సుఖ నిద్ర లేకపోతే డయాబెటిస్
నిద్ర సరిగా పోకుండా నిర్లక్ష్యం చేసేవారికి డయాబెటిస్ త్వరగా సోకే ప్రమాదముంది. మూడు రోజులు వరుసగా తగినన్ని గంటలు నిద్రలేకపోతే, శరీరంలో వచ్చే మార్పులలో
ముఖ్యమైనది- రక్తంలో గూకోజ్ నియంత్రణగా గుర్తించారు. ఆ నియంత్రణ వ్యవస్థలో లోపం ఏర్పడటంతో షుగర్ జబ్బు వస్తుంది. బలవంతంగా నిద్రను అదిమిపెట్టి రాత్రుళ్లు ఎక్కువసేపు మెలకువతో ఉండేవారు, ముఖ్యంగా చదువుకునే పిల్లలు గుర్తించుకోవాల్సిన విషయం. అయితే వయసులో ఉండగా దీని ప్రభావం వెనువెంటనే కనిపించక పోవచ్చు. కానీ భవిష్యత్తులో ఇబ్బంది కలిగించే ప్రమాదముంది. ఇక డయాబెటిస్ లక్షణాలు ఇప్పటికే కనిపించినవారు నిద్ర విషయంలో తగు జాగ్రత్తలు వహించాలి.
దీనివలన హఠాత్తుగా రక్తంలో చక్కెరలు తారా స్థాయికి చేరి రోగిని కోమాలోకి తీసుకెళ్ళే ప్రమాదముంది. కాబట్టి డయాబెటిస్ చికిత్సలో మందులు ,ఆహారం వ్యాయామం,తో పాటు నిద్ర కూడా ముఖ్యమైనది.
No comments:
Post a Comment