వెజిటెబుల్ స్టూ అన్నిరకముల కూరగాయల తో ముద్ద కూర
బూందీ పాలు పోసి కూర
కొబ్బరి పాలతో కూర
జున్ను ముక్కలతో పులుసు
లేత మొక్కజొన్నల తో పాలు పోసిన కూర
చిక్కుడుకాయ టమాటా కూర
చిక్కుడుకాయ - పాలు పోసి
చిక్కుడుకాయ - వంకాయ
గోరు చిక్కుడు వేపుడు
చిన్న ఉల్లిపాయల తో పులుసు
తోటకూర కాడలు పిండి బెల్లం తో పులుసు
తోటకూర కాడలు - మసాలా తో
తోటకూర కాడలు - పాలు పోసి
తోటకూర పుల్ల కూర
పెసరపప్పు - తోటకూర కాడలు మసాలా తో కూర
దొండకాయ - గుత్తి కూర
దొండకాయ - కొబ్బరి వేపుడు
ఉల్లికారం తో దొండకాయ
కాలీఫ్లవర్ మసాలా తో వేపుడు
కంద వేపుడు
కంద కొబ్బరి వేపుడు
కంద చిప్స్
పప్పు - ములగ కూర
ములగ ఆకు - కొబ్బరి వేపుడు
నువ్వుల పొరుగు
పచ్చి బొప్పాయి - కొబ్బరితో కూర
పెసరపప్పు - పచ్చి బొప్పాయితో కూర
పచ్చిబొప్పాయితో కూర
బాంబినో సేమ్యాతో వెజిటబుల్ కట్లెట్
వెజిటబుల్ కట్లెట్ మరోరకం
వెజిటబుల్ కట్లెట్
వెజిటబుల్ కోఫా
పనీర్ పాలక్
పనీర్ కొబ్బరి అన్నం
వాంగీ బాత్
మరోరకం వాంగీబాత్
మసాలా అన్నం
వెజిటెబుల్ పలావ్
బెంగుళూరు మిర్చి బిరియాని (కాప్సికం)
చైనీస్ ఫ్రైడ్ రైస్ (వెజ్)
కొబ్బరి తురుముతో అన్నం
మీఠాఖానా
టొమాటో రసంతో అన్నం
చింతపండు పులిహోర
మామిడికాయ తురుముతో పులిహోర
దబ్బకాయ లేదా నిమ్మకాయ పులిహోర
సాంబార్ బాత్
పెసరపప్పుతో కిచిడి
ఆలూ బాత్
కొబ్బరి పొంగలి
ఉప్పొంగల్
చక్రపొంగలి
దద్దోజనం
సేమియాతో దద్దోజనం
మాంసాహారపు వంటకాలు
మాంసం వేపుడు
మాంసం పులుసు
మాంసం - చింతచిగురు కూర
చుక్కకూర - మాంసం
మాంసం - వాక్కాయతో కూర
మాంసం మిరియాలపొడితో వేపుడు
నిమ్మరసంతో మాంసం కూర
చాప్స్ పిట్టమాంసం వేపుడు
పోర్క్ పులుసు
పోర్క్ వేపుడు
దాల్చా కోడి
ముద్దకూర
కోడి కుర్మా
కోడి వేపుడు
ఉల్లిపాయలేకుండా కోడి వేపుడు
కోడిపులుసు
తందూరి చికెన్
మరోరకం తందూరి చికెన్
చిల్లీ చికెన్
మరోరకం చిల్లీ చికెన్
జింజర్ చికెన్
ఆయిల్ లేకుండా కోడికూర
కోడికోడిగానే వేపుడు
బోన్లెస్ చికెన్ ఫ్రై
చికెన్ - 65
ఆయిల్ లేని షేరువా
చైనీస్ నూడిల్స్ (నాన్ - వెజిటేరియన్)
కైమా కోఫ్తా
కైమా కట్లెట్
కైమా వేపుడు
కైమా ముద్దకూర
కైమా ఉండలు
కైమా కబాబ్
కైమా కబాబ్
పచ్చి కైమా ఉండలు
కైమా షామీ
మరోరకం కైమా
కోఫ్తా కైమా -
సేమ్యా కట్లెట్
లివర్ పులుసు (కార్టం)
లివర్ వేపుడు
చేప పులుసు
మరోరకం చేపలపులుసు
చేప కుర్మా
చేప ముద్దకూర
చేప కట్లెట్ చేప వేపుడు
చేపచేపగానే వేపుడు
సొరచేప వేపుడు
కొఱమేను చేప పిడుపు
బొమ్మిడాయిలు - చింతకాయ వేపుడు
రొయ్యల వేపుడు
రొయ్యల ముద్దకూర
రొయ్యల కట్లెట్
రొయ్యల కుర్మా
రొయ్యల కబాబ్
పీతల వేపుడు
పీతల పులుసు
కోడిగ్రుడ్లు - పాలుపోసికూర
కోడి గుడ్ల వేపుడు
కోడి గుడ్ల పులుసు
కోడి గుడ్ల బజ్జీ లు
కోడిగుడ్లు - జున్ను కూర
పచ్చి మాంసం తో బిరియాని
నవరంగ్ బిరియానీ
బిర్యాని మరోరకం
బిర్యాని బోన్లెస్ చికెన్ బిర్యాని
పచ్చిరొయ్యల పలావ్
కైమా పలావ్
బాంబినో సేమ్యా - కైమాతో పలావ్
ఎగ్ ఫ్రైడ్ రైస్
మొగలాయీ బిర్యాని
ధంకా మురిగి
రసాలు - సాంబార్లు
సాంబారు
ఉలవచారు
టమాటో చారు
మిరియాలు చారు
పప్పునీళ్ళతో చారు
నిమ్మకాయ చారు
పప్పు పులుసు
పెసరపప్పు పులుసు
మజ్జిగపులుసు
పప్పు కట్టు
మెంతిపప్పు
నారింజకాయ పప్పు
పొడులు -కారాలు
కారప్పొడి
పొదీనాకారం
శెనగపప్పు కారం
కందిపొడి
కొబ్బరికారం
కర్వేపాకు కారం
నువ్వులపొడి
చింతచిగురుపొడి
ధనియాల కారం
ఇడ్లి కారం నిమ్మకాయ కారం మరో రకం నిమ్మకాయ కారం
మసాలాపొడి
మరోరకం మసాలాపొడి
ఆమ్ చూర్
రోజువారీ పచ్చళ్ళు
వేప పువ్వు పచ్చడి (ఆంధ్రుల ఉగాదిపచ్చడి)
కొబ్బరికాయ పచ్చడి
కొబ్బరి - మామిడికాయ పచ్చడి
రోజు వారి గోంగూర పచ్చడి
చింత కాయ - కొబ్బరి పచ్చడి
చింతచిగురు - కొబ్బరి పచ్చడి
నిమ్మరసంతో కొబ్బరి పచ్చడి
కందిపప్పు - కొబ్బరి పచ్చడి
వంకాయ బజ్జీ
వంకాయ - నిమ్మరసం పచ్చడి
వంకాయ - చింత కాయ పచ్చడి
వంకాయ - దోసకాయ పచ్చడి
పచ్చి దోసకాయ పచ్చడి సొరకాయ బజ్జీ
సొరకాయ పెరుగు పచ్చడి
కంద పచ్చడి
బీరకాయ పచ్చడి
బీరకాయ తొక్క (చెక్కు) పచ్చడి
టమాటా పచ్చడి పచ్చి
మామిడికాయ పచ్చడి
మామిడికాయ తురుము పచ్చడి
మామిడి చిగురు పచ్చడి (ఎర్రగా ఉండే మామిడి చిగురు ఆకు)
పొట్లకాయ పెరుగు పచ్చడి
అరటికాయ పెరుగు పచ్చడి
కేరట్ పెరుగు పచ్చడి
చిలకడ దుంపల పచ్చడి
కర్వేపాకు పచ్చడి
వెలగపండు పచ్చడి
నోరూరించే నిలవ పచ్చళ్ళు
ఆవకాయ ఆవకాయ - ఆవపిండి, నూనే లేకుండా ఆవకాయ బెల్లంతో నిల్వ పచ్చడి
గోంగూర నిల్వ పచ్చడి
నిమ్మకాయ నిల్వ పచ్చడి
కొబ్బరి నిల్వ పచ్చడి
మామిడి అల్లం నిల్వ పచ్చడి
చిలకడ దుంపలు - మామిడికాయ పచ్చడి
(మొరంగడ్డ) వంకాయ నిల్వ పచ్చడి
ములక్కాడల నిల్వ పచ్చడి
దొండకాయ నిల్వ పచ్చడి
బంగాళదుంప నిల్వ పచ్చడి
టమాటో నిల్వ పచ్చడి
కాకరకాయ నిల్వ పచ్చడి
కాకరకాయ నిల్వ పచ్చడి (చింతపండుతో)
కాకరకాయ - మామిడికాయ పచ్చడి (నిల్వ పచ్చడి)
చింతకాయ నిల్వ పచ్చడి
పండు మిరపకాయలు - చింతకాయ నిల్వ పచ్చడి
ఉసిరికాయ నిల్వ పచ్చడి
ఉసిరికాయ కాయలుగానే నిల్వ పచ్చడి
కాలిప్లవర్ పచ్చడి
కోడి మాంసం నిల్వ పచ్చడి
టిఫిన్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడే చేసుకొనేవి
మామూలు ఇడ్లీ కంచి ఇడ్లీ చిత్తూరు ఇడ్లీలు దోసెలు - కొన్ని రకాలు ఆపాలు ఆపాలు - మరో రకం రవ్వ దోశె స్పాంజి దోశ మరోరకం స్పాంజి దోనె పెసరట్టు మినప కుడుములు మినప రొట్టె గోధుమ రవ్వతో మసాలా ఉప్మా బొంబాయి రవ్వ - టొమాటో ఉప్మా మినప గారెలు
పెరుగు గారెలు (తైర్ వడ) శెనగపప్పు - మినప పప్పులతో గారెలు శెనగపప్పు, మినప పప్పు, పెసర పప్పులతో గారెలు సగ్గు బియ్యం వడ కేబేజి వడ అలసంద వడ (బొబ్బర్లు) అలసంద మసాలా వడ
శెనగపప్పు మసాలా వడ శెనగనూకతో వడలు మామూలు పకోడి పుల్ల పకోడి జీడిపప్పు మసాలా పకోడి శెనగపప్పు పకోడి వెజిటెబుల్ పకోడి మైదా బోండా మైసూర్ బోండా మరోరకం ఆలూ బోండా మైదా - సగ్గు బియ్యం బోండా బజ్జీ లు పచ్చి మిరపకాయ బజ్జీ లు సమోసా సగ్గు బియ్యం కిచిడీ అడ విడియాపం. విడియాపం మరోరకం కొబ్బరి రొట్టె గుంట పొంగడాలు ఉప్పు పిండి ఆలూబ్రెడ్ రోల్స్ చైనీస్ నూడిల్స్ (వెజిటేరియన్) పుట్టు (కేరళ వంట) 'టూ కేరళ వంట)
పెసరపప్పు సిరియాళీ మరమరాలు ఉగ్గాణి కచోరి జొన్నపిండితో పుల్కా రాగిపిండితో దోసెలు జొన్నపిండి, శెనగపిండితో పకోడా పంజాబీ బోలె అటుకులు పాటోళి బాంబినో సేమ్యా, సగ్గు బియ్యంతో కిచిడి బాంబినో సేమ్యా, పెసరపప్పుతో కిచిడి బాంబినో సేమ్యతో విడియాపం
నిలువ టిఫిన్స్ సగ్గు బియ్యం జంతికలు (మురుకులు) బియ్యం, మినప పప్పు, వేయించిన శెనగపప్పుతో జంతికలు (మురుకులు) బంగాళ దుంపలతో జంతికలు (మురుకులు) శెనగపిండితో జంతికలు బియ్యం పిండితో జంతికలు వేరుశెనగ పప్పుతో జంతికలు జొన్నపిండితో జంతికలు మినప్పిండితో జంతికలు మినప పప్పుతో జంతికలు పెసరపప్పుతో జంతికలు నాలుగు రకాల పప్పులతో జంతికలు మరోరకం మినప పప్పు జంతికలు
బియ్యం పిండి - మైదా చెక్కలు
బియ్యం పిండితో చెక్కలు
మరోరకం గవ్వలు మైదా - బియ్యంపిండితో మణుగు పువ్వులు కారప్పూస కారపు బూందీ నిమ్కీలు చేగోడీలు మరోరకం చేగోడీలు చెక్క పకోడి వెన్నపూస పకోడి గట్టి పకోడి శెనగపప్పు మసాలా పకోడి గులాబీ పువ్వులు మిక్చర్ మైదా చేగోడీలు పెసరపప్పుతో మరోరకం చెక్కలు మైదాపిండితో చెక్కలు మైదా బియ్యంపిండి చిప్స్ అటుకులు (మహారాష్ట్ర పద్దతి) కారంవెన్న ఉండలు
స్వీట్స్ గులాబ్ జామ్ పాలపౌడర్తో గులాబ్ జామ్ మడత కాజూ మరోరకం కాజూ జిలేబి
జాంగ్రీ బాదుషా గప్ప్లు మైసూర్ పాక్ బూందీ లడ్డూలు బెల్లపు లడ్డు రవ్వ లడ్డు పూరీ లడ్డు బందరు లడ్డు లేక తొక్కుడు లడ్డు కొబ్బరి బర్పీ రవ్వ -- కొబ్బరి బర్పీ కజ్జికాయలు కోవా కజ్జికాయలు జీడిపప్పు పాకం గవ్వలు. మైదా చిప్స్ బాంబినో సేమ్యాతో బొబ్బట్లు బాంబినో సేమ్యా - బొంబాయి రవ్వతో లడ్డు వెన్నప్పాలు బెల్లం పాయసం చలిమిడి పెసరపప్పుతో హల్వా గుమ్మడికాయ హల్వా బూడిద గుమ్మడికాయ హల్వా సొరకాయ (ఆనపకాయ) హల్వా కేరట్ హల్వా
శెనగపప్పు హల్వా కరాచీ హల్వా సగ్గుబియ్యం హల్వా కొబ్బరి హల్వా మైదా హల్వా బాదం హల్వా కోవాకలాకండ్ కోవా బిళ్ళలు కొబ్బరి కోవా రవ్వ కేసరి స్వీట్ బ్రెడ్ స్లైసులు పాలపూరీ పూర్ణాలు లేక బూరెలు ప్రసాదం బూరెలు సగ్గుబియ్యం బూరెలు పెసరపప్పు బూరెలు వేరుశెనగపప్పు ఉండలు వేరుశెనగపప్పు చెక్కలు కొబ్బరి అరిశెలు మరోరకం కొబ్బరి అరిశెలు మరోరకం కొబ్బరి బూరెలు బొబ్బట్లు ప్రసాదం బొబ్బట్లు బాసంది గోధుమ సున్ని ఉండలు పాల తాలికలు
* * *'H' -
ప్రసాదం మరియొక ప్రసాదం సగ్గుబియ్యం పాయసం పేణీలు గొల్లభామ మిల్క్ మెయిడ్తో స్వీట్ అజ్మీర్ కళాఖండ్ అటుకుల ఉండలు కుర్బానికా మీఠా మరోరకం కుర్బానికా మీఠా నువ్వుల చిక్కి సేమ్యా హల్వా
రసగుల్లా
రసమలై తీపివెన్న ఉండలు పాలకాయలు వాముతో పాలకాయలు మరోరకం బెల్లం కొమ్ములు బొబ్బట్లు (హూళిగలు)
జామ్స్, జెల్లీస్, డ్రింక్స్ మ్యాంగో జ్యూస్ మ్యాంగో జ్యూస్ (పండ్లతో) పన్నా లెమన్ జ్యూస్ ద్రాక్ష జ్యూస్ (నల్లటి ద్రాక్ష) బత్తాయి లేదా కమలా పళ్ళ రసం యాపిల్ జామ్
మ్యాంగోజామ్ (తోతాపురి) యాపిల్ జెల్లి టమాటో జామ్ జామపండ్ల జామ్ పైనాపిల్ జామ్ పైనాపిల్ జెల్లి అరటిపండ్ల జామ్ నారింజపళ్ళు లేదా కమలాపళ్ళ జామ్ పుల్లనిమ్మపండ్ల జెల్లి కేరట్ ఖీర్ టమోటా సాస్
ఐస్క్రీమ్స్, పుడ్డింగ్స్, కేక్స్ రైస్ పుడ్డింగ్ బాంబినో సేమ్యాతో ఐస్క్రీమ్ మరోరకం ఎగ్ పుడ్డింగ్ మరోరకం ఐస్క్రీమ్ కుల్ఫీ (ఐస్క్రీం) కస్టర్డ్ ఐస్క్రీమ్ మ్యాంగో ఐస్క్రీమ్ బాదం ఐస్క్రీమ్ గొల్లభామ పాలతో ఐస్క్రీమ్ ఫ్రూట్ సలాడ్ బాదం గీర్. ఐస్క్రీమ్ కేక్ లేదా వెరైటీ కస్టర్డ్
టీ
క
ఇO
c
కేక్స్
మరోరకం కేక్
నీమ్ కేక్ చాక్లెట్ కేక్ కేక్ - 1 కేక్ - 2 కేక్ - 3 స్నోబాల్ పుడ్డింగ్ బ్రెడ్ పుడ్డింగ్ గడ్డి జున్ను (చైనాగ్రాస్ పుడ్డింగ్) వెన్న బిస్కెట్స్ మైదా - శెనగపిండితో బిస్కెట్స్ బనానా మిల్క్ చోప్రా (పుడ్డింగ్) ఎగ్ కస్టర్డ్ పుడ్డింగ్ యాపిల్ కస్టర్డ్
వడియాలు - అప్పడాలు సగ్గుబియ్యం వడియాలు బొంబాయి రవ్వతో వడియాలు మినపపిండి వడియాలు పెసరపప్పుతో వడియాలు బియ్యపుపిండి సగ్గుబియ్యం వడియాలు మరోరకం పిండి వడియాలు కందిపప్పుతో అప్పడాలు మినప పప్పుతో అప్పడాలు మినప పప్పు, పెసరపప్పుతో అప్పడాలు
సూపులు బోన్ సూపు టమాటో సూపు
వెజిటేబుల్ సూపు కారన్ సూపు ఉల్లిపాయల సూపు
తలనూనెలు, గృహిణులకు కొన్ని చిట్కాలు ఉసిరికాయ తలనూనె ఎర్రని ముద్దమందార నూనె అన్ని రకముల పువ్వులతో నూనె సున్నిపిండి మంచిగంధంతో కాటుక మామిడి చిగురురంగు కుంకుమ తయారుచేయు విదానం గృహిణులకు కొన్ని చిట్కాలు
అందానికి కొన్ని చిట్కాలు ప్రముఖ పత్రికల సమీక్షలు
బీరకాయ గుత్తి కూర కావలసినవి : చిన్న సైజు బీరకాయలు 1/2 కిలో
ఆవాలు 1/2 టీ స్పూను ఉల్లిపాయలు 2
జీలకర్ర 1/2 టీ స్పూను ఉప్పు, పసుపు, కారం తగినంత
వెల్లుల్లి రేకలు 6. చింతపండు చాలినంత
మినపప్పు 1/2 టీ స్పూను కొత్తిమీర కొద్దిగా
శెనగపప్పు 1/2 టీ స్పూను కర్వేపాకు రెండు రెమ్మలు
నూనె 8 టీ స్పూన్లు ఎండుమిర్చి 4 చేయు విధానము :
బీరకాయలకు చెక్కు తీయకుండా తొడిమలు తీసేసి 4 పక్షాలుగా చేసి కడిగి ప్రక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, జీలకర్ర, వెల్లుల్లి మెత్తగా నూరి పెట్టుకోవాలి. ఉప్పు, పసుపు, కారం ఒక ప్లేటులో కలుపుకొని బీరకాయ పక్షాల్లో పెట్టాలి. ఈ బీరకాయల్లో చింతపండు రసం చిక్కగా పోసి బాగా ఉడికించాలి. పొయ్యిమీద గిన్నె పెట్టి నూనెపోసి కాగిన తర్వాత ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శెనగపప్పు, కర్వేపాకు వేసి, రుబ్బి ఉంచుకున్న ఉల్లిపాయముద్దను వేసి ఎర్రగా వేపాలి. వేగిన తర్వాత, ఉడికించిన బీరకాయలను నెమ్మదిగా అందులో వేసి గిన్నెను అటూ ఇటూ కుదపాలి. గరిటెతో పక్షాలు చీలిపోతాయి గనుక. ఇదే విధంగా దొండకాయలతో కూడా చేసుకోవచ్చు.
బీరకాయ మసాలా కూర
బీరకాయ మసాలా కూర కావలసినవి : బీరకాయలు 1/2 కిలో
ఉల్లిపాయలు 2 నూనె 4 టీ స్పూన్లు
వెల్లుల్లి రేకలు 4 కొత్తిమీర కొద్దిగా
అల్లంముక్క చిన్నది
ఉప్పు, కారం, పసుపు తగినంత
ధనియాలు 1 టీ స్పూను లవంగాలు 2
యాలక్కాయలు 2 దాల్చినచెక్క ముక్కలు 2 చేయు విధానము :
బీర కాయలు చెక్కుతీసి చేదులేకుండా చూసుకొని, చిన్న ముక్కలు కోసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలను సన్నగా తరిగి పెట్టుకోవాలి. పొయ్యిమీద గిన్నె పెట్టి నూనెపోసి, ఉల్లిముక్కలు వేసి, వేగిన తర్వాత కోసి ఉంచుకున్న బీరకాయ ముక్కలు వేసి, ఉప్పు, పసుపు, కారం వేసి, అల్లం, వెల్లుల్లినూరిన ముద్దను వేసి కొద్దిగా నీరుపోసి ఉడికించాలి. ధనియాలు, లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క పొడిచేసి పెట్టుకొని బీరకాయ ముక్కలు బాగా ఉడికిన తర్వాత పైన చల్లి, కొత్తిమీర సన్నగా తరిగి వేసి, బాగా యిగిరిన తర్వాత దించుకోవాలి. కొబ్బరి బీరకాయ పాలు పోసికూర కావలసినవి : బీరకాయలు 1/2 కిలో
కొబ్బరి చిప్ప 1 చిక్కనిపాలు 1/2 గ్లాసు
ఉప్పు, కారం, పసుపు తగినంత ఆవాలు 1/2 స్పూను
ఎండు మిర్చి 4 కొత్తిమీర కొద్దిగా
కర్వేపాకు రెండు రెమ్మలు చేయు విధానము :
బీరకాయను చెక్కుతీసి, చేదులేకుండా చూసి సన్నగా ముక్కలు తరిగి పెట్టుకోవాలి. కొబ్బరి చిప్పను కడిగి తురుముకోవాలి పోయ్యిమీద గిన్నె పెట్టి నూనెపోసి కాగిన తర్వాత, ఆవాలు, ఎండుమిర్చి, కర్వేపాకు వేసి వేగిన తర్వాత బీరకాయ ముక్కలువేసి, ఉప్పు, పసుపు, కారం వేసి, కొంచెం నీరుపోసి ఉడికించుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత, కొబ్బరి వేసి నీరంతా యిగిరేవరకు ఉ (కించి పాలు పొయ్యాలి. కొత్తిమీర వేసి దించుకోవాలి.
వంకాయ వేపుడు. కావలసినవి : పొడుగు వంకాయలు 1/2 కిలో
వెల్లుల్లి రేకలు 6 జీలకర్ర 1 టీ స్పూను
నూనె 10 టీ స్పూన్లు ఉప్పు, కారం, పసుపు తగుమాత్రం చేయు విధానము :
వంకాయలను శుభ్రంగా కడిగి తొడిమ దగ్గర నుండి చివరి వరకు చాకుతో నాటు పెట్టుకోవాలి. వంకాయలన్నిటిని ఇదే విధముగా నాటు పెట్టుకోవాలి. తర్వాత జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు మెత్తగా పొడిచేసి, తీసేముందు వెల్లుల్లి రేకలు వేసి, దంచి తీసుకోవాలి. దీనిని, ఈ పొడిని, వంకాయల మధ్యలో పట్టించాలి. పొయ్యిమీద బాణలి పెట్టి నూనెపోసి కాగిన తర్వాత ఈ వంకాయలను వేసి కాయలు విడిపోకుండా సన్నని సెగమీద వేపాలి. వేగిన తర్వాత దించుకోవాలి.
గుత్తివంకాయ పులుసు కావలసినవి : లేతవంకాయలు 1/2 కిలో నూనె 8 టీ స్పూను ఉల్లిపాయలు 6)
ఉప్పు, కారం, పసుపు తగినంత పచ్చిమిర్చి 6
బెల్లం కొంచెం వెల్లుల్లి 6 రేకలు
కొత్తిమీర కొద్దిగా ధనియాలు 1 టీ స్పూను
ఆవాలు, మెంతులు జీలకర్ర 1/2 టీ స్పూను
మినపప్పు కొంచెం కొంచెం చింతపండు కొంచెం
కరివేపాకు ఎండు మిరపకాయలు 2
చేయు విధానము :-
లేతవంకాయలు చిన్న సైజులో తీసుకుని గిన్నెలో నీళ్ళుపోసుకుని, వంకాయలు పుచ్చులు లేకుండా చూసుకొని నాలుగు పక్షాలుగా గుత్తిలాగ కోసి నీళ్ళలో వేయ్యాలి. ఉల్లి పాయలు ముక్కలు కోసి ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి వేసి మెత్తగా రుబ్బి తీసుకోవాలి. పచ్చిమిర్చి పొడవుగా కోసి ఉంచుకోవాలి. ఈ రుబ్బిన ముద్దలో, ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలిపి వంకాయ పక్షాల్లో - పెట్టాలి. అన్నీ ఆ విధంగా చేసిన తర్వాత, పొయ్యిమీద గిన్నె పెట్టి నూనెపోసి ఆవాలు మెంతులు, మినప్పప్పు కర్వేపాకు వేసి వేగినతరువాత వంకాయలు వేసి కొంచెం సేపు మూత పెట్టాలి. చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి. తరువాత వంకాయలలో ఆనానబెట్టిన నీళ్ళుపోసి కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఉడికిన తరువాత చింతపండు పులుపును, మీకు కావలసినంత వేసుకుని, బెల్లంవేసి కొత్తిమీర సన్నగా తరిగివేసి, కొంచెం గుజ్జుగా అయిన తరువాత దించుకోవాలి.
వంకాయ బగారా కావలసినవి : లేత చిన్నవంకాయలు 1/2 కిలో
చింతపండు నిమ్మకాయంత కొబ్బరిముక్క చిన్నది . .
యాలకులు 2 పచ్చిమిర్చి 4
లవంగాలు 2 . ఉల్లిపాయలు 4
దాల్చినచెక్క ముక్కలు 2 వేరు శెనగగింజలు 1/2 కప్పు
గసగసాలు 2 టీ స్పూన్లు అల్లం చిన్నముక్క
నూనె 8 స్పూన్లు వెల్లుల్లి రేకలు 6.
ఉప్పు, కారం, పసుపు తగినంత ధనియాలు 2 టీ స్పూన్లు
కొత్తిమీర పది రెమ్మలు కర్వేపాకు రెండు రెమ్మలు
చేయు విధానము :
వేరు శెనగపప్పు వేయించి పొట్టుతీసి పెట్టుకోవాలి. రోలు శుభ్రంగా కడిగి ఈ పప్పును, మసాలాసామాను, కొబ్బరి ముక్క వేసి అల్లం, వెల్లుల్లి కూడా వేసి నీళ్ళు చల్లి మెత్తగా రుబ్బి ఉప్పు, పసుపు, కారం వేసి మెత్తగా కలిపి ఉంచుకోవాలి. రోలు కడిగినప్పుడు, నీళ్ళు తీసుకుని ఉంచుకోవాలి. వంకాయలను శుభ్రంగా కడిగి 4 పక్షాలుగా విడిపోకుండా కోసి పెట్టుకొని, ఓక్కొక్క వంకాయ పక్షాల్లో మధ్యలో, ఈ రుబ్బి ఉంచుకున్న ముద్దను పట్టించాలి. ఇదేవిధంగా, అన్ని వంకాయల పక్షాల్లో మసాలాముద్దను పట్టించి ఉంచాలి. పొయ్యిమీద బాణలి పెట్టి నూనె పోసి కాగిన తర్వాత, ఈ వంకాయలను బాణలిలోవేసి రోలు కడిగి తీసుకున్న నీరు, చింతపండు పులుసు, పోసి సన్నని సెగమీద ఉడికించుకోవాలి. - ఇగిరి పోయింతరువాత కొత్తిమీర వేసి దించుకోవాలి. ఇది చాలా రుచిగా ఉంటుంది.
వంకాయ - మసాలా కూర కావలసినవి : లేత చిన్న వంకాయలు 1/2 కిలో
నూనె 10 టీ స్పూన్లు ఉల్లిపాయలు 4
వెల్లుల్లి రేకలు 8 ధనియాలు 2 టీ స్పూన్లు
లవంగాలు 4 గసగసాలు 1 టీ స్పూన్లు
యాలకులు 4 కొబ్బరిముక్కలు చిన్నవి 3 అడు
దాల్చినచెక్క 4 చిన్న ముక్కలు అల్లం చిన్నముక్క
ఉప్పు, కారం, పసుపు తగినంత కొత్తిమీర తగినంత
జీలకర్ర 1/2 టీ స్పూను చేయు విధానము :
ఉల్లిపాయ సన్నగా ముక్కలు కోసి పెట్టుకోవాలి. రోలు శుభ్రంగా కడిగి మసాలా సామాను (అనగా యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు), కొబ్బరి,
అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయముక్కలు, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి, నీరు పోసి మొత్తం అన్నీ మెత్తగా రుబ్బి తీసుకోవాలి. వంకాయలను శుభ్రంగా కడిగి వంకాయను 4 పక్షాలుగా కోసి పెట్టుకోవాలి. అన్నీ ఈ విధంగా చేసుకోవాలి. వంకాయను చేతితో పట్టుకొని, ఈ రుబ్బి ఉంచుకున్న ముద్దను పట్టించాలి. అన్ని వంకాయల్లో ఇదే విధంగా పట్టించి ఉంచుకున్న తర్వాత పొయ్యిమీద బాణలి పెట్టి నూనెపోసి, ఈ వంకాయలను అందులో వేసి రోలు కడిగి తీసుకున్న నీరు, అందులో పోసి సన్నని సెగమీద మగ్గనివ్వాలి. ఇగిరిన తర్వాత కొత్తిమీర వేసి దించుకోవాలి.
వంకాయ పెరుగు కూర కావలసినవి : లేత వంకాయలు 1/2 కిలో
ఉల్లిపాయలు 2 పచ్చి మిర్చి 4
ఎండుమిర్చి 4 నూనె 5 టీ స్పూన్లు
ఉప్పు, కారం, పసుపు తగినంత చింతపండు కొంచెం
ఆవాలు 1/2 టీ స్పూను పెరుగు ఒక కప్పు
కర్వేపాకు రెండు రెమ్మలు కొత్తిమీర కొద్దిగా చేయు విధానము :
వంకాయలను శుభ్రంగా కడిగి, ముక్కలు కోసి పెట్టుకోవాలి. ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు తరిగి పెట్టుకోవాలి. పొయ్యిమీద గిన్నె పెట్టి నూనెపోసి కాగిన తర్వాత, పోపు సామాను వేసి ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగిన తర్వాత వంకాయ ముక్కలను వేసి, ఉప్పు, కారం, పసుపు వేసి వేపాలి. పెరుగులో చింతపండు పులుసువేసి ఈ వంకాయ ముక్కలో పోసి బాగా కలపాలి. పెరుగులో చింతపండు వేస్తే విరిగి పోదు. లేకపోతే పెరుగు ముక్కలు ముక్కలుగా అయిపోతుంది. ఉడుకుతున్నప్పుడు కొత్తిమీర తరిగివేసి గుజ్జుగా అయిన తర్వాత దీంచాలి.
గుత్తి వంకాయ కూర కావలసినవి : చిన్న సైజు లేత వంకాయలు 1/2 కిలో ఉల్లిపాయలు 3 వెల్లుల్లి రేకులు 6.
ఉప్పు, కారం, పసుపు తగినంత చింతపండు కొంచెం
నూనె 8 టీ స్పూన్లు జీలకర్ర 1 టీ స్పూను
ఆవాలు 1/2 టీ స్పూను మినపప్పు 1 టీ స్పూను
శెనగపప్పు 1 టీ స్పూను ఎండుమిర్చి 5, కొత్తిమీర కొంచెం
కర్వేపాకు రెండు రెమ్మలు చేయు విధానము :
వంకాయలను శుభ్రంగా కడిగి, 4 పక్షాలుగా గుత్తిలాగా కోసి ఉప్పు, కారం, పసుపు మూడు కలిపి, ఈ వంకాయ పక్షాల్లో పట్టించాలి. చింతపండు చిక్కగా పులుసు తీసుకొని, పొయ్యిమీద పెట్టి ఆ పులుసు ఉడుకుతున్నప్పుడు ఈ వంకాయలను అందులో వేసి సన్నని సెగమీద ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత, గరిటెతో కలిపితే పక్షాలు విడిపోతాయి, గాబట్టి, గిన్నెను అటూ యిటూ పట్టుకొని కుదపాలి. పులుసంతా ఇగిరిపోయి, వంకాయలు విడివిడిగా వస్తాయి. ఉల్లిపాయలు, వెల్లుల్లి రేకలు, జీలకర్ర మెత్తగా నూరి పెట్టుకోవాలి. పొయ్యిమీద గిన్నె పెట్టి, నూనెపోసి, మిగిలిన తిరగమోత (తాలింపు) సామానంతా వేసి, వేగిన తర్వాత నూరి ఉంచుకున్న ఉల్లిపాయముద్దను కూడా వేసి వేగిన తర్వాత వంకాయలను అందులోవేసి, కొత్తిమీర సన్నగా తరిగివేసి, సన్నని సెగమీద కాసేపు ఉడికించి దించాలి.
బంగాళదుంపల కూర్మా కావలసినవి : బంగాళాదుంపలు 1 కిలో
నూనె 6 టీ స్పూన్లు ఉల్లిపాయలు 4
కొత్తిమీర కొంచెం
పచ్చిమిర్చి 6 వెల్లుల్లి రేకలు 8 ఉప్పు, పసుపు, కారం తగినంత అల్లం చిన్న ముక్క కొబ్బరిముక్క చిన్నది. పుల్లటి పెరుగు 1 కప్పు మసాలా ఆకు కొంచెం చేయు విధానము :
జీలకర్ర 1 టీ స్పూను గసగసాలు 4 టీ స్పూన్లు ధనియాలు 2 టీ స్పూన్లు లవంగాలు 5 యాలకులు 5 దాల్చినచెక్కలు 5 జీడిపప్పు 4 ముక్కలు
బంగాళాదుంపలను శుభ్రంగా కడిగి ఉడికించి, ఉడికిన తర్వాత పైపొట్లంతా తీసి, మనకు కావలసిన సైజులో ముక్కలుకోసి ఉంచుకోవాలి. అల్లం, వెల్లులి, కొబ్బరి, గసగసాలు, ధనియాలు, జీలకర్ర ముద్దగా నూరి ఉంచుకోవాలి. పొయ్యిమీద గిన్నె పెట్టి నూనెపోసి కాగిన తర్వాత, మసాలా ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క, జీడిపప్పు వేసి వేగినతర్వాత, ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలువేసి అవికూడా వేగిన తర్వాత, కోసి ఉంచుకున్న బంగాళదుంప ముక్కలువేసి ఉప్పు, కారం, పసుపు నూరి ఉంచిన మసాలాముద్ద, పెరుగుగానీ మజ్జిగగానీ కలిపి, కొంచెం సేపు ఉంచిన తర్వాత, కొంచెం నీళ్ళుపోసి ఉడికించి, కొత్తిమీర వేసి దించుకోవాలి.
బంగాళదుంపల పులుసు కావలసినవి : బంగాళదుంపలు 1/2 కిలో -
ఉల్లిపాయలు 2 పచ్చిమిర్చి 41 వెలులిరేకలు 4. నూనె 4 టీ స్పూన్లు
అల్లం చిన్నముక్క చింతపండు నిమ్మకాయంత
ఉప్పు, పసుపు, కారం తగినంత మసాలాఆకు కొంచెం
లవంగాలు 2 యాలుకలు 2
దాల్చినచెక్కలు చిన్నవి 2
చేయు విధానము :
బంగాళాదుంపలు శుభ్రంగా కడిగి, చెక్కుతీసి, పెద్ద పెద్ద ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. ఉల్లి, పచ్చిమిర్చి సన్నగా పొడవుగా తరిగి పెట్టుకోవాలి. చింతపండు నీళ్ళుపోసి నానబెట్టాలి. పొయ్యిమీద గిన్నె పెట్టి, నూనెపోసి మసాలా సామానంతా వేసి, ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగిన తర్వాత, కోసి ఉంచుకున్న బంగాళాదుంప ముక్కలను వేసి, ఉప్పు, కారం, పసుపు వేసి కలపాలి. అల్లం, వెలుల్లి నూరిన ముద్దను గూడా అందులోవేసి కొంచెం నీళ్ళు పోసి మూత పెట్టాలి. ముక్కలు ఉడికిన తర్వాత, చింతపండు పులుసు చిక్కగా పిసికివేసి సన్నగా కొత్తిమీర తరిగివేసి ఉడికిన తర్వాత దించుకోవాలి.
బంగాళదుంపల వేపుడు కావలసినవి : బంగాళాదుంపలు 1 కిలో
ఉల్లిపాయలు 4 పచ్చిమిర్చి 6
ఎండుమిర్చి 10 వెల్లుల్లిరేకలు 6 -
నూనె 6 స్పూన్లు జీలకర్ర 1 టీ స్పూను
ఆవాలు 1 టీ స్పూను మినపప్పు 2 టీ స్పూన్లు
శెనగపప్పు 2 టీ స్పూన్లు కొత్తిమీర కొంచెం
ఉప్పు, పసుపు తగినంత చేయు విధానము :
బంగాళాదుంపలను శుభ్రంగా కడిగి, ఉప్పువేసి ఉడికించాలి. బాగా ఉడికిన తర్వాత, దించి పొట్టుతీసి మనకు కావలసిన సైజులో ముక్కలు కోసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి సన్నగా పొడవుగా ముక్కలుకోసి పెట్టుకోవాలి. 10 ఎండు మిరపకాయలు, జీలకర్ర మెత్తగ పొడికొట్టి తీసేముందు, వెల్లుల్లిరేకలువేసి మెత్తగా దంచి తీయాలి. పొయ్యిమీద బాణలి పెట్టి, నూనెపోసి, కాగిన తర్వాత ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు పోపు సామాను వేసి, వేగినతర్వాత కోసి ఉంచుకొన్న
బంగాళాదుంపముక్కల్ని వేసి, పసుపు, ఉప్పు వేసికొట్టి ఉంచుకొన్న పొడిజలి. కొత్తిమీర సన్నగా తరిగివేసి, బాగా వేగిన తర్వాత దించాలి.
బంగాళదుంప పిడుపు కావలసినవి : బంగాళాదుంపలు 1/2 కిలో
అల్లం చిన్నముక్కలు ఉల్లిపాయలు 2
గసగసాలు 1 టీ స్పూను లవంగాలు 2
ధనియాలు 2 టీ స్పూన్లు యాలకులు 2
ఉప్పు, కారం, పసుపు తగినంత దాల్చినచెక్కలు 2
నూనె 6 టీ స్పూన్లు కొబ్బరిముక్క చిన్నది
కర్వేపాకు, కొత్తిమీర కొంచెం వెల్లుల్లి రేకలు 4 చేయు విధానము :
బంగాళాదుంపల్ని మెత్తగా ఉడికించుకొని, పై పొట్టతీసి మెత్తగా చేతితో దుంపల్ని చిదిమి, పొడిలాగాచేసి పెట్టుకోవాలి. రోలు శుభ్రంగా కడిగి, మసాలా సామాన్లు, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి వేసి మెత్తగా రుబ్బి తీసుకొని, రోలు కడిగి నీళ్లుకూడా తీసుకోవాలి. పొయ్యిమీద బాణలి పెట్టి నూనెపోసి కాగినతర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసి, వేగిన తర్వాత, ఈ రుబ్బిన ముద్దను వేసి రోలు కడిగిన నీళ్ళనుకూడా పోసి, తడిలేకుండా ఎర్రగా వేగిన తర్వాత, ఈ బంగాళాదుంప పొడిని వేసి ఉప్పు, కారం, పసుపు చల్లి సన్నని సెగమీద ఉంచి, వేగనివ్వాలి. దించేముందు కొత్తిమీర వేసి, మూత పెట్టాలి.
బంగాళదుంప - మెంతికూర కావలసినవి : బంగాళాదుంపలు 1/2 కిలో
ఉల్లిపాయలు 2 మెంతికూర 50 రెమ్మలు
నూనె 8 టీ స్పూన్లు
10
ఉప్పు, కారం, పసుపు తగినంత
వెల్లుల్లి రేకలు 8 పచ్చిమిరపకాయలు 6 చేయు విధానము :
బంగాళాదుంప చెక్కుతీసి సన్నగా ముక్కలు కోసి పెట్టుకోవాలి. మెంతికూర సన్నగా తరిగి కడిగి పెట్టుకోవాలి. ఉల్లిపాయ, వెల్లుల్లి పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. పొయ్యిమీద బాణలి పెట్టి నూనెపోసి కాగిన తర్వాత ఉల్లి, వెల్లుల్లి, పచ్చిమిరప ముక్కలు వేసి ఎర్రగా వేగిన తర్వాత బంగాళాదుంప ముక్కలు, మెంతికూర, ఉప్పు, కారం, పసుపువేసి సన్నని సెగమీద ఉంచి అప్పుడప్పుడు గరిటెతో కలుపుతూ ఉండాలి. నీరు ఇగిరింతర్వాత దించుకోవాలి. ఆగాకరకాయ, బంగాళదుంప
మసాలా కూర కావలసినవి : ఆగాకరకాయలు 1/4 కిలో
వెల్లుల్లి రేకలు 4 బంగాళాదుంప 1/4 కిలో
నూనె 6 టీస్పూన్లు ఉల్లిపాయలు 2
అల్లం చిన్నముక్క పచ్చిమిర్చి 4
ఉప్పు, కారం, పసుపు తగినంత చేయు విధానము :
ఆగాకరకాయలు, బంగాళాదుంపలు చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకోవాలి. ఉల్లి, పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకోవాలి, అల్లం, వెల్లుల్లి నూరి పెట్టుకోవాలి. పొయ్యిమీద గిన్నె పెట్టి నూనెపోసి ఉల్లి పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేగిన తర్వాత కోసి ఉంచుకున్న ఆగాకరకాయ, బంగాళా దుంప ముక్కల్ని వేసి ఉప్పు, కారం, పసుపు వేసి, నూరి ఉంచిన అల్లం, వెల్లుల్లి ముద్దను వేసి కోద్దిగా నీరుపోసి సన్నని సెగమీద ఉడికించి పెట్టుకోవాలి. దగ్గర పడిన తర్వాత 1 స్పూను మసాలా పౌడరును వేసి ఇగిరిం తర్వాత కొత్తిమీర వేసి బాగా కలిపి దించుకోవాలి.
11
బంగాళదుంపలకూర - (పూరీకూరు
కావలసినవి : బంగాళాదుంపలు 1/4 కిలో ఉల్లిపాయలు 1 కిలో పచ్చిమిర్చి 6
ఆవాలు 1 టీ స్పూను మినప్పప్పు 2 టీ స్పూన్లు
జీలకర్ర 1/2 టీ స్పూను నూనె 3 టీ స్పూన్లు
కర్వేపాకు 2 రెమ్మలు శెనగపిండి 4 టీ స్పూన్లు
ఉప్పు, కారం, పసుపు తగినంత చేయు విధానము :
ఉల్లిపాయలను చక్రాల్లాగా కానీ, పొడవుగా కానీ కోసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి పొడవుగా కోసుకోవాలి. బంగాళాదుంపలకు చెక్కుతీసి కడిగి చిన్నముక్కలుగా కోసుకోవాలి. పొయ్యిమీద గిన్నె పెట్టి ఉల్లి, పచ్చిమిర్చి, బంగాళాదుంప ముక్కలు, చిటికెడు పసుపు, ఉప్పు, 1/2 స్పూను కారంవేసి 2 గ్లాసుల నీళ్ళుపోసి ఉడికించుకోవాలి. 1 కప్పు నీళ్ళల్లో శెనగపిండిని వేసి ఉండల్లేకుండా కలుపుకొని ఉల్లిపాయల్లో పోసి కొంచెం సేపు ఉడికించి దించుకోవాలి. పొయ్యి మీద బాణలి పెట్టి నూనెపోసి తాలింపు సామాను వేసి వేగాక కూరలో పోసి బాగా కలపాలి. ఇది పూరీ, చపాతీ, దోశెలలోకి ఎంతో రుచిగా ఉంటుంది.
క్యాబేజి - బంగాళదుంపల కూర కావలసినవి : క్యాబేజి 1/2 కిలో
పచ్చికొబ్బరి చిన్నముక్క ఉల్లిపాయలు 4 -
ధనియాలు 2 టీ స్పూన్లు పచ్చిమిర్చి 4న వెల్లుల్లిరేకలు 6 బంగాళాదుంపలు 1/4 కిలో
లవంగాలు 2 ఉప్పు, కారం, పసుపు తగినంత
నూనె 4 టీ స్పూన్లు కొత్తిమీర కొంచెం
కర్వేపాకు రెండు రెమ్మలు
12
చేయు విధానము :
క్యాబేజిని కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి. బంగాళాదుంపలు శుభ్రంగా కడిగి చెక్కుతీసి సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఉల్లి పచ్చిమిర్చి, ముక్కలు కోసి పెట్టుకోవాలి. ధనియాలు వేడిచేసి లవంగాలు వేసి పొడికొట్టి తీసేముందు వెల్లుల్లిరేకలువేసి దంచి తీసి పెట్టుకోవాలి. పొయ్యిమీద బాణలి పెట్టి నూనెపోసి కాగిన తర్వాత ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలువేసి, వేగిన తర్వాత, క్యాబేజీ, బంగాళాదుంప ముక్కలువేసి ఉప్పు, పసుపు, కారం వేసి, కొంచెం నీళ్లుజల్లి సన్నని సెగమీద మూతపెట్టి ఉంచాలి. కొబ్బరి ముక్కను దంచి పెట్టుకోవాలి. కూర బాగా ఉడికిన తర్వాత ఈ కొబ్బరిని జల్లి ధనియాల పొడినికూడా వేసి, కొత్తిమీర సన్నగా తరిగివేసి బాగా కలిపి దించుకోవాలి.
టమాటో, కాలీఫ్లవరు,
బంగాళదుంపల కూర
కావలసినవి : టమాటాలు 1/4 కిలో
బంగాళాదుంపలు 1/4 కిలో, కాలీఫ్లవర్ 1/2 కిలో
వెల్లుల్లిరేకలు 6. ఉప్పు, కారం పసుపు తగినంత
కొత్తిమీర కొంచెం ఉల్లిపాయలు 2
ధనియాలు 2 టీ స్పూన్లు పచ్చిమిర్చి 4
నూనె 3 టీ స్పూన్లు చేయు విధానము :
కాలిఫ్లవర్ పెద్ద ముక్కలుగా కోసుకొని, టొమేటో కావలసిన సైజులో కోసుకొని, బంగాళాదుంప చెక్కుతీసి, ముక్కలుకోసి పెట్టుకొని, ఉల్లి, పచ్చిమిర్చి పొడువుగా ముక్కలుకోసి పెట్టుకోవాలి. పొయ్యిమీద గిన్నె పెట్టి, నూనెపోసి, ఉల్లి పచ్చిమిర్చిముక్కలు వేసి, వేగిన తర్వాత ఈ మూడు రకాల ముక్కలను వేసి
13
ఉప్పు, కారం, పసుపు వేసి, కొంచెం నీళ్లు పోసి ఉడికేందుకు మూత పెట్టాలి. ధనియాలు వేడిచేసి పొడికొట్టి, తీసేముందు వెల్లుల్లి రేకలువేసి, మెతగదంచి తీసుకోవాలి. ముక్కలు ఉడికిన తర్వాత, కొట్టి ఉంచిన దనియాలపొడిని వేసి. కొత్తిమీర సన్నగా తరిగివేసి బాగా ఇగిరిన తర్వాత దించాలి.
బంగాళదుంపలతో చిప్స్ కావలసినవి : బంగాళాదుంపలు 1 కిలో
ఉప్పు, పసుపు, కారం, నూనె చేయు విధానము :
బంగాళాదుంపలు చెక్కు తీసి ఉంచుకోవాలి. ఒక గిన్నెలో నీళ్లు పోసి ఉప్పు, పసుపు వేసి అందులో ఈ చెక్కు తీసి ఉంచిన బంగాళాదుంపల్ని వేసి అరగంట సేపు ఉంచాలి. తర్వాత బయటకు తీసి బంగాళాదుంపల్ని బట్టపెట్టి శుభ్రంగా తుడిచి చిప్స్ చెక్కే చెక్కతో సన్నగా చెక్కుకోవాలి. బాణలిలో నూనెపోసి కాగిన తర్వాత బంగాళాదుంప చిప్స్ ను కొంచెం కొంచెంగా వేసి వేగినతర్వాత తీసి ఉప్పు, కారం చల్లుకోవాలి. ఈ విధంగా అన్ని చిప్స్ ను వేసి తీసుకోవాలి. ఇవి తెల్లగా ఉంటాయి. అరటికాయతో కూడా ఈ విధంగానే చేసుకోవచ్చు.
అరటికాయ పొడికూర కావలసినవి : అరటికాయలు 4
ఉల్లిపాయలు 2 పచ్చిమిర్చి 4
అల్లం చిన్న ముక్క నూనే 4 టీ స్పూన్లు
ఉప్పు, పసుపు తగినంత ఆవాలు 1/2 టీ స్పూను
ఎండు మిర్చి 2 శెనగపప్పు 1 టీ స్పూను
కొత్తిమీర కొద్దిగా మినపప్పు 1 టీ స్పూను
కర్వేపాకు రెండు రెమ్మలు
1A
చేయు విధానము :
అరటికాయలను చెక్కు తీయకుండా 3 ముక్కలుగా కోసి ఉప్పువేసి నీళ్లలో ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత పై చెక్కుతీసి ఒక పళ్ళెంలో పొడిపొడిగా చేసి పెట్టుకోవాలి. ఉప్పు, పసుపు, ముక్కలమీద చల్లాలి. ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి, నూరి పెట్టుకోవాలి. పొయ్యిమీద బాణలి పెట్టి నూనెపోసి కాగిన తర్వాత ఎండుమిర్చి, శెనగపప్పు, మినపప్పు, ఆవాలు, కర్వేపాకు వేసి నూరి ఉంచుకున్న ఉల్లి, పచ్చిమిర్చి ముద్దను వేసి వేగిన తర్వాత ఈ అరటికాయపొడినివేసి బాగా కలిపి కొత్తిమీరను సన్నగా తరిగివేసి ఉడికిన తర్వాత దించాలి.
అరటి కాయవడ కావలసినవి : మైదా 3 టీ స్పూన్లు
అరటికాయలు 4 పచ్చిశెనగపప్పు అర్ధపావు (18 కిలో)
పచ్చిమిర్చి 4 ఉప్పు, పసుపు సరిపడినంత
ధనియాలు 1 టీ స్పూను కర్వేపాకు రెండురెమ్మలు
వెల్లుల్లి రేకలు 2 పొదీనా ఆకులు 4
కొత్తిమీర కొంచెం నూనె ఒక కప్పు .
అల్లం చిన్నముక్క చేయు విధానము :
అరటికాయలను మరీ మెత్తగా కాకుండా ఒక మాదిరిగా ఉడికించి తొక్క తీసుకోవాలి, శెనగపప్పును నీళ్ళలో ఒక అరగంట నాననివ్వాలి. నానిన తర్వాత నూకనూతగా రుబ్బి పెట్టుకోవాలి. దనియాలు పొడిచేసి తీసేటప్పుడు వెల్లుల్లి రేకలు వేసి దంచాలి. పచ్చిమిర్చి కొత్తిమీర, కర్వేపాకు, అల్లం సన్నగా తరిగి పెట్టుకోవాలి, తర్వాత రుబ్బి ఉంచుకున్న శెనగపప్పులో ధనియాల పొడి పచ్చి మిర్చి కొత్తిమీర, కర్వేపాకు పొదినావేసి ఉడికించి ఉన్న అరటికాయ ఉప్పు,
మీద బాణలి పెట్టి నూనెపోసి కాగిన
సంతోగానీ సాంబారుతో గానీ
పసుపు, మైదావేసి బాగా కలపాలి. పొయ్యిమీద బాణలి పెటి తర్వాత వడలాగాచేసి వేసితీసుఏకోవాలి. ఇది రసంతోగానీ సాంబ తింటే చాలా రుచిగా ఉంటుంది.
కాకరకాయల కూర - | కావలసినవి : కాకరకాయలు లేతవి 1/2 కిలో
ఉల్లిపాయలు 2 నూనె 1 కప్పు
వెల్లుల్లిరేకలు 4 శెనగపప్పు 1/2 కప్పు
పుల్లటి మజ్జిగ 1 కప్పు ఎండుమిర్చి 6.
ఉప్పు, పసుపు తగినంత చేయు విధానము :
అరకప్పు శెనగపప్పును నీళ్ళలో పోసి 1 గంట నానబెట్టుకోవాలి. నానిన తర్వాత రోట్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఉల్లిపాయలు, ఎండుమిర్చి, ఆల్లం, వెల్లుల్లి, ఉప్పు, పసుపువేసి మెత్తగా రుబ్బుకోవాలి. కాకరకాయల పై పొట్టంతా తీసి 4 పక్షాలుగా కోసి పుల్లటి మజ్జిగలో ఉప్పు, పసుపువేసి ఈ కాకరకాయలను అందులోవేసి అరగంట నానిన తర్వాత నీళ్ళతో కడిగి ఉల్లిపాయ, శెనగపప్పు ముద్దను 4 పక్షాల్లో సర్దాలి. పొయ్యిమీద బాణలి పెట్టి, నూనెపోసి అన్ని కాకరకాయల ముక్కలను 'కొంచెం కొంచెంగా ఎర్రగా వేయించుకోవాలి. మరో రకంకాకరకాయల వేపుడు కావలసినవి : కాకరకాయలు సన్నవి 12 కిలో బియ్యం 5 టీ స్పూను మజ్జిగ 1 కప్పు నూనె 1 కప్పు
ఎండుమిర్చి 6 ఉప్పు, పసుపు తగినంత ఉపు
జీలకర్ర 1/2 టీ స్పూను
చేయు విధానము :-
కాకరకాయలను శుభ్రంగా కడిగి చెక్కుతీసి వేలంత లావుగా ముక్కలు కోసి మజిగలో వేయాలి. అరగంట నానిన తర్వాత తీసి పెట్టుకోవాలి. బియ్యం నానబెట్టి రోట్లో వేసి ఎండు మిర్చి, ఉప్పు, పసుపు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. మెతగా అయిన ఈ ముద్దను కాకరకాయ ముక్కల్లోవేసి కలపాలి. పొయ్యిమీద బాణలి పెట్టి నూనెపోసి కాగిన తర్వాత నాలుగేసి ముక్కల చొప్పున నూనెలో వేసి గారెల మాదిరిగా వేపి తీసుకోవాలి. ఇవి చాలా బావుంటాయి.
కాకరకాయల కూర -2 కావలసినవి : కాకరకాయలు 1/2 కిలో
ఉల్లిపాయలు 3 నూనె 6 టీ స్పూన్లు
ఎండుమిర్చి 8 - జీలకర్ర 1 టీ స్పూను
ఉప్పు, పసుపు కొంచెం చింతపండు కొంచెం .
పంచదార 2 టీ స్పూన్లు పెరుగు లేక మజ్జిగ అరకప్పు చేయు విధానము :
కాకరకాయలను శుభ్రంగా కడిగి గుండ్రంగా పెద్ద ముక్కలు కోసి పెట్టుకోవాలి. ఈ ముక్కల్లో మజ్జిగ, చింతపండు, ఉప్పు, పసుపు, కొంచెం నీళ్ళుపోసి ఉడికించాలి. నీరంతా యిగిరినతర్వాత దించుకోవాలి. పొయ్యిమీద బాణలి పెట్టినూనె పోసి కాగినతర్వాత ఈ ఉడికించిన కాకరకాయ ముక్కలను కొద్దికొద్దిగా వేపి తీసికోవాలి. అన్నీ ఈ విధంగా వేగిన తర్వాత మిగిలిన నూనెలో ఉల్లిపాయముక్కలు తరిగివేసి బాగా వేపాలి. సన్నని సెగమీద ఉంచితే ఉల్లిపాయబాగా మగ్గుతుంది. తర్వాత వేపి ఉంచుకున్న కాకరకాయముక్కలను వేయాలి. జీలకర్ర, ఎండుమిర్చి, రోట్లో వేసి దంచి తీసేటప్పుడు వెల్లుల్లి రేకలు వేసి మెత్తగా దంచి వేగుతున్న కాకరకాయ ముక్కల మీద జల్లి పంచదారవేసి, కొత్తిమీర సన్నగా తరిగివేసి, వేగిన తర్వాత దించుకోవాలి.
కాకరకాయ బగారా కావలసినవి : చిన్న లేత కాకరకాయలు 1/2 కిలో
లవంగాలు 2 ఉల్లిపాయలు 2
ఎండుమిర్చి 6 అల్లం ముక్క 2 అంగుళాల ముక్క
నూనె 8 టీ స్పూన్లు వెల్లుల్లి రేకలు 6
ధనియాలు 1 టీ స్పూను కొబ్బరి ముక్క చిన్నది
ఉప్పు, పసుపు తగినంత దాల్చిన చెక్క ముక్కలు 2
చింతపండు నిమ్మకాయంత చేయు విధానము :
కాకరకాయలపై నున్న గొగ్గురు అంతా తీసివేసి శుభ్రంగా కడిగి 4 పక్షాలుగా కోసి ఉంచుకోవాలి. మసాలా సామాను, కొబ్బరి ఎండుమిర్చి, అల్లం, వెల్లుల్లి, చింతుపండు అన్నీ రోట్లో వేసి మెత్తగా రుబ్బి తీసుకోవాలి. తీసేముందు ఉల్లిపాయలు కూడా వేసి రుబ్బి తీసుకోవాలి. పొయ్యిమీద బాణలి పెట్టి నూనెపోసి కాగిన తర్వాత ఈ రుబ్బి తీసుకున్న ముద్దను వేసి ఎర్రగా వేగిన తర్వాత ఈ కోసి ఉంచుకున్న కాకరకాయలను, ఉప్పు, పసుపు వేసి కొంచెం నీళ్ళుపోసి సన్నని సెగమీద ఉడకనిచ్చి దించుకోవాలి. పులుపును బట్టి చింతపండును వేసుకోవచ్చు.
కాకరకాయ వేపుడు లేదా చిప్స్ కావలసినవి : కాకరకాయలు 1/2 కిలో పది
ఉప్పు, పసుపు, కారం సరిపడా ఉల్లిపాయలు 2
నూనె సరిపడా వెల్లుల్లి రేకలు 5.
పంచదార 2 టీ స్పూన్లు కర్వేపాకు రెండు రెమ్మలు విడ
18
చేయు విధానము :
కాకరకాయలను కడిగి సన్నగా చక్రాల్లాగా కోసి ఉంచుకొని ఒక గిన్నెలోకి తీసుకొని ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి గట్టిగా పిండి తీసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. పొయ్యిమీద బాణలి పెట్టి ఎక్కువ నూనె పోసి ఈ పిండి ఉంచుకున్న కాకరకాయ ముక్కల్ని కొంచెం కొంచెంగా వేసి చిప్స్లాగా ఎర్రగా వేయించి తీసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసి తీసుకున్న తర్వాత పొయ్యిమీద గిన్నె పెట్టి 3 స్పూన్ల నూనెవేసి కాగిన తర్వాత కర్వేపాకు, వెల్లుల్లి రేకలు చిదిపివేసి కోసి ఉంచిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఎర్రగా వేగిన తర్వాత కాకరకాయచిప్స్ను వేసి కారం 1 స్పూను, పంచదార వేసి బాగా కలిపి దించిన తర్వాత చల్లారిన వెంటనే సీసాలో పెట్టుకుంటే 10 రోజుల వరకు నిలవ వుంటాయి. చిప్స్ వేపగా మిగిలిన నూనెను తాలింపులకు ఉపయోగించు కోవచ్చు.
ఆగాకరకాయల వేపుడు కావలసినవి : ఆగాకరకాయలు 1/2 కిలో
వెల్లుల్లిపాయ 1. నూనె 8 టీ స్పూన్లు
కర్వేపాకు రెండు రెమ్మలు ఉప్పు, కారం, పసుపు తగినంత చేయు విధానము :
ఆగాకరకాయలు శుభ్రంగా కడిగి సన్నగా ముక్కలు తరిగి పెట్టుకోవాలి. పొయ్యిమీద బాణలి పెట్టి నూనెపోసి వెల్లుల్లిపాయ ఒలిచి తొక్కలు తీసి కర్వేపాకుతో పాటు వెయ్యాలి. తర్వాత కోసి ఉంచిన ఆగాకరకాయ ముక్కల్ని వేసి ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి సన్నని సెగమీద వేపాలి. తర్వాత మూత పెట్టి కొంచెం సేపు ఉంచాలి. బాగా వేగిన తర్వాత కారం జల్లి కలిపి దించుకోవాలి. ఇది రెండు రోజులు నిల్వ ఉంటుంది.
19
పిండి - బెల్లంతో ఆగాకరకాయ కావలసినవి : ఆగాకర కాయలు 1/2 కిలో
చింతపండు తగినంత ఉప్పు, కారం, పసుపు తగినంత
బెల్లం చిన్నముక్క ఎండుమిర్చి 7
శెనగపప్పు 1/2 టీ స్పూను మినపప్పు 1/2 టీ స్పూను
ఆవాలు 1/2 టీ స్పూను బియ్యంపిండి 2 టీ స్పూన్లు
నూనె 4 టీ స్పూన్లు కర్వేపాకు రెండు రెమ్మలు చేయు విధానము :
ఆగాకరకాయలు సన్నగా ముక్కలు తరిగి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో ఈ ముక్కలను వేసి చింతపండు చిక్కగా పిసికి ఈ ముక్కల్లో పోసి ఉప్పు, కారం, పసుపు వేసి ఉడికించాలి నీరంతా యిగిరేవరకు ఉడికించాలి. తర్వాత బియ్యం పిండిలో బెల్లంగానీ, పంచదారగానీ కలిపి ఈ కూర పై జల్లిదించి ప్రక్కన పెట్టాలి. పొయ్యిమీద బాణలి పెట్టి నూనెపోసి కాగిన తర్వాత ఎండుమిర్చి, శెనగపప్పు, మినపప్పు, ఆవాలు, కర్వేపాకు వేసి వేగిన తర్వాత ఆగాకరకాయ ముక్కల్ని వేసి బాగా కలిపి ఉడికిన తర్వాత దించాలి.
సొరకాయ పులుసు కావలసినవి : లేతసొరకాయ 1
ఉల్లిపాయలు 4 నూనె 12 టీ స్పూన్లు
పచ్చిమిర్చి 6, ఎండుమిర్చి 4 - చింతపండు కొంచెం
వెల్లుల్లిపాయ 1 జీలకర్ర 1 టీ స్పూను
ఆవాలు 1 టీ స్పూను మినపప్పు 1 టీ స్పూను
బెల్లం చిన్నముక్క, కొత్తిమీర కొంచెం మెంతులు కొంచెం
కర్వేపాకు రెండు రెమ్మలు
20
చేయు విధానము :
సొరకాయ చెక్కుతీసి వెడల్పుగా సన్నగా కోసి ఉంచుకోవాలి. ఉల్లిపాయలు, జీలకర్ర, వెల్లుల్లి రేకలు కలిపి ముద్దలా నూరుకోవాలి. పొయ్యిమీద బాణలి పెట్టి 8 స్పూన్లు నూనెవేసి కాగినతర్వాత కోసి ఉంచిన ముక్కలను వేసి సన్నని సెగమీద ముక్క మెత్తబడేవరకు వేపాలి. బాగా వేగినతర్వాత క్రిందకు దించాలి. ఈవిధంగా సొరకాయ ముక్కలన్నింటిని వేసి తీసుకోవాలి. పొయ్యిమీద గిన్నె పెట్టి 4 స్పూన్లు నూనెవేసి తాలింపుసామానంతావేసి ఉంచుకున్న సొరకాయముక్కలను వేసి ఉప్పు, పసుపు, కారం వేసి చింతపండు పులుసు పిసికివేసి బాగా కలపాలి. ఉడుకుతున్నప్పుడు చిన్న బెల్లంముక్కను వేసి దించేముందు కొత్తిమీరవేసి దించుకోవాలి. నూనె తక్కువగా ఉండి ముక్కలు అడుగున మాడిపోతాయనుకుంటే ఇంకా 2 లేక 4 స్పూన్లు నూనె వేసేది.
శెనగపప్పు - సొరకాయ మసాలాకూర కావలసినవి : లేతసొరకాయ చిన్నది 1
ఉల్లిపాయలు 3 పచ్చిమిర్చి 6
శెనగపప్పు 1 కప్పు నూనె 4 టీ స్పూన్లు
ధనియాలు 2 టీ స్పూన్లు ఉప్పు, కారం, పసుపు తగినంత వెల్లుల్లిపాయ 1 కర్వేపాకు రెండు రెమ్మలు
కొత్తిమీర కొంచెం జీలకర్ర 1/2 టీ స్పూను చేయు విధానము :
సొరకాయ చెక్కుతీసి కొంచెం పెద్దముక్కలు కోసి ఉంచాలి. ఉల్లి, పచ్చిమిర్చి పొడవుగా తరిగి పెట్టుకోవాలి. శెనగపప్పును నీళ్లలో పోసి 1 గంట నానబెట్టాలి. ధనియాలు వేడిచేసి పొడికొట్టి తీసేముందు వెల్లుల్లి రేకలువేసి మెత్తగదంచి తీసుకోవాలి. పొయ్యిమీద గిన్నె పెట్టి నూనెపోసి ఉల్లి, పచ్చిమిర్చి
ముక్కలువేసి వేగినతర్వాత సొరకాయముక్కలను వేసి నానిన శనగపప్పును వేసి బాగా కలిపి ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి కొంచెం నీరుపోసి మూత పెట్టాలి. ఉడికిన తర్వాత కొత్తిమీర, కర్వేపాకు సన్నగా తరిగివేసి కొట్టిఉంచిన ధనియాల పొడిని కూడా పైన జల్లి తీసుకోవాలి.
శనగపప్పు కొబ్బరి కూర కావలసినవి : శనగపప్పు 1/4 కిలో
తాలింపు సామాను : కొబ్బరి పచ్చిది ఒక చిప్ప
ఆవాలు 1/2 టీ స్పూను ఉప్పు, కారం, పసుపు సరిపడినంత
జీలకర్ర 1/2 టీ స్పూను ఉల్లిపాయలు 2
కొత్తిమీర 10 రెమ్మలు పచ్చిమిర్చి 4
వెల్లుల్లి రేకలు 6. కర్వేపాకు కొంచెం
ఎండుమిరపకాయలు 2 చేయు విధానము :
శనగపప్పు శుభ్రము చేసుకొని బాగా కడిగి పొయ్యి మీద గిన్నె పెట్టి నీళ్ళు పొసి కడిగిన శెనగపప్పును అందులో వేసి సగం ఉడికిన తర్వాత ఉల్లి పచ్చిమిర్చి సన్నగా తరిగివేసి ఉప్పు, కారము పసుపు వేసి ఉడికిన తర్వాత కొబ్బరి కొత్తిమీర వేసి దించుకోవాలి. పొయ్యిమీద బాణలి పెట్టి నూనెవేసి పోపు సామాను అంతా వేసి వెల్లుల్లి వేసి బాగా వేగిన తర్వాత ఈ శెనగపప్పు కూరలో వేయాలి. వెల్లుల్లి ఇష్టము లేనివారు మానివేయవచ్చు. కొబ్బరి తక్కువ కావలసినవారు తగ్గించుకోవచ్చు. ఎక్కువ కావలసినవారు ఎక్కువ వేసుకోవచ్చును.
బెంగుళూరు మిర్చికూర కావలసినవి : బెంగుళూరు మిర్చి 1/2 కిలో
నూనె 5 టీ స్పూన్లు వేయించిన శనగపప్పు అరపావు
జీలకర్ర 1 టీ స్పూను
వెల్లుల్లిపాయ 1
ధనియాలు 2 టీ స్పూన్లు పచ్చికర్వేపాకు రెండు రెమ్మలు
ఉల్లిపాయలు 4 దాల్చినచెక్క చిన్నముక్కలు 2
అల్లం చిన్నముక్క ఎండుకొబ్బరి లేక పచ్చికొబ్బరి సగం చిప్ప. చేయు విధానము :
బెంగుళారు పచ్చిమిరపకాయలను శుభ్రముగా కడిగి తొడిమ తీయకుండ అలాగే ఉంచి 4 పక్షాలుగా కోయ్యాలి. శనగపప్పు ఎండుకొబ్బరి సగం వెల్లుల్లిపాయల పొడిచేసి పెట్టుకోవాలి. ధనియాలు, జీలకర్ర, అల్లం, దాల్చినచెక్క, ఉప్పు, ఉల్లిపాయలు రోట్లో వేసి, మెత్తగా దంచి మిగతాసగం వెల్లుల్లిరేకలు వేసి, దంచి తీసుకోవాలి. పొయ్యిమీద బాణలి పెట్టి నూనెపోసి నూరి ఉంచుకున్న ఉల్లిముద్దను వేసి బాగా వేపాలి. 4 పక్షాలుగా కోసి ఉంచుకున్న మిరపకాయలకు శనగపప్పు, ఎండుకొబ్బరిపోడిని సర్దాలి. ఉల్లిముద్ద వేగిన తర్వాత, ఈ మిరపకాయలను అందులో వేసి అటూ ఇటూ కలిపి, కొద్దినీళ్లు జల్లి, సన్నని సెగమీద పెట్టి, మూత పెట్టాలి. బాగా మగ్గిన తర్వాత కొత్తిమీర, కర్వేపాకు సన్నగా తరిగివేసి, దించుకోవాలి. ఇది చాలా త్వరగా అవుతుంది.
బెంగుళూరు మిర్చి మరోరకం కావలసినవి : బెంగుళూరు మిర్చి 1/2 కిలో
ఎండుకొబ్బరి చిప్ప 1 (చిన్నది) ఉల్లిపాయలు 1/4 కిలో
వేరు సెనగపప్పు 1/2 కప్పు ఉప్పు, పసుపు సరిపడా
వేయించిన సెనగపప్పు 1/2 కప్పు అల్లం, వెల్లుల్లి నూరినది 1/2 టీస్పూను, ఎండుమిర్చి 4 కొత్తిమీర కట్ట 1 (చిన్నది) నూనె 1/2 కప్పు
23
చేయు విధానము :
మిర్చి పొడవుగా, సన్నగా ముక్కలు కోసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు అదేమాదిరిగా కోసి పెట్టుకోవాలి. రోలు శుభ్రంగా కడిగి, తుడుచుకుని, ఎండు కొబ్బరి చిప్ప తురుముకుని, వేరు సెనగ పప్పు, వేయించిన సెనగ పప్పు, ఎండుమిరపకాయలు వేసి మెత్తగా పొడి కొట్టి పెట్టుకోవాలి. పొయ్యిమీద బాణలి పెట్టి, నూనెపోసి, ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా దోరగా వేపుకుని, ఉప్పు, పసుపు వేసి, ఈ కొట్టి ఉంచుకున్న పొడిని వేసి, కొత్తిమీర సన్నగా తరిమివేసి బాగా కలుపుకుని దించుకోవాలి.
టమాటా - బెంగుళూరు మిర్చి
ముద్దకూర కావలసినవి : బెంగుళూరు మిర్చి 1/2 కిలో
ఎండుకొబ్బరి చిన్నముక్క టమాట 1/4 కిలోల
ఉల్లిపాయలు 1/4 కిలో నువ్వులు 1/2 కప్పులు
ఉప్పు, పసుపు తగినంత నూనె 1/2 కప్పు
కారం 1 టీ స్పూను పాలు 1/4 కిలో
ధనియాలు 1/2 టీ స్పూను లవంగాలు 2, యాలకులు 2 దాల్చిన చెక్క 2 ముక్కలు చేయు విధానము :
బెంగుళూరు మిర్చి, ఉల్లిపాయలు సన్నగా ముక్కలు కోసి పెట్టుకోవాలి. పావుకిలో పాలల్లో నువ్వులు నానబెట్టి పెట్టుకోవాలి. ధనియాలు కొద్దిగా వేడిచేసి పొడిచేసి, పైన చెప్పిన లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వేసి పొడికొట్టి తీసేటప్పుడు రెండు వెల్లుల్లి రేకలు వేసి తీస్కోవాలి. నువ్వులు మెత్తగా నూరి పెట్టుకొని పాలల్లోకి తీసికోవాలి. పొయ్యిమీద బాణలి పెట్టి, నూనెవేసి, మిర్చి, ఉల్లిపాయ బాగా వేపి, ఉప్పు, పసుపు వేసి, టమాటా ముక్కలు సన్నగా కోసి వేసి,
24
ఈ నూరి ఉంచుకున్న నువ్వుల పాలను కూడా పోసి, బాగా వేగిన తరువాత, 5 ఉంచుకున్న ధనియాల పొడిని కూడా వేసి, కొత్తిమీర సన్నగా తరిగివేసి, బాగా కలుపుకుని దించుకోవాలి.
బెంగుళూరు మిర్చి - పులుసు కావలసినవి : బెంగుళూరు మిర్చి 1/2 కిలో
కర్వేపాకు కొంచెం పావుకిలో ఉల్లిపాయలు
కారం 1 టీ స్పూను కొత్తిమీర కట్ట చిన్నది .
లవంగాలు 2, యాలకులు 2 మెంతులు 1/2 టీ స్పను
దాల్చిన చెక్క ముక్కలు 2 పులుపుకు తగినంత చింతపండు
ధనియాల పొడి 1 టీ స్పూను ఆవాలు 1/2 టీ స్పూను
బెల్లం కొంచెం నూనె 1/2 కప్పు
ఉప్పు, పసుపు తగినంత
చేయు విధానము :
బెంగుళూరు మిర్చి, ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. పొయ్యిమీద గిన్నె పెట్టి, నూనె పోసి, కాగిన తరువాత, మెంతులు, ఆవాలు, కర్వేపాకు వేసి, వేగిన తర్వాత కోసి ఉంచుకున్న ఉల్లి పచ్చిమిర్చి ముక్కలు వేసి, సన్నని సెగమీద బాగా వేగనిచ్చి, వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసి, చింతపండు పులుసు వేసి, బెల్లం కూడా వేసి, కొత్తిమీర సన్నగా తరిగివేసి, ధనియాలు పొడివేసి, మెత్తగా ఉడికిన తర్వాత గుజ్జుగా అయిన తర్వాత దించుకోవాలి.
బెంగుళూరుమిర్చి మసాలతోకూర కావలసినవి : బెంగుళూరు మిర్చి 1/2 కిలో
చింతపండు నిమ్మకాయంత ఉల్లిపాయలు 4
యాలకులు 2 వేరుశనగగింజలు అర్ధపావు
గసగసాలు 2 టీ స్పూన్లు
No comments:
Post a Comment