కాలేయం :
కాలేయానికి కొవ్వు ; దీర్ఘకాలం మధుమేహం నియంత్రణలో లేనివారిలో కాలేయానికి కొవ్వు పట్టే అవకాశం (ఫ్యాటీ లివర్, చాలా ఎక్కువ. దీనివల్ల హెపటైటిస్, దాని నుంచి లివర్ గట్టి పడిపోయి సిరోసిస్ లోకీ వెళ్లవచ్చు, అందుకే మధుమేహం లో హెపటైటిస్-బి, ఆల్కహాల్ అలవాటు వంటివేమీ లేకున్నా కూడా సిరోసిస్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది, దీనివల్ల లివర్ పూర్తిగా దెబ్బతిని ప్రమాదకర స్థితి తలఎత్తుతుంది
ఏం చేస్తారు ? :
దీన్ని ముందుగా గుర్తించటం అవసరం. వీరికి అపుడపుడు పొత్తికడుపు ఆల్రాసౌండ్ లివర్ ఎంజైముల పరీక్షలు చేయిస్తుండటం మంచిది. ఈ పరీక్షల్లో లివర్ వద్ద కొవ్వు చేరిందని తేలినా, ఎంజైముల్లో తేడాలున్నా దాన్ని ఏమాత్ర నిర్లక్ష్యం చెయ్యకుండా చికిత్స చెయ్యాలి. ఉర్సిడోడీఆక్సీకోలిక్ యాసిడ్ మొదలైన మందులతో చికిత్స శారీరక వ్యాయామం సిఫారసు చేస్తారు.
వీటితో కాలేయం కొవ్వు తగ్గేలా చూసుకోవాలి.
No comments:
Post a Comment