గ్యాస్ట్రోపెరిసిస్ : మధుమేహుల్లో జీర్ణాశయం కదలికలూ తగ్గుతాయి దీంతో తిన్న ఆహారం జీర్ణాశయం నుంచి పేగుల్లో ప్రవేశించటానికి ఎక్కువ సమయం పడుతుంది. దీన్ని డయాబెటిక్ గ్యాస్ట్రోపెరిసిస్ అంటారు. దీనివల్ల రోజుల తరబడి ఆహారం జీర్ణాశయంలోనే ఉండిపోతుంది. కొన్నిసార్లు 2,3 రోజుల ముందు తిన్న ఆహారమూ అలాగే ఉండిపోతుంది, మధుమేహుల్లో ఇది చాలా పెద్ద సమస్య ఫలితంగా ఆకలి తగ్గిపోతుంది. తిన్నది జీర్ణం కాదు. వాంతి అయితే రెండు, మూడు రోజుల ముందు తిన్నది వస్తుంటుంది. గొంతులో ఏదో అడ్డుపడినట్టుంటుంది
బరువు తగ్గుతారు. దీనితో తీవ్ర వ్యథ అనుభవిస్తుంటాడు. జీవితమే వృధా అన్నంత. అలాగని వీరికి ఎక్స్‘రేగానీ, ఎండోస్కోపిగానీ చేస్తే కనిపించవు. కొన్నిసార్లు లక్షణాలు చూసి దీన్ని క్యాన్సర్" అనుకుంటారు కూడా, కొందరితో ఇది పాక్షికంగా కూడా ఉండొచ్చు త్రేన్పులు, కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి లక్షణాలే కనిపించొచ్చు
ఏం చేస్తారు ? : తొలిదశలో దీవికి మండులు బాగానే పని
సాధారణంగా గాస్త్రైటిస్ కు ఇచ్చే మందులు అంతగా పనిచేయవు గానీ
ఇటియోపైడ్,అలాగే అంటీబయోటిక్ మందైన 'ఎరిత్రోమైసిన్' వంటివి బాగా
ఉపయోగపడతాయి. వీటిని దీర్ఘకాలం వాడటం వల్ల కదలికలు మెరుగుపడతాయి. అయితే "మెటాక్లోప్రమైడ్' అనేదీ ఇస్తారు, అయితే ఈ మందులు అందరిలోనూ ఇవ్వకపోవచ్చు అందుకే దీనిపై పరిశోధనలు, అధ్యయనాలు జరుగుతున్నాయి.
గ్యాస్ట్రోపెరిసిస్ కు జీర్ణాశయం కదలికలు తగ్గటం ముఖ్యకారణం కాబట్టి కదలికలు మెరుగుపరిచే దిశగా చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. బయటి నుంచి విద్యుత్ ప్రచోదనాలను (కరెంట్ పల్‘సెస్) ఇచ్చే పరికరాలూ అందుబాటులోకి వస్తున్నాయి. ఇవి గుండెకు అమర్చే పేస్ మేకర్ల లాంటివి. వీటిని 'గ్యాస్ట్రిక్ పేస్ మేకర్లనవచ్చు. వీటి తీగలను ల్యాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా జీర్ణాశయం పైన అమరుస్తారు. సర్జరీ అవసరం లేకుండా ఎండోస్కోపి ద్వారా అమర్చే విధానాలూ రానున్నా ఆహారం తీసుకున్న తర్వాత బయటి నుంచి రిమోట్ ద్వారా ఎలక్ట్రోడ్లను ఆన్ చేస్తే జీర్ణాశయంలో కదలికలు పెరిగి, ఆహారం ముందుకు కదులుతుంది. దీనిపై ప్రస్తుతం అమెరికా పరిశోధకులతో కలిసి హైదరాబాద్‌లోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్మాస్ట్రోఎంటరాలజీ వైద్యులు విస్తృతంగా కృషి చేస్తున్నారు.
No comments:
Post a Comment