారోగ్యం కలుగుతుంది. దీనికి రెగ్యులర్గా డయాలసిస్ చేయవలసి వస్తుంది, ఇది చేయకపోతే త్వరలో మృత్యువు  తప్పదు! డయాలసిస్ చేయకపోతే కిడ్నీ మార్పిడి చేయవలసి వస్తుంది.
రాబోయే కాలంలో మానవజాతికి ముప్పు ఎయిడ్స్ వలన గాని, బర్డ్ ఫ్లూ వలన గానీ కాదు. ముఖ్యంగా హాని డయాబెటిస్ వలననే  వస్తుందనీ, అదీ. ముఖ్యంగా మన భారతదేశంలోనే ఎక్కువయ్యే అవకాశాలున్నాయని వైద్యశాస్త్రజ్ఞలు అభిప్రాయపడుతున్నారు.
ఈ వ్యాధి పంచదార ఎక్కువ తినటం వలన వస్తుందనే అభిప్రాయం చాలా మందికి వుంది. కానీ అది నిజం కాదు. మన జన్యువుల్లోనే ఈ వ్యాధి లక్షణములు ఉన్నాయి. దీనిని అదుపు చేయడానికి దీర్ఘకాల చికిత్సలు చాల అవసరము!

మనం తినే ఆహారంలో కేలరీలను దేహ పరిశ్రమతో ప్రతిరోజు కొంత వరకూ ఖర్చు చేయవలసి వుంది కానీ మనం ఆ విషయంలో ఏమాత్రం శ్రద్ధ చూపడం దీనివల్ల బరువు పెరగడం జరుగుతుంది దీనికి కారణంగా డయాబెటిస్ ని  మనం ఆహ్వానించు తున్నాము. దీనికి కేవలం మాత్రలు మింగితే సరిపోదు. దీని వలన ఆరు రెట్ల గుండె వ్యాధులు, కిడ్నీ పనిచేయక పోవటం వంటి సమస్యలకు లోనవుతున్నాం, డయాబెటిస్ వ్యాధి ముఖ్యంగా జీవనశైలిని మార్చివేస్తుంది.
షుగర్'ను ఎలా సమర్థవంతంగా నియంత్రించాలి ?
ఇది ప్రాణాంతక మవకుండా ఏంచేయాలి ?
షుగర్వల్ల దెబ్బతినే అవయవాలను ఎలా కాపాడుకోవాలి ?
అందుకు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి ?
ఆహార నియమాలు ఎలా పాటించాలనేవి
అతిముఖ్యమైన విషయాలు