చక్కెర స్థాయి. ఎప్పడెప్పడు ఎంతెంత?
* పరగడుపున (8 గంటలు ఏమీ తినకుండా) 65-100 మిల్లీ గ్రాములు * ఆహారం తిన్న గంటన్నర తర్వాత 100-140 మిల్లీ గ్రాములు * మధుమేహం వచ్చే సూచనలు ఉన్న వారికి 140-200 మిల్లీ గ్రాములు
హెచ్బీఎ1సి స్థాయిలు.
* ఆధునికంగా మూడు నెలల హెచ్బీఎ1సి చక్కెర స్థాయి పరీక్షలు వచ్చాయి. ఇందులో 5.7 నుంచి 6.4 శాతం ఉంటే చక్కెర వచ్చే సూచనలు ఉన్నట్లే, 6.5 కంటే ఎక్కువ ఉంటే మధుమేహం ఉన్నట్లు తప్పనిసరిగా 5.6 శాతం లోపు ఉంటేనే మధుమేహం లేనట్లు
భావించాలి.
కనిపించే హెచ్చరికలు
చాలా సందర్భాల్లో చక్కెర వ్యాధి రాబోతున్నట్లు ముందుగా ఎటువంటి లక్షణాలూ కనిపించవు. కాని ఒకసారి మధుమేహం వచ్చిన తరువాత మెల్లమెల్లగా కొన్ని రకాల గుర్తులు కనిపిస్తాయి. వీటిని బట్టి రక్తంలో చక్కెరలు పెరిగాయేమోనని అనుమానించాలి. వెంటనే మధుమేహ పరీక్ష చేయించుకోవాలి.
అకారణంగా బరువు తగ్గిపోవడం
அ385o తీసుకున్న గంటకే మళ్లీ భరించలేనంత ఆకలి వేయడం
విపరీతమైన దాహం
పదే పదే గంటా, అరగంట కోసారి మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం. ఒక్కోసారి పది నిమిషాలకోసారి కూడా రావచ్చు
డీహైడ్రేషన్
కొద్ది దూరం నడిచినా కాళ్ల నొప్పులు బాధించడం
అప్పటివరకు ఎంత శారీరక శ్రమ అయినా చేయగలిగిన వాళ్లు, ఇప్పడు చిన్న పనికే తీవ్రంగా అలసిపోవడం
మగతగా ఉండి, అపుడపుడు కళ్ళు తిరగడం
చిన్న పనికే తీవ్రంగా అలసిపోవడం
* శరీరం అంతటా దురద రావడం
అక్కడా అవగాహన తక్కువే
ఒంట్లో జబ్బు ఉన్నా గుర్తించకుండా ఏళ్ల తరబడి గడిపెయ్యటం మనలాంటి దేశాల్లో మామూలే గానీ.. అన్నింటా అభివృద్ధి చెందిన దేశంగా చెప్పకునే అమెరికాలో බීඡට පැයි పరిస్థితి కొనసాగుతుండటం విస్మయ కరం.
అమెరికాలో దాదాపు 2.8 శాతం మంది ఇప్పటికే మధుమేహం బారిన పడినా.. ఆ విషయం తెలియకుండానే తిరిగేస్తున్నారని 'అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్-సీడీసీ" సంస్థ పరిశోధకుల అధ్యయనంలో ධීඝ්රයිටයි. ෂධියට්ට්"ඒ" ఆరోగ్య బీమా సౌకర్యం అందరికీ అందుబాటులో లేకపోవడం, ముందస్తుగానే జబ్బు నివారణ సౌకర్యాల్ని ఆరోగ్య బీమా కల్పించకపోవటం వల్లే ఇలాంటి సమస్య తలెత్తుతోందని పరిశోధకులు పేర్కొంటున్నారు. 1999-2004 మధ్య చేపట్టిన నేషనల్ హెల్త్, న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ సర్వేలో ఈ అంశాలు బయటపడ్డాయి. ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల్ని పొందటంలో అడ్డంకులుగా నిలుస్తున్న పరిమితులే మధుమేహాన్ని ప్రాథమిక దశలోనే గుర్తించటానికి ఇబ్బంది కలిగిస్తున్నాయని తేలింది.
(21)
మధుమేహం ముప్పుపై ఎంతమందికి అవగాహన ఉందనే దిశగా ఒక్లహామా యూనివర్సిటీ పరిశోధకులు చేపట్టిన మరొక అధ్యయనంలో 442 మంది తమకు మధుమేహం లేదని వెల్లడించారు. కానీ... వాస్తవానికి వీరిలో 55 శాతం మందికి మధుమేహం ఇప్పటికే ఉంది. మరో 52 శాతం మంది తమకు పొంచి ఉన్న ముప్పును తెలుసుకోని వారేనని తేలింది. 69 శాతం మంది ప్రమాదం అంచునే ఉన్నా. తమకు పెద్దగా ముప్పేమీ లేదని భావిస్తున్నట్లు గుర్తించారు. కేవలం 31 අප පද්රට කටයි మాత్రమే తమకు మధుమేహం ముప్పు ఉన్నట్లు భావించారు. మధుమేహాన్ని నివారించుకునే విషయంలో వృద్దులే కొంత ఆశావాదంతో ఉండగా, యువత మాత్రం నిరాశవాదాన్ని వ్యక్తపరుస్తున్నట్లు తేలింది
అధికబరువుతో మధుమేహం
లావుతో వచ్చే అనారోగ్య సమస్యలు ఎన్నో ఉన్నాయి. బి.పి. షుగర్ వంటి వాటితోపాటు గుండె, మెదడు, కిడ్నీ కాలేయం వంటి వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. అధికబరువు వుంటే సంతానం కూడా కష్టమే అనేది మనకు తెలుసు. అందుకే అధికబరువు ఉండే మహిళలు జాగ్రత్తగా ఉండాలని |పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కారణం మహిళలు మొదటి కాన్పు తర్వాత బరువు తగ్గేలా చూసుకోవాలనీ, లేకపోతే రెండోసారి గర్భం ధరించినప్పుడు మధుమేహం వ్యాధికి గురి కావాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. బరువు నియంత్రణలో గల ಸ್ತಿಲಟ್ పోలిస్తే బరువు పెరిగిన వారిలో మధుమేహం ముప్పు ఎక్కువగా ఉంటున్నట్టు తేలింది. ముఖ్యంగా అధికబరువు గల స్త్రీలల్లో ఇది చాలా మార్పు తెస్తుండటం గమనార్హం. తొలికాను లో 80 కిలోలున్న మహిళా కాన్పు అనంతరం 3 కిలోలు తగ్గితే రెండోసారి గర్భం ధరించినప్పడు మధుమేహం ముప్పు 75 శాతం తగ్గుతుండటం విశేషం. గర్భధారణ సమయంలో మధుమేహం (జేస్టేశనల్ డయాబెటిస్)
"మధుమేహం పట్ల అవగాహన లేకపోవడంతో మధుమేహం ఉన్నట్టు నిర్ధారణ అయ్యే నాటికే చాలామందిలో అప్పటికే వ్యాధి బాగా ముదిరిపోయి ఉంటుంది. దీనికి కారణం వ్యాధి లక్షణాలను ముందే గుర్తించలేకపోవడమే. పైగా మధుమేహం నిలకడగా ఉండే వ్యాధి కాదు. ఏళ్లు గడిచే కొద్ది వ్యాధికి సంబంధించి వివిధ పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఒక్కోసారి చికిత్స తీసుకుంటున్నా వ్యాధి అదుపులోకి రాకపోవచ్చు. దానికి గల కారణాలను జాగ్రత్తగా గమనిస్తూ.. ఎప్పటి కప్పడు డాక్టర్ సలహాలు, అవసరమైన చికిత్స తీసుకోవాలి.
మధుమేహం రాగముయందే మన శరీరంలో కొన్ని మార్పులు వస్తాయి. వాటిని జాగ్రత్తగా గమనిస్తే మధుమేహం మనపై దాడి చేయడానికి ముందే దాన్ని అదుపు చేసుకొనే వీలుంటుంది. మధుమేహం వచ్చేందుకు ముందు మనలో కనిపించే లక్షణాలు ఏమిటో చూద్దాం.
* మామూలుగా కన్నా ఎక్కువగా ఆకలి, దాహం వేస్తుంది.
నీరసం, ఏ చిన్న పనిచేసినా త్వరగా అలసిపోవడం, బరువు తగ్గిపోతారు. తరచూ మూత్రం రావడం, తల బరువేసినట్లు వుంటుంది. కాళ్ళ బరువుగా ఉండటం, ਬ੬ తిమ్మిర్లు, మంటలు వస్తాయి. చిన్న అక్షరాలు కనిపించవు. గాయాలైతే ఓ పట్టాన మానవు.
(23)
ఈ లక్షణాలు మీలో కనిపిస్తుంటే దాన్ని మధుమేహం కావచ్చునని అనుమానించి వైద్యుణ్ణి సంప్రదించాలి.
కొన్ని జాగ్రత్తలు :
చక్కెర వ్యాధి ఉన్నదని వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయిందనుకుందాం. చక్కెర స్థాయి మామూలు కంటే కొంచెం ఎక్కువగా ఉంటే.. ఆహార నియమాలు పాటించడం, వ్యాయామం ద్వారా అదుపు చేసుకోవచ్చు అలా అదుపు కాదని వైద్యులు భావిస్తే క్రమం తప్పకుండా టాబ్లెట్లు వేసుకోవాల్సి వస్తుంది. మధుమేహం టాబ్లెట్లు ఒకసారి ప్రారంభిస్తే వైద్యులు వద్దనేంత వరకు వాటిని క్రమం తప్పకుండా వాడుతూనే ఉండాలి. అప్పటికి కూడా మధుమేహం అదుపులోకి రాకపోతే ఇన్సులిన్ తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. కొందరిలో ముందుగా ఏ లక్షణం కనిపించకుండానే మధుమేహం రావచ్చు.
40 ఏళ్ల వయసు దాటిన నుండి ఏటా పరీక్షలు చేయించుకోవడం మేలు. వ్యాధికి కారణమైన లక్షణాలు అందరిలో కనిపించవు. వాటిలో ఏ රිද්යාත්රී පද්රිටට కనిపించినా వెంటనే ఫిజీషియన్ను సంప్రదించాలి. పరీక్ష చేయించుకోవాలి.
* ఆహార, వ్యాయామాల ద్వారా మధుమేహాన్ని అదుపు చేయడం ఎంతో కాలం సాధ్యం కాకపోవచ్చు. మొదట తగ్గినా, ఆ తరువాత కొన్నాళ్ళకు చక్కెర శాతం మళ్ళీ పెరిగిపోవచ్చు. అప్పడు తొలుత కనిపించిన లక్షణాలే మళ్ళీ కనిపిస్తాయి. ఆహార నియమాలు, వ్యాయామంతో చక్కెర అదుపులోకి రానప్పుడు మాత్రలు కూడా తప్పనిసరి అవుతాయి. మాత్రలు వేసుకున్నా ఆహార నియమాలు, వ్యాయామాలు కొనసాగించాలి. ఆహార నియమాలు తెలుసుకోవడానికి డైటీషియన్ను సంప్రదించాలి. * కొన్ని సమయాల్లో ఆహార నియమాలు పాటిస్తూ మాత్రలు వేసుకుంటున్నా చక్కెర అదుపులో ఉండకపోవచ్చు. ఈ దశలో ఫిజీషియన్ను సంప్రదిస్తే మాత్రలను మార్చడమో లేదా వాటి మోతాదును పెంచడమో చేసారు.
అవసరమైతే ఇన్సులిన్ సూచిస్తారు. రోగి అవసరాన్ని అనుసరించి ఇన్సులిన్ యూనిట్లు నిర్ణయించాల్సి ఉంటుంది.
* మాత్రలు లేదా ఇన్సులిన్ తీసుకుంటూ ఆహారనియమాలు, వ్యాయామం క్రమబద్ధంగా కొనసాగిస్తున్నా ఒక్కోసారి కొందరిలో చక్కెర అదుపులోకి రాక
పోవచ్చు. దీనివల్ల ఇతర సమస్యలతోపాటు కిడ్నీలు, కళ్ళ, మెదడు, గుండె వంటి ప్రధాన భాగాల్లో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. ఈ స్థితిలో ఎండోక్రినాలజిస్టును సంప్రదించాలి. వారి సలహా ప్రకారం సూచించిన పరీక్షలు చేయించుకుని, చికిత్స కొనసాగించాలి.
మధుమేహం రాకుండా పంచసూత్రాలు
1. సంపూర్ణ జీవనం : క్రమబద్ధమైన జీవనశైలిని అలవరుచుకోవటం వల్ల నిత్యజీవితంలో ఒత్తిడి తగ్గటమే కాదు. శారీరక, మానసిక ఆరోగ్యమూ సొంతమవుతుంది. దీనివల్ల మధుమేహాన్ని నివారించుకోవటంతోపాటు, ఆధునిక జీవనశైలి కారణంగాతలెత్తే జబ్బుల్ని రాకుండా చూసుకోవచ్చు. 2. వ్యాయామం, యోగా : జాగింగ్, వేగంగా నడవటం, సైక్లింగ్, స్విమ్మింగ్వంటి వ్యాయామాలతో పాటు యోగాసనాలు, ధ్యానం చెయ్యటం వల్ల
మంచి ఫలితాలు ఉంటాయి.
3. పోషకాహారం : పురుగు మందులూ, రసాయన ఎరువులు లేకుండా సేంద్రియ ఎరువులతో పెంచిన ఆహారపదార్థాల్ని తీసుకోవటం మంచిది. తాజా పచ్చి కూరగాయ ముక్కలు, మొలకెత్తిన గింజలు, పండూ, అవసరమైనన్ని ద్రవాలూ తీసుకోవాలి. ఏ ఆహార పదార్థాన్నైనా బాగా నమిలి తినటం ముఖ్యం. చక్కెర, ఉప్ప, వేపుళ్లను పరిహారించడం మంచిది
4. బరువు చూసుకోండి : ఎత్తుకు తగినంత బరువు ఉంటే ఆత్మవిశ్వాసం పెరగటమే కాకుండా చక్కని ఆరోగ్యమూ మీ సొంతమవుతుంది. అధిక బరువు ఎన్నో జబ్బులకు దారితీస్తుంది. గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులు వచ్చే అవకాశం తగ్గుతుంది.
5. క్రమం తప్పకుండా పరీక్షలు : క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయిస్తుంటే మధుమేహ సమస్యను ప్రారంభదశలోనే గుర్తించటమే కాకుండా సరైన విధంగా నియంత్రించుకోవచ్చు. తరచూ వైద్య పరీక్షలు చేయించే అలవాటు- పలు రకాల జబ్బుల్ని ముందుగానే గుర్తించటంతోపాటు, మధుమేహం విషయంలో మరింత కచ్చితంగా ఉపయోగపడుతుంది.
No comments:
Post a Comment