అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఎక్కువ బాధపెట్టేటువంటి వ్యాధి డయాబెటిస్ నెప్రోపతి! దీనిలో దాని పని అది నెరవేర్చక పోవటం. దీని వలన. శరీరంలో వ్యర్థ పదార్ధములు, రసాయనములను నిరోధించలేక పోవటం జరుగుతుంది. దీనివలన- అనారోగ్యం కలుగుతుంది. దీనికి రెగ్యులర్గా డయాలసిస్ చేయవలసి వస్తుంది, ఇది చేయకపోతే త్వరలో మృత్యువు తప్పదు! డయాలసిస్ చేయకపోతే కిడ్నీ మార్పిడి చేయవలసి వస్తుంది.
రాబోయే కాలంలో మానవజాతికి ముప్పు ఎయిడ్స్ వలన గాని, బర్డ్ ఫ్లూ వలన గానీ కాదు. ముఖ్యంగా హాని డయాబెటిస్ వలననే వస్తుందనీ, అదీ. ముఖ్యంగా మన భారతదేశంలోనే ఎక్కువయ్యే అవకాశాలున్నాయని వైద్యశాస్త్రజ్ఞలు అభిప్రాయపడుతున్నారు.
ఈ వ్యాధి పంచదార ఎక్కువ తినటం వలన వస్తుందనే అభిప్రాయం చాలా మందికి వుంది. కానీ అది నిజం కాదు. మన జన్యువుల్లోనే ఈ వ్యాధి లక్షణములు ఉన్నాయి. దీనిని అదుపు చేయడానికి దీర్ఘకాల చికిత్సలు చాల అవసరము!
మనం తినే ఆహారంలో కేలరీలను దేహ పరిశ్రమతో ప్రతిరోజు కొంత వరకూ ఖర్చు చేయవలసి వుంది కానీ మనం ఆ విషయంలో ఏమాత్రం శ్రద్ధ చూపడం దీనివల్ల బరువు పెరగడం జరుగుతుంది దీనికి కారణంగా డయాబెటిస్ ని మనం ఆహ్వానించు తున్నాము. దీనికి కేవలం మాత్రలు మింగితే సరిపోదు. దీని వలన ఆరు రెట్ల గుండె వ్యాధులు, కిడ్నీ పనిచేయక పోవటం వంటి సమస్యలకు లోనవుతున్నాం, డయాబెటిస్ వ్యాధి ముఖ్యంగా జీవనశైలిని మార్చివేస్తుంది.
No comments:
Post a Comment